7 సీట్ల వేరియంట్‌లో విడుదల కానున్న మారుతి సుజుకి ఎక్స్‌ఎల్ 7

మారుతి ఎర్టిగా ఆధారిత ఎక్స్‌ఎల్ 6 ప్రీమియం ఎమ్‌పివి కొన్ని నెలల క్రితం భారతదేశంలో ప్రారంభించబడింది. ఇప్పుడు ఎక్స్‌ఎల్ 7 అనే 7 సీటర్ గా మార్కెట్లోకి రానుంది.

7 సీట్ల వేరియంట్‌లో విడుదల కానున్న మారుతి సుజుకి ఎక్స్‌ఎల్ 7

మారుతి సుజుకి ఎక్స్‌ఎల్ 6 ఎమ్‌పివి ని 2019 ఆగస్టులో నెక్సా ఉత్పత్తిగా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 9.79 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). పేరులో సూచించినట్లుగానే మారుతి ఎక్స్‌ఎల్-6 అనేది 6 సీట్ల ఎమ్‌పివి. ఇందులో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు ఉన్నాయి. దీనికి ఉన్న ప్రాక్టీకాలిటీ కారణంగా ఎక్స్‌ఎల్ 6 భారత మార్కెట్లో విజయాన్ని సాధించగలిగింది.

7 సీట్ల వేరియంట్‌లో విడుదల కానున్న మారుతి సుజుకి ఎక్స్‌ఎల్ 7

ఇప్పుడు మారుతి నుంచి రాబోయే సుజుకి ఎక్స్ఎల్ 7 మొట్టమొదటిసారిగా కెమెరాలో చిక్కింది. ఇండోనేషియా మార్కెట్లో ప్రారంభించటానికి ముందు మరియు ఇతర ఆసియన్ మార్కెట్లలో కూడా ప్రారంభించనుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎక్స్ఎల్ 7 మారుతి ఎక్స్ఎల్ 6 యొక్క నవీనీకరణ అని చెప్పవచ్చు.

7 సీట్ల వేరియంట్‌లో విడుదల కానున్న మారుతి సుజుకి ఎక్స్‌ఎల్ 7

మనం ఇక్కడ చూసే సుజుకి ఎక్స్‌ఎల్ 7 యూనిట్ ఇండియన్-స్పెక్ ఎక్స్‌ఎల్-6 తో సమానంగా కనిపిస్తుంది. కానీ మనం దీనిని దగ్గరగా పరిశీలించిన తరువాత, వేర్వేరు చక్రాల రూపకల్పనను గుర్తించగలుగుతాము.

7 సీట్ల వేరియంట్‌లో విడుదల కానున్న మారుతి సుజుకి ఎక్స్‌ఎల్ 7

మారుతి సుజుకి భారతదేశంలో ఎక్స్‌ఎల్ 7 ను ప్రారంభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇప్పటికే ఉన్న ఉత్పత్తి యొక్క సవరించిన వేరియంట్. కానీ ఇది అదనపు ప్రయాణీకులు కూర్చోగల వేరియంట్. ఇది ఎక్స్‌ఎల్ 6 తో పోలిస్తే ఎక్స్‌ఎల్ 7 కి మరింత ప్రీమియం ఉంటుందని ఆశించకూడదు.

7 సీట్ల వేరియంట్‌లో విడుదల కానున్న మారుతి సుజుకి ఎక్స్‌ఎల్ 7

ప్రస్తుతం మారుతి సుజుకి ఎక్స్‌ఎల్ 6 కేవలం బిఎస్-6 కంప్లైంట్ 1.5-లీటర్ K15 పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 104 బిహెచ్‌పి మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. పవర్ ప్లాంట్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది. ఇది ఎస్‌హెచ్‌విఎస్ (స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి) సాంకేతికతను కలిగి ఉంది. ఇంజిన్ అనేక ఇతర మారుతి సుజుకి ఉత్పత్తులతో మాదిరిగానే ఉంటుంది.

7 సీట్ల వేరియంట్‌లో విడుదల కానున్న మారుతి సుజుకి ఎక్స్‌ఎల్ 7

ఇండోనేషియా మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత, సుజుకి ఎక్స్‌ఎల్ 7 మిత్సుబిషి ఎక్స్‌పాండర్ మరియు హోండా బిఆర్-V తో లాక్ చేయబడుతుంది. సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ యొక్క రీసనబుల్ బడ్జెట్ తో ఎక్కువ మందిని తీసుకెళ్లగల వాహనం సుజుకి ఎక్స్‌ఎల్ 7.

7 సీట్ల వేరియంట్‌లో విడుదల కానున్న మారుతి సుజుకి ఎక్స్‌ఎల్ 7

సుజుకి ఎక్స్‌ఎల్ 6 కంటే సుజుకి ఎక్స్‌ఎల్ 7 లో ప్రయాణించే ప్రయాణికులు అదనంగా ఉంటారు. ఎందుకంటే ఎక్స్‌ఎల్ 6 లో ఆరు సీట్లు మాత్రమే కలిగి ఉంటుంది. అదే 7 సీటర్ లో 7 సీట్లు ఉండటం వల్ల ప్రయాణించే ప్రయాణికులు పెరుగుతారు. 7 సీట్లు కలిగి ఉండటం వల్ల వినియోగదారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

Most Read Articles

English summary
Maruti Ertiga based Suzuki XL7 MPV 7 seater – Spied. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X