మారుతి సంచలన రికార్డు.. ఏకంగా 5 లక్షల బ్రిజా కార్లు రోడ్డ మీదకు!!

మారుతి సుజుకి వితారా బ్రిజా (Maruti Suzuki Vitara Brezza) ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో 5 లక్షల సేల్స్ మైలురాయిని అధిగమించింది. గడిచిన 47 నెలల్లో ఈ అరుదైన రికార్డును సాధించింది.

మారుతి సుజుకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీని తొలిసారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఆ తర్వాత విడుదలైన అనతి కాలంలోనే బెస్ట్ సెల్లర్ ఎస్‌‌యూవీగా భారీ విజయాన్ని అందుకొంది.

మారుతి సంచలన రికార్డు.. ఏకంగా 5 లక్షల బ్రిజా కార్లు రోడ్డ మీదకు!!

ప్రపంచ స్థాయి ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ మరియు అద్వితీయమైన మైలేజ్ వంటి అంశాలు మారుతి బ్రిజాను సక్సెస్‌ చేశాయని మారుతి సుజుకి వెల్లడించింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఈ మోడల్‌ అత్యధిక అవార్డులు సొంతం చేసుకుంది.

మారుతి సంచలన రికార్డు.. ఏకంగా 5 లక్షల బ్రిజా కార్లు రోడ్డ మీదకు!!

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ ఎక్సిక్యూటివ్ డైరక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "మారుతి సుజుకి ఇంజనీరింగ్ బృందం సుజుకి కోర్ టెక్నాలజీ ఆధారంగా డిజైన్ మరియు డెవలప్ చేసిన వితారా బ్రిజా ఇండియన్ కస్టమర్ల హృదయాలను దోచుకుంది. వితారా బ్రిజా స్టైల్, ఫీచర్లు మరియు మైలేజ్ కేవలం 47 నెలల్లోనే 5 లక్షల సేల్స్‌ సాధించిపెట్టింది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా కొత్త ఉత్పత్తులు అందివ్వడంలో మారుతి ఎప్పుడూ ముందుంటుందని చెప్పుకొచ్చారు."

మారుతి సంచలన రికార్డు.. ఏకంగా 5 లక్షల బ్రిజా కార్లు రోడ్డ మీదకు!!

మారుతి సుజుకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి ప్రతి నెలా విడుదలయ్యే టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించింది. డిజైన్ పరంగా స్టైలిష్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ఫ్లోటింగ్ రూఫ మరియు 16-ఇంచుల మెషీన్డ్ స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటి ఎంతో అట్రాక్టివ్‌గా నిలిచాయి.

మారుతి సంచలన రికార్డు.. ఏకంగా 5 లక్షల బ్రిజా కార్లు రోడ్డ మీదకు!!

మారుతి బ్రిజా ఎస్‌యూవీలో టిల్ట్ స్టీరింగ్ వీల్, కూల్ బాక్స్, క్రూయిజ్ కంట్రోల్ (మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్లలో), మూడ్ క్యాబిన్ లైటింగ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిట్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే 7-ఇంచుల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సంచలన రికార్డు.. ఏకంగా 5 లక్షల బ్రిజా కార్లు రోడ్డ మీదకు!!

సేఫ్టీ పరంగా ఎలాంటి రాజీ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీని బ్రిజాలో అందించారు. అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, పార్కింగ్ సెన్సార్లు, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు మరియు హై-స్పీడ్ వార్నింగ్ సిస్టమ్ ఉన్నాయి. అదనంగా టాప్ ఎండ్ వేరియంట్లలో రియర్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ల్ మరియు ఆటోమేటిక్ వైపర్లు వచ్చాయి.

మారుతి సంచలన రికార్డు.. ఏకంగా 5 లక్షల బ్రిజా కార్లు రోడ్డ మీదకు!!

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా ఎస్‌యూవీలో 1.3-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సంచలన రికార్డు.. ఏకంగా 5 లక్షల బ్రిజా కార్లు రోడ్డ మీదకు!!

మారుతి బ్రిజా ఆరు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది, అవి- ఫైరీ ఎల్లో/ పర్ల్ ఆర్కిటిక్ వైట్, బ్లేజింగ్ రెడ్/ మిడ్‌నైట్ బ్లాక్, ఆటమ్ ఆరేంజ్/ పర్ల్ ఆర్కిటిక్ వైట్, ప్రీమియం సిల్వర్, గ్రానైట్ గ్రే మరియు పర్ల్ ఆర్కిటిక్ వైట్.

మారుతి సంచలన రికార్డు.. ఏకంగా 5 లక్షల బ్రిజా కార్లు రోడ్డ మీదకు!!

మార్కెట్లో ఉన్న మారుతి వితారా బ్రిజా ఎస్‌యూవీ ధరల శ్రేణి రూ. 7.63 లక్షల నుండి రూ. 10.60 లక్షల ఎక్స్-షోరూమ్(ఇండియా) మధ్య ఉంది. విడుదలై నాలుగేళ్లు కావస్తుండటంతో త్వరలో దీనిని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయాలని మారుతి భావిస్తోంది.

మారుతి సంచలన రికార్డు.. ఏకంగా 5 లక్షల బ్రిజా కార్లు రోడ్డ మీదకు!!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి మార్కెట్లోకి ఏ మోడల్ తెచ్చిన భారీ సక్సెస్ సాధిస్తోంది. భారతీయ కస్టమర్ల నాడి తెలుసుకున్న మారుతి ప్రతి ఫ్యామిలీని ఆకట్టుకునేలా అద్భుతమైన ఫీచర్లు, డిజైన్ మరియు మైలేజ్ మీద దృష్టి సారిస్తూ తమ కార్లను ప్రవేశపెడుతోంది. వీటిలో బ్రిజా ఎస్‌యూవీ ఒకటి. కేవలం నాలుగేళ్ల కాలంలోనే ఏకంగా 5 లక్షల బ్రిజా కార్లను అమ్మేసింది. రానున్న రెండేళ్లలో మారుతి బ్రిజా మరిన్ని కొత్త రికార్డులు సాధిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Most Read Articles

English summary
Maruti Suzuki Vitara Brezza Sales Milestone: Crosses 5 Lakh Units Since Launch In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X