వైరస్‌ను వడపోద్దాం.. మారుతి సుజుకి కార్లలో PM 2.5 క్యాబిన్ ఫిల్టర్

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ చాప క్రింద నీరులా విస్తరిస్తున్న సంగతి తెలిసినదే. ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు వ్యక్తిగత శుభ్రత అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలు వస్తువులను శుభ్రంగా ఉంచుకోవటం చాలా అవసరం. ప్రత్యేకించి కార్లలో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన గాలి ఉండేలా చూసుకోవటం ఎంతో అవసరం.

వైరస్‌ను వడపోద్దాం.. మారుతి సుజుకి కార్లలో PM 2.5 క్యాబిన్ ఫిల్టర్

ఏసి ఉపయోగించే కార్లలో వైరస్ ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కారులోని ఎయిర్‌ను ఫిల్టర్ చేసేందుకు తాజాగా ఆటోమొబైల్ కంపెనీ తమ వాహనాల్లో అధునాతన క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే పలు కార్ కంపెనీ తమ కొత్త వాహనాల్లో ఖరీదైన పిఎమ్ 2.5 క్యాబిన్ ఫిల్టర్లను అందిస్తున్నారు.

వైరస్‌ను వడపోద్దాం.. మారుతి సుజుకి కార్లలో PM 2.5 క్యాబిన్ ఫిల్టర్

తాజాగా, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా కూడా వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తమ కార్లలో ఈ తరహా కొత్త క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్లను అందిస్తోంది. మారుతి సుజుకి కార్లలో సురక్షితమైన మరియు శుభ్రమైన గాలిని అందించడానికి వాటిలో PM 2.5 క్యాబిన్ ఫిల్టర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

MOST READ:సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

వైరస్‌ను వడపోద్దాం.. మారుతి సుజుకి కార్లలో PM 2.5 క్యాబిన్ ఫిల్టర్

రెగ్యులర్ ఫిల్టర్‌ (పిఎమ్ 10)తో పోలిస్తే, పిఎమ్ 2.5 ఫిల్టర్ ప్రసరణ వ్యవస్థ‌లో ఇది చిన్న కణాలను సైతం తొలగిస్తుంది. ఈ ఫిల్టర్లు అధిక వడపోత నాణ్యతను కలిగి ఉండి ఎలెక్ట్రోస్టాటిక్ నాన్-ఓవెన్ క్లాత్‌తో తయారవుతాయి. ఇవి దుమ్ము, ధూళి, పొగ, ఫ్లై యాష్ మొదలైన వాటిని తొలగించడమే కాకుండా, PM 2.5 స్థాయి కణాలను కూడా తొలగిస్తుంది.

వైరస్‌ను వడపోద్దాం.. మారుతి సుజుకి కార్లలో PM 2.5 క్యాబిన్ ఫిల్టర్

రెగ్యులర్ ఫిల్టర్లు (పిఎమ్ 10) పొగ, పొగాకు పొగ మరియు డీజిల్ పొగను ఫిల్టర్ చేయలేవు. కానీ, పిఎమ్ 2.5 ఫిల్టర్లు వీటిని సమర్థవంతంగా తొలగించగలవు. ఈ ఫిల్టర్ కూడా డౌన్ సైడ్ కలిగి ఉంటుంది. అయితే, కస్టమర్లు PM 2.5 ఫిల్టర్లను తమ కార్లలో అమర్చుకోవాలంటే, అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్న యమహా ఎమ్‌టి-09 బైక్ టీజర్ వీడియో

వైరస్‌ను వడపోద్దాం.. మారుతి సుజుకి కార్లలో PM 2.5 క్యాబిన్ ఫిల్టర్

మార్కెట్లో ఈ ఫిల్టర్ ధర 599 రూపాయలుగా ఉంది. మారుతి ప్రస్తుతం ఈ ఫిల్టర్‌ను దాని మూడవ తరం స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఎక్స్‌ఎల్ 6, సెకండ్-జెన్ ఎర్టిగా, ఇగ్నిస్, సియాజ్, ఎస్-క్రాస్ మరియు విటారా బ్రెజ్జా వంటి మోడళ్ల కోసం అందుబాటులో ఉంచింది.

వైరస్‌ను వడపోద్దాం.. మారుతి సుజుకి కార్లలో PM 2.5 క్యాబిన్ ఫిల్టర్

మారుతి సుజుకి ఇండియాకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో తమ వాహనాల కోసం కంపెనీ అందిస్తున్న సభ్యత్వ ఆధారిత యాజమాన్యాన్ని (సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ఓనర్‌షిప్) విధానాన్ని హైదరాబాద్ నగరంలో కూడా ప్రారంభించినట్లు పేర్కొంది.

MOST READ:లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ కె 1600 జిటి బైక్‌పై కనిపించిన సద్గురు జగ్గీ వాసుదేవ్

వైరస్‌ను వడపోద్దాం.. మారుతి సుజుకి కార్లలో PM 2.5 క్యాబిన్ ఫిల్టర్

మారుతి సుజుకి వాహనాలను నేరుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయకుండా, సబ్‌స్క్రిప్షన్ పద్దతిలో సొంతం చేసుకోవడానికి ఇదొక కొత్త మరియు సులభమైన మార్గమని కంపెనీ తెలిపింది. ఇందుకు కస్టమర్లు అన్ని ఫీజులతో కూడిన నెలసరి మొత్తాన్ని చందా రూపంలో చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.

వైరస్‌ను వడపోద్దాం.. మారుతి సుజుకి కార్లలో PM 2.5 క్యాబిన్ ఫిల్టర్

మారుతి సుజుకి సబ్‌స్క్రిప్షన్ సేవల్లో జీరో-డౌన్ పేమెంట్, ఫుల్ కార్ మెయింటినెన్స్, ఇన్సూరెన్స్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు లభిస్తాయి. అంతేకాదు, కస్టమర్లకు రీసేల్ రిస్క్ కూడా ఉండదు. మారుతి సుజుకి డీలర్ ఛానల్ ద్వారా వాహనాల మెయింటినెన్స్, భీమా కవరేజ్ మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు కూడా లభిస్తాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:20 సంవత్సరాల తర్వాత కూడా కొత్తగా ఉన్న పాత కారు.. ఇది ఒక పొలిటికల్ లీడర్ ఇష్టమైన కార్ కూడా

వైరస్‌ను వడపోద్దాం.. మారుతి సుజుకి కార్లలో PM 2.5 క్యాబిన్ ఫిల్టర్

మారుతి సుజుకి కార్లలో PM 2.5 క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్‌ను జోడించడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత పరిస్థితుల్లో కార్ క్యాబిన్‌లో ఎల్లప్పుడు స్వచ్ఛమైన గాలి ఉండేలా చూసుకోవటం ఎంతో అవసరం. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న మారుతి సుజుకి తమ కస్టమర్ల కోసం PM 2.5 ఎయిర్ ఫిల్టర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫిల్టర్ల సాయంతో కారులో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki Offer PM 2.5 Cabin Filter For Some Of Its Cars Details, Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X