కొత్త 2020 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా సరికొత్త రికార్డ్, 26,000 లకు పైగా బుకింగ్స్

'మారుతి సుజుకి ఇండియా' అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'విటారా బ్రెజ్జా'లో కంపెనీ లాక్‌డౌన్‌కు కొద్ది రోజుల ముందే కొత్త 2020 వెర్షన్‌ను విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ బుకింగ్‌లు 26,000 మార్కుకు చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. దేశంలో దాదాపు రెండు నెలలకు పైగా లాక్‌డౌన్ ఉన్నప్పటికీ, విటారా బ్రీజ్ మాత్రం మంచి ప్రజాదరణను సొంతం చేసుకుంది.

కొత్త 2020 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా సరికొత్త రికార్డ్, 26,000 లకు పైగా బుకింగ్స్

మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కస్టమర్లు కొత్త వాహనాల కొనుగోలుపై ప్రయోగాలు చేయకుండా, ఇప్పటికే స్థాపించబడిన మరియు విశ్వసనీయమైన బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారని అన్నారు.

కొత్త 2020 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా సరికొత్త రికార్డ్, 26,000 లకు పైగా బుకింగ్స్

కోవిడ్-19 భయానక పరిస్థితుల్లో కూడా మారుతి సుజుకి విటారా బ్రెజ్జాకు మార్కెట్లో మంచి స్పందన లభించిందని కంపెనీ ఇదివరకు పేర్కొంది. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ బ్రాండ్‌కు మంచి అమ్మకాలను తెచ్చిపెట్టగలదని కంపెనీ ధీమాగా ఉంది.

MOST READ: భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

కొత్త 2020 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా సరికొత్త రికార్డ్, 26,000 లకు పైగా బుకింగ్స్

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి కొత్త 2020 విటారా బ్రెజ్జాను ప్రదర్శనకు ఉంచింది. మార్కెట్లో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.7.34 లక్షలుగా ఉండగా టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.11.40 లక్షలు ఎక్స్‌షోరూమ్, ఢిల్లీగా ఉంది.

కొత్త 2020 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా సరికొత్త రికార్డ్, 26,000 లకు పైగా బుకింగ్స్

విటారా బ్రెజ్జాలో ఒకే ఇంజన్ ఆప్షన్ ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులో మారుతి సుజుకి బ్రాండ్ యొక్క (ఎస్‌విహెచ్‌ఎస్) మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 104bhp శక్తిని మరియు 138Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

MOST READ: చూడటానికి కార్ లాగా కనిపించే కొత్త ఎలక్ట్రిక్ బైక్

కొత్త 2020 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా సరికొత్త రికార్డ్, 26,000 లకు పైగా బుకింగ్స్

సుజుకి యొక్క తేలికపాటి-హైబ్రిడ్ సాంకేతిక పరిజ్ఞానం (ఎస్‌హెచ్‌విఎస్)తో తయారైన ఈ స్మార్ట్ హైబ్రిడ్ వాహనం ఇంజన్ స్టార్ట్-స్టాప్, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్, టార్క్-అసిస్ట్ ఫంక్షన్‌లను సపోర్ట్ చేస్తుంది. క్రాస్ఓవర్-హ్యాచ్‌బ్యాక్ కలయితో రూపుదిద్దుకున్న ఈ వాహనంలోని టెక్నాలజీ కారణంగా నాన్-హైబ్రిడ్ వేరియంట్లతో పోల్చుకుంటే ఇంజన్ పెర్ఫార్మెన్స్, ఎఫీషియెన్సీ లెవల్స్ మెరుగ్గా ఉంటాయి.

కొత్త 2020 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా సరికొత్త రికార్డ్, 26,000 లకు పైగా బుకింగ్స్

మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే కొత్త 2020 విటారా బ్రెజ్జాలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్ లైట్లతో కూడిన కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ డిజైన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎమ్‌లను కలిగి ఉంటుంది.

MOST READ: సాహస యాత్రలు చేయాలనుకుంటున్నారా.. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన మోటార్ రహదారులు ఇవే

కొత్త 2020 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా సరికొత్త రికార్డ్, 26,000 లకు పైగా బుకింగ్స్

మారుతి సుజుకికి సంబంధించిన ఇతర వార్తలను పరిశీలిస్తే, మారుతి సుజుకి ఇటీవల తమ ఎస్-ప్రెసో మోడల్‌లో సిఎన్‌జి వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ ప్రారంభ ధర రూ .4.84 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. - మరిన్ని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

కొత్త 2020 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా సరికొత్త రికార్డ్, 26,000 లకు పైగా బుకింగ్స్

కొత్త 2020 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా బుకింగ్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో లభిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఓ మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ఇది ఈ సెగ్మెంట్లోని టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ300, మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. కాకపోతే, ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది, ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

Most Read Articles

English summary
The 2020 Maruti Suzuki Vitara Brezza was launched right before the nation-wide lockdown came into effect. The compact-SUV bookings have reached 26,000 mark. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X