హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా', దేశీయ విపణిలో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ "విటారా బ్రెజ్జా" మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. భారత మార్కెట్లో ఈ మోడల్ హాట్ కేకులా అమ్ముడవుతోంది. కాంపాక్ట్ షేప్, స్టైలిష్ డిజైన్, అట్రాక్టివ్ ఫీచర్లతో ఇది యువ కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

మారుతి సుజుకి తొలిసారిగా 2016లో విటారా బ్రెజ్జా ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్ భారత మార్కెట్లో ప్రారంభమైనప్పటి నుండి కస్టమర్ల నుండి మంచి స్పందనను సొంతం చేసుకొని పెద్ద సంఖ్యలో అమ్ముడైంది. అప్పటి నుండి ఇప్పటి వరకూ మారుతి సుజుకి ఇండియా మొత్తం 5.5 లక్షల యూనిట్ల విటారా బ్రెజ్జా కార్లను విక్రయించింది.

హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

ఈ ఏడాది ఆరంభంలో కంపెనీ సరికొత్త 2020 విటారా బ్రెజ్జా దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ కేవలం 6 నెలల స్వల్ప వ్యవధిలోనే 32,000 యూనిట్ల కస్టమర్లను సొంతం చేసుకుంది. భారత మార్కెట్లో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలు రూ.7.34 లక్షల నుండి రూ.1140 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ఢ, ఢిల్లీ).

MOST READ: టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

కొత్త 2020 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఎస్‌యూవీలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి, ఇందులో మైల్డ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన కొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ డిజైన్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే బ్రాండ్ యొక్క సరికొత్త స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ వంటి ఎన్నో విశిష్టమైన ఫీచర్లు ఈ కారు సొంతం.

హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

ఇంజన్ విషయానికి వస్తే, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఒకే ఒక ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. అది, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ బ్రాండ్ యొక్క మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని (ఎస్‌విహెచ్‌ఎస్) కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 104 బిహెచ్‌పి పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

MOST READ: రెనో కార్లపై రూ.70,000 డిస్కౌంట్స్; ఏయే మోడల్‌పై ఎంతో తెలుసా?

హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

విటారా బ్రెజ్జా సాధించిన విజయంపై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "విటారా బ్రెజ్జాను మార్కెట్లో ప్రారంభించినప్పటి నుండి, ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఆధిపత్యం చెలాయించింది. దాని బోల్డ్ డిజైన్ లాంగ్వేజ్, శక్తివంతమైన పనితీరు మరియు స్పోర్టీ క్యారెక్టర్‌తో ఈ ఎస్‌యూవీ ట్రెండ్ సెట్టర్‌గా కొనుగోలుదారుడి అభిరుచితో క్లిక్ చేయబడింది. ఇది అత్యంత తక్కువ సమయంలోనే అధిక అవార్డు పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది, అలాగే ఈ మోడల్ సేల్స్ చార్టులలో ఆధిపత్యం చెలాయించిందని" అన్నారు.

హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

"విటారా బ్రెజ్జాలోని శక్తివంతమైన 1.5 ఎల్ పెట్రోల్ ఇంజన్‌ను అనేక డిజైన్ అప్‌డేట్స్‌తో కస్టమర్లను మరింత ఆనందపరిచింది మరియు ఈ విభాగంలో దాని ధ్రువ స్థానాన్ని మరితం సుస్థిరం చేసుకుంది. విటారా బ్రెజ్జా సాధించిన ఈ 5.5 లక్షల అమ్మకాల మైలురాయి ప్రస్తుత వినియోగదారుల ప్రాధాన్యతలకు మరియు మార్కెట్ పోకడలకు అనుగుణంగా మారుతి సుజుకి యొక్క పోర్ట్‌ఫోలియోను స్థిరంగా ఆవిష్కరించడానికి మరియు బలోపేతం చేయడానికి మేము చేస్తున్న మా ప్రయత్నాలను నిర్ధారిస్తుందని" ఆయన చెప్పారు.

MOST READ: మాజీ ముఖ్యమంత్రిని ఫిదా చేసిన మహీంద్రా థార్.. ఇంతకీ ఎవరా CM తెలుసా?

హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా సేల్స్ మైల్‌స్టోన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అందుబాటులో ఉన్న బెస్ట్ మోడళ్లలో ఒకటి. విటారా బ్రెజ్జా ఈ విభాగంలో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యువి300 మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. కాకపోతే, ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది, ఇందులో డీజిల్ ఇంజన్ అందుబాటులో లేదు.

Most Read Articles

English summary
Maruti Suzuki launched the Vitara Brezza compact SUV in 2016 in the Indian market. Since its inception, the Brezza has got an overwhelming response for the customers and have sold in big numbers. Maruti is celebrating 5.5 Lakh units of the Vitara Brezza sold in this short period. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X