Just In
- 5 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 8 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కొత్త రికార్డ్; ఒక్క ఏడాదిలో 25,000 కార్లు
భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో తమ నెక్సా డీలర్షిప్ కేంద్రాల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్న ఎక్స్ఎల్6 ఎస్యూవీ మరో అరుదైన మైలురాయిని అదిగమించింది. మారుతి సుజుకి తమ ఎక్స్ఎల్6 మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ 25,000 యూనిట్లను విక్రయించింది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 మోడల్‌ను కంపెనీ గడచిన సంవత్సరం ఆగస్టు 2019లో మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ఎల్6 మోడల్ విడుదలతో మారుతి సుజుకి ఎమ్‌పివి విభాగంలో 51 శాతం మార్కెట్ వాటాతో అగ్ర స్థానాన్ని సాధించగలిగిందని కంపెనీ పేర్కొంది. భారతదేశపు ప్రీమియం ఎమ్‌పివి విభాగంలో ఎక్స్ఎల్6 లోనే దాదాపు 14 శాతం మార్కెట్ వాటా ఉందని కంపెనీ తెలిపింది.

మారుతి సుజుకి ప్రస్తుతం తమ ఎమ్‌పివి విభాగంలో ఎర్టిగా, ఎక్స్ఎల్6 మరియు ఈకో మోడళ్లను విక్రయిస్తోంది. ఈ మోడళ్లతో కంపెనీ మొత్తం మార్కెట్ వాటాలో 51 శాతం వాటాను కలిగి ఉంది. మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడైన ఎమ్పివలలో ఎర్టిగా నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఎర్టిగా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కంపెనీ ప్రీమియం ఎక్స్ఎల్6 మోడల్‌ను అభివృద్ధి చేసింది.
MOST READ: కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

ఈ రెండు మోడళ్లు ఒకే ప్లాట్‌ఫామ్, ఫీచర్లను పంచుకున్నప్పటికీ, వాటి డిజైన్ మరియు పరికరాలలో చాలా మార్పులు ఉన్నాయి. ఎర్టిగాతో పోలిస్తే ఎక్స్ఎల్6 మరింత అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంది. ఇందులో ఆల్‌రౌండ్ బ్లాక్ బాడీ క్లాడింగ్, కొత్త ఫ్రంట్ గ్రిల్, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు మరియు బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్‌తో వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6లో క్వాడ్-ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి డిఆర్ఎల్లు మరియు ఎల్ఈడి స్ప్లిట్-టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. బూట్ లిడ్‌పై బ్లాక్ ట్రిమ్ ఉంటుంది, ఇది రెండు టెయిల్ ల్యాంప్ చివర్లను కలుపుతుంది.
MOST READ: భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

ఇక ఇందులోని ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్ మధ్య వరుసలోని ప్రయాణీకుల కోసం డిజైన్ చేసిన కెప్టెన్ సీట్స్. ఇది ఆరు సీట్ల కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది. ఈ కారు క్యాబిన్ మొత్తం ఆల్-బ్లాక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఇక ఇందులో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులోని 7.0 ఇంచ్ స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేలను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, లెథర్ వ్రాప్డ్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్‌పై మౌంటెడ్ కంట్రోల్స్, లెదర్ అప్‌హోలెస్ట్రీ, రియర్ ఏసి వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి కీలకమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.
MOST READ: భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలోని సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, హై-స్పీడ్ అలెర్ట్, ప్రీ-టెన్షనర్ అండ్ ఫోర్స్ లిమిటర్లతో కూడిన ఫ్రంట్ సీట్ బెల్ట్‌లు, ఈబిఎస్తో కూడిన ఏబిఎస్, ఈఎస్‌పి మరియు హిల్-హోల్డ్ ఫంక్షన్ వంటి అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్ కె15 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది ఎస్‌హెచ్‌విఎస్ (స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి) మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 103 బిహెచ్పి పవర్‌ను మరియు 4400 ఆర్‌పిఎమ్ వద్ద 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.
MOST READ: భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో దీని బేస్ వేరియంట్ ధర రూ.9.84 లక్షలుగా ఉంటే టాప్-ఎండ్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.11.51 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.
ఎక్స్ఎల్6 సేల్స్ మైల్‌స్టోన్‌పై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న కస్టమర్ అవసరాల కారణంగా ప్రీమియం ఎమ్‌పివిలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఎక్స్ఎల్6 ఫీచర్-రిచ్ ప్యాకేజీతో ధృడంగా ఉండి, సరిపోలని మరియు సున్నితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడంతో పాటు విశాలమైన క్యాబినే స్పేస్, కంఫర్ట్, పెర్ఫార్మెన్స్ మరియు సేఫ్టీలను కలిగి ఉందని" అన్నారు.

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 సేల్స్ మైలురాయిపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
మారుతి సుజుకి ఎర్టిగాతో పోలిస్తే మరిన్ని ప్రీమియం ఫీచర్ల కోసం చూసే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఎక్స్ఎల్6ను విడుదల చేసింది. మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఈ విభాగంలో ప్రీమియం క్యాబిన్ అనుభూతిని అందిస్తూ, ఆధునిక స్టైలింగ్‌తో కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.