Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వ్యాగన్ఆర్; త్వరలో విడుదల
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, విపణిలో తమ మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి విక్రయిస్తున్న వాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది.

మారుతి సుజుకి నుంచి రానున్న ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా రష్‌లేన్ ఇందుకు సంబంధించిన కొన్ని చిత్రాలను ఇంటర్నెట్‌లో లీక్ చేసింది. ఈ స్పై చిత్రాలను చూస్తుంటే, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ గుర్గావ్‌లో పరీక్షిస్తుండటాన్ని గమనించవచ్చు.

తాజా నివేదికలు మరియు ఫొటోలను చూస్తుంటే, ఈ టెస్టింగ్ వాహనంలో ఎగ్జాస్ట్ కనిపించదు. కారు డిజైన్ వివరాలు లీక్ కాకుండా ఉండేలా కంపెనీ ఈ టెస్టింగ్ వాహనాన్ని పూర్తిగా బ్లాక్ కలర్‌లో క్యామోఫ్లేజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారులో బరువైన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చేందుకు గాను ఈ కారు మొత్తం బరువును తేలికగా ఉంచేందుకు కంపెనీ లైట్ వెయిట్ మెటీరియల్స్‌తో తయారు చేయనుంది.
MOST READ: టాటా మోటార్స్ ఛైర్మన్‌కు అందజేసిన టాటా నెక్సాన్ ఇవి

ఈ టెస్టింగ్ వాహనం ఓవరాల్ లుక్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొత్త తరం వ్యాగన్ఆర్ మాదిరిగా అనిపిస్తుంది. ఇందులో సైడ్ మిర్రర్స్‌పై అమర్చిన టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ మరియు 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను గమనించవచ్చు. మారుతి సుజుకి గతేడాది దేశంలో 50 జెడిఎమ్-స్పెక్ ప్రోటోటైప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. దీనిని వివిధ పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాలుగా పరీక్షించనున్నారు.

మునుపటి నివేదికల ప్రకారం, మారుతి సుజుకి నుంచి రానున్న ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును వాణిజ్య ఉపయోగం మరియు విమానాల నిర్వహణ కోసం విడుదల చేయవచ్చనే వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ మోడల్‌ను వ్యక్తిగత ఉపయోగం కోసం కూడా అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ వచ్చే ఏడాది ఎప్పుడైనా భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.
MOST READ: కారులో భార్య ఉంగరం పోయింది.. భర్త దాన్ని ఎలా కనిపెట్టించాడో తెలుసా ?

మారుతి సుజుకి తమ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించనప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మూడవ పెట్రోల్ పవర్ వ్యాగన్ఆర్ నుండి అనేక డిజైన్ ఫీచర్లను కొత్త ఎలక్ట్రిక్ వ్యాగన్ఆర్ కారులోనూ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. అయితే, స్టాండర్డ్ పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ నుండి ఎలక్ట్రిక్ వ్యాగన్ఆర్‌ను వేరు చేయటానికి ఇందులో ప్రత్యేకంగా చేయబడే కొన్ని మార్పులను మేము గమనించాము.

ఎలక్ట్రిక్ వ్యాగన్ఆర్ కారులో స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ డిజైన్‌తో కూడిన సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉండనుంది. డేటైమ్ రన్నింగ్ లైట్లను గ్రిల్ పక్కన ఉంచగా, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు బంపర్‌లపై అమర్చనున్నారు. మెయిన్ హెడ్‌ల్యాంప్‌లకు దిగువన ఫాగ్ ల్యాంప్‌ను అమర్చనున్నారు. అలాగే, ఫ్రంట్ గ్రిల్‌ను కూడా కొత్త డిజైన్‌తో అప్‌గ్రేడ్ చేయనున్నారు.
MOST READ: కొత్త మహీంద్రా థార్ నడిపిన పృథ్వీరాజ్.. కారు గురించి అతను ఏమి చెప్పాడో తెలుసా ?

ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారులో, దాని స్టాండర్డ్ పెట్రోల్ మోడల్‌లో కనిపించే అనేక ఇంటీరియర్ ఎలిమెంట్స్‌ను అలానే కొనసాగించే అవకాశం ఉంది. ఇలా చేయటం వలన ఎలక్ట్రిక్ వెర్షన్ ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీకి వీలవుతుంది.

ఇందులో బ్రాండ్ యొక్క సరికొత్త స్మార్ట్‌ప్లే కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్యూయెల్-టోన్ ఇంటీరియర్ థీమ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా.
MOST READ: కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ పవర్‌ట్రెయిన్ మరియు ఇతర ఫీచర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

మారుతి సుజుకి వాగన్ఆర్ ఎలక్ట్రిక్ మార్కెట్లో విడుదలైతే, ఇది విభాగంలో టాటా టిగోర్ ఈవి మరియు మహీంద్రా నుండి రాబోయే ఇకెయువి100 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. లకు ప్రత్యర్థి అవుతుంది. అయితే, ఇకెయువి100 దేశంలో లభించే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్‌గా నిలువనుంది. మారుతి సుజుకి కూడా తమ వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారును సరసమైన ధరకే మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
MOST READ: రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ యాప్ - కంప్లీట్ డీటేల్స్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగం స్థిరమైన వేగంతో పెరుగుతోంది. ఈ విభాగంలో అందుబాటులో ఉన్న వాహనాలు రూ.10 లక్షల పైనే ఉన్నాయి. నిజానికి ఇవి చాలా ఖరీదైనవి. అయితే, మారుతి సుజుకి నుంచి రాబోయే వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ రూ.10 లక్షలకు దిగువన ప్రవేశపెట్టినట్లయితే, ఇది మార్కెట్లో మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంది.
Source:Rushlane