హైదరాబాద్‌లో మారుతి 'సబ్‌స్క్రిప్షన్' ప్లాన్; రూ.15,479 నుండి ప్రారంభం

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎమ్ఎస్ఐఎల్) దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో తమ వాహనాల కోసం అందిస్తున్న సభ్యత్వ ఆధారిత యాజమాన్యాన్ని (సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ఓనర్‌షిప్) మరిన్ని కొత్త నగరాల్లో ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ స్కీమ్‌ను తాజాగా హైదరాబాద్ మరియు పూనే నగరాల్లో ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.

హైదరాబాద్‌లో మారుతి 'సబ్‌స్క్రిప్షన్' ప్లాన్; రూ.15,479 నుండి ప్రారంభం

మారుతి సుజుకి వాహనాలను నేరుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయకుండా, సబ్‌స్క్రిప్షన్ పద్దతిలో సొంతం చేసుకోవడానికి ఇదొక కొత్త మరియు సులభమైన మార్గమని కంపెనీ తెలిపింది. ఇందుకు కస్టమర్లు చేయాల్సిందల్లా అన్ని ఫీజులతో కూడిన నెలసరి మొత్తాన్ని చందా రూపంలో చెల్లించడమే.

హైదరాబాద్‌లో మారుతి 'సబ్‌స్క్రిప్షన్' ప్లాన్; రూ.15,479 నుండి ప్రారంభం

మారుతి సుజుకి సబ్‌స్క్రిప్షన్ సేవలో కస్టమర్లకు జీరో-డౌన్ పేమెంట్, ఫుల్ కార్ మెయింటినెన్స్, ఇన్సూరెన్స్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు లభిస్తాయి. అంతేకాదు, కస్టమర్లకు రీసేల్ రిస్క్ కూడా ఉండదు. మారుతి సుజుకి డీలర్ ఛానల్ ద్వారా వాహనాల మెయింటినెన్స్, భీమా కవరేజ్ మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలను కూడా కంపెనీ చూసుకుంటుంది.

MOST READ:కర్ణాటకలో కొత్త హెల్మెట్ రూల్.. అదేంటో తెలుసా ?

హైదరాబాద్‌లో మారుతి 'సబ్‌స్క్రిప్షన్' ప్లాన్; రూ.15,479 నుండి ప్రారంభం

కారును నేరుగా మారుతి సుజుకి నుండి కొనుగోలు చేయకుండా, కారును సొంతం చేసుకోవడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలను అనుభవించాలనుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఈ సబ్‌స్క్రయిబ్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది కారును దీర్ఘకాలం పాటు లీజుకు తీసుకోవటం లాంటిదే, కాకపోతే ఈ విధానంలో చివర్లో కారును పూర్తిగా సొంతం చేసుకోవాలనుకుంటే, అందుకు అవకాశం కూడా ఉంటుంది.

హైదరాబాద్‌లో మారుతి 'సబ్‌స్క్రిప్షన్' ప్లాన్; రూ.15,479 నుండి ప్రారంభం

ఈ సబ్‌స్క్రిప్షన్ విధానం ద్వారా కారును లీజుకు తీసుకున్న కస్టమర్లు డౌన్‌పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. మారుతి సుజుకి అరేనా షోరూమ్‌లు మరియు నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా కంపెనీ ఈ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత స్కీమ్‌ను అందిస్తోంది.

ఈ స్కీమ్ క్రింద మారుతి సుజుకి స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, బాలెనో, సియాజ్ మరియు ఎక్స్‌ఎల్6 మొదలైన వాహనాలు ఉన్నాయి. వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ పదవీకాలం కోసం 24, 36, మరియు 48 నెలల వ్యవధిలలో వారికి నచ్చిన కాల పరిమితిని ఎంచుకోవచ్చు.

MOST READ:కొంపముంచిన గూగుల్ మ్యాప్‌.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా ?

హైదరాబాద్‌లో మారుతి 'సబ్‌స్క్రిప్షన్' ప్లాన్; రూ.15,479 నుండి ప్రారంభం

ఈ సబ్‌స్క్రిప్షన్ సేవల కోసం వసూలు చేసే ధరలను గమనిస్తే, ఉదాహరణకు హైదరాబాద్‌లో స్విఫ్ట్ ఎల్‌ఎక్స్ఐ వేరియంట్‌ను సబ్‌స్క్రిప్షన్‌కు తీసుకుంటే నెలకు అన్ని పన్నులతో కలిపి రూ.15,479 చెల్లించాల్సి ఉంటుంది. అదే పూనే నగరంలో అయితే నెలకు రూ.15,354 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కస్టమర్లు ఇలా లీజుకు తీసుకున్న వాహనాలను చివర్లో సొంతం చేసుకోవాలనుకుంటే, సబ్‌స్క్రిప్షన్ కాలం ముగిసిన తర్వాత బైబ్యాక్ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్‌లో మారుతి 'సబ్‌స్క్రిప్షన్' ప్లాన్; రూ.15,479 నుండి ప్రారంభం

ఈ విషయం గురించి మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "మారుతున్న వ్యాపార విధానంలో, చాలా మంది వినియోగదారులు ప్రజా రవాణా నుండి వ్యక్తిగత కార్లకు మారాలని కోరుకుంటున్నారు. ఆర్థికంగా సులువైన మరియు దీర్ఘకాలిక ఆర్థిక కట్టుబాట్లను లేని పరిష్కారాల కోసం కస్టమర్లు వెతుకుతున్నారు. అలాంటి కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టబడినదే ఈ మారుతి సుజుకి సబ్‌స్క్రయిబ్ ప్లాన్."

MOST READ:యమహా క్యూటెస్ట్ స్కూటర్ 'వినోరా' గురించి మీకు తెలుసా?

హైదరాబాద్‌లో మారుతి 'సబ్‌స్క్రిప్షన్' ప్లాన్; రూ.15,479 నుండి ప్రారంభం

"ఇది మారుతున్న కస్టమర్ల అవసరాలను తీరుస్తుంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు సౌకర్యవంతమైన పదవీకాలం, జీరో డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్, భీమా మరియు పూర్తి మెయింటినెన్స్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. పైలట్ ప్రాతిపధిక ప్రారంభించిన ఈ ప్లాన్‌కు ఇప్పటికే 5000కి పైగా ఎంక్వైరీలు వచ్చాయి. రానున్న రోజుల్లో ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను 40-60 నగరాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నామని" ఆయన చెప్పారు.

హైదరాబాద్‌లో మారుతి 'సబ్‌స్క్రిప్షన్' ప్లాన్; రూ.15,479 నుండి ప్రారంభం

హైదరాబాద్‌లో మారుతి సుజుకి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ధీర్ఝకాలిక ఆర్థిక కట్టుబాట్లు లేకుండా, స్వల్ప సమయం కోసం ఎలాంటి ఇబ్బందులు లేని వాహన యాజమాన్యాన్ని కోరుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. కస్టమర్లు ప్రతి నెలా కొంత పరిమిత మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఫుల్ కార్ మెయింటినెన్స్, ఇన్సూరెన్స్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సేవలను ఒకే ప్లాన్ ద్వారా పొందవచ్చు.

MOST READ:ట్రాఫిక్ ఉల్లంఘనలపై విరుచుకుపడుతున్న పోలీసులు.. ఇప్పటికే 15000 మంది లిస్ట్ రెడీ

Most Read Articles

English summary
Maruti Suzuki India Limited (MSIL) has launched its new car subscription service to two new cities in the country. Called the Maruti Suzuki Subscribe is now available for customers in Hyderabad and Pune. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X