పెట్రోల్ అవసరం లేని వ్యాగన్ఆర్ వచ్చేస్తోంది!

భారతదేశపు అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న పాపులర్ కార్ వ్యాగన్ఆర్‌లో ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ప్రొడక్షన్‌కు సమీపంలో ఉన్న మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కంపెనీ ఫైనల్ టెస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

పెట్రోల్ అవసరం లేని వ్యాగన్ఆర్ వచ్చేస్తోంది!

డిజైన్ వివరాలు తెలియకుండా పూర్తిగా బ్లాక్ ఫిల్మ్‌తో కప్పబడిన (క్యామోఫ్లేజ్) మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారు హర్యానాలో టెస్టింగ్ చేస్తుండా ఓ నెటిజెన్ తన కెమెరాలో బంధించాడు. గతేడాది మారుతి సుజుకి 50 జెడిఎమ్-స్పెక్ ప్రోటోటైప్‌ను పరిచయం చేసింది, ఇప్పుడు అదే మోడల్ వివిధ వాతావరణ, రోడ్డు మరియు డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా టెస్టింగ్ చేయబడుతోంది.

పెట్రోల్ అవసరం లేని వ్యాగన్ఆర్ వచ్చేస్తోంది!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధర్డ్-జనరేషన్ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ (జనవరి 2019లో విడుదలైన మోడల్) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకునే కొత్త వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను అభివృద్ది చేస్తున్నట్లు ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. ఇలా చేయటం వలన సరసమైన ధరకే మారుతి తమ కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయటం సాధ్యమవుతుంది. అయితే, ఈ రెండు మోడళ్లలో వ్యత్యాసం కోసం ఫ్రంట్, రియర్ డిజైన్లతో పాటుగా ఇంటీరియర్లలో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.

MOST READ: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారుపై భారీ డిస్కౌంట్, ఎంతో తెలుసా ?

పెట్రోల్ అవసరం లేని వ్యాగన్ఆర్ వచ్చేస్తోంది!

తక్కువ విద్యుత్‌ని వినియోగించుకొని ఎక్కువ కాంతినిచ్చే సరికొత్త ఎల్ఈడి హెడ్‌లైట్లు మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఫ్రంట్ బంపర్ (స్ప్లిట్ హెడ్‌లైట్ డిజైన్), ఫ్రంట్ బంపర్ క్రింది భాగంలో అమర్చిన ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్‌ను ఈ చిత్రాల్లో గమనించవచ్చు. అలాగే ఫ్రంట్ గ్రిల్‌లో కూడా మార్పులు ఉన్నాయని తెలుస్తోంది.

పెట్రోల్ అవసరం లేని వ్యాగన్ఆర్ వచ్చేస్తోంది!

మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ సైడ్ మరియు వెనుక ప్రొఫైల్‌ను చూస్తే ప్రస్తుతం లభిస్తున్న పెట్రోల్ కార్ మాదిరిగానే అనిపిస్తుంది. ఇంకా 15-ఇంచ్ బ్లాక్ వీల్స్ (ఇగ్నిస్ కారును పోలినట్లు ఉన్నాయి) కూడా ఉన్నాయి. మొత్తమ్మీద చూస్తే పాపులర్ వ్యాగన్ఆర్ టాల్‌బాయ్ డిజైన్‌ను రీటైన్ చేసినట్లుగా అనిపిస్తుంది.

MOST READ:కస్టమర్ల కోసం ఆన్‌లైన్ దుకాణం తెరచిన హీరో మోటోకార్ప్

పెట్రోల్ అవసరం లేని వ్యాగన్ఆర్ వచ్చేస్తోంది!

ఎలక్ట్రిక్ వెర్షన్ కాబట్టి ఈ కారును వీలైనంత లైట్‌గా ఉంచే అవకాశాలున్నాయి. అలాగే ఇంటీరియర్లలో కూడా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. మారుతి బ్రాండ్‌కి చెందిన 'హార్టెక్' ప్లాట్‌ఫామ్‌పైనే కొత్త మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారును తయారు చేయనున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెట్రోల్ వెర్షన్ వ్యాగన్ఆర్ కారును తయారు చేశారు.

పెట్రోల్ అవసరం లేని వ్యాగన్ఆర్ వచ్చేస్తోంది!

మారుతి సుజుకి తమ ఎలక్ట్రిక్ వ్యాగన్ఆర్ కారుకి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉన్నప్పటికీ, ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్-ఛార్జింగ్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్టాండర్డ్ చార్జింగ్ ఆప్షన్ కలిగిన ఎలక్ట్రిక్ కార్లు సగటున 7-8 గంటల్లో పూర్తి చార్జ్ అవుతుంటే, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కలిగిన కార్లు కేవలం 2-3 గంటల వ్యవధిలోనే 0-80 శాతం వరకూ చార్జ్ అవుతుంటాయి.

MOST READ: మైల్స్ కార్ నుంచి ఇప్పుడు అద్దెకి ఎమ్‌జి హెక్టర్ కారు

పెట్రోల్ అవసరం లేని వ్యాగన్ఆర్ వచ్చేస్తోంది!

మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన ప్రోటోటైప్‌ను కంపెనీ ఇదివరకే ఆవిష్కరించింది. ఇంచు మించు అవే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేటి రోజుల్లో ఇలాంటి ఎలక్ట్రిక్ కార్ల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రత్యేకించి నగరాల్లో ఇలాంటి ఎలక్ట్రిక్ కార్లకు గిరాకీ బాగా పెరుగుతోంది.

gaadiwaadi

Most Read Articles

English summary
Maruti Suzuki confirmed that the company is working on an electric version of their popular WagonR hatchback for the Indian market. The company even introduced 50 JDM-spec prototypes in the country last year undergoing multiple testing under various conditions. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X