బీఎస్4 ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు: ఏయే మోడల్ మీద ఎంత?

భారత ప్రభుత్వం ఏప్రిల్ 01, 2020 నుండి మార్కెట్లోకి అమ్ముడయ్యే అన్ని కార్లు మరియు బైకుల్లో బీఎస్6 ఇంజన్ తప్పనిసరి చేసింది. గడువు దాటిన తర్వాత బీఎస్4 మోడళ్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపేస్తారు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ కార్లను బీఎస్6 ప్రమాణాలతో అప్‌డేట్ చేసి, బీఎస్4 స్టాకు క్లియర్ చేసే పనిలో పడ్డాయి.

బీఎస్4 ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు: ఏయే మోడల్ మీద ఎంత?

దేశవ్యాప్తంగా ఉన్న ప్యాసింజర్ కార్ల డీలర్లు ఏప్రిల్ 01 లోపు బీఎస్4 స్టాక్ అమ్మేసేందుకు షోరూముల్లో ఉన్న కార్ల మీద భారీ ఆఫర్లు, పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ప్రకటించారు. ఏయే మోడల్ మీద ఎంత మేరకు లాభాలు ఉన్నాయి చూద్దాం రండి...

బీఎస్4 ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు: ఏయే మోడల్ మీద ఎంత?

హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ మోటార్ ఇండియా గత ఏడాది వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని బీఎస్6 వెర్షన్ మోడల్‌ను ఇటీవలె విపణిలోకి రీలాంచ్ చేసింది. అయితే, షోరూమ్ స్టాక్ యార్డుల్లో మిగిలి ఉన్న బీఎస్4 హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ మీద గరిష్టంగా రూ. 50,000 వరకూ ఆఫర్లు ప్రకటించింది.

బీఎస్4 ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు: ఏయే మోడల్ మీద ఎంత?

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ గత నెలలో టాటా నెక్సాన్ ఎస్‌యూవీని బీఎస్6 ప్రమాణాలతో ఫేస్‍లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. ఫేస్‌లిఫ్ట్ కంటే ముందు వచ్చిన మోడళ్లు షోరూముల్లో అలాగే ఉండిపోయాయి. వీటిలో కొన్ని వేరియంట్ల టాటా డీలర్లు గరిష్టంగా 1 లక్ష రూపాయల వరకూ తగ్గింపు ప్రకటించారు.

బీఎస్4 ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు: ఏయే మోడల్ మీద ఎంత?

జీప్ కంపాస్

చిన్న కార్లయితే హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి.. కానీ పెద్ద పెద్ద ఎస్‌యూవీలు మొండి కేసుల్లాంటివి. అమెరికా దిగ్గజం జీప్ తమ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కంపాస్ మీద వేరియంట్ల వారీగా లక్ష నుండి 2 లక్షల వరకూ డిస్కౌంట్లు ప్రకటించింది. బీఎస్4 మోడళ్ల మీదనే ఆఫర్లు లభిస్తున్నాయి.

బీఎస్4 ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు: ఏయే మోడల్ మీద ఎంత?

రెనో డస్టర్

భారతీయ కస్టమర్లకు ఎస్‌యూవీ రుచి చూపించిన మొట్టమొదటి మోడల్ రెనో డస్టర్. పోటీ పెరిగిన నేపథ్యంలో రెనో డస్టర్ ఆశించిన ఫలితాలు సాధించడంలేదు. బీఎస్4 రెనో డస్టర్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ల మీద గరిష్టంగా 2 లక్షల రూపాయల భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. బేసిక్ మరియు మిడ్ వేరియంట్ల మీద లక్షన్నర రూపాయల వరకూ ఆఫర్లు ఉన్నాయి.

బీఎస్4 ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు: ఏయే మోడల్ మీద ఎంత?

నిస్సాన్ కిక్స్

నిస్సాన్ కిక్స్ హ్యుందాయ్ క్రెటాకు సరాసరి పోటీనిచ్చే మోడల్. అయితే, క్రెటా తరహాలో ఆశించిన సక్సెస్ రాలేదు. బీఎస్4 వేరియంట్ల మీద గరిష్టంగా రూ. 2.6 లక్షల డిస్కౌంట్ ఉండగా, బీఎస్6 వేరియంట్లు ఎంచుకుంటే 1,6,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.

బీఎస్4 ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు: ఏయే మోడల్ మీద ఎంత?

టాటా హెక్సా

టాటా మోటార్స్ 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో హెక్సా క్రాసోవర్ ఎస్‌యూవీని బీఎస్6 వెర్షన్‌లో ఆవిష్కరించింది. అయితే హెక్సా బీఎస్6 వెర్షన్ విడుదలయ్యేందుకు ఇంకా టైమ్ ఉంది. ఈ నేపథ్యంలో బీస్4 స్టాక్ మీద గరిష్టంగా 2.25 లక్షల రూపాయల డిస్కౌంట్ ప్రకటించారు.

బీఎస్4 ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు: ఏయే మోడల్ మీద ఎంత?

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్

ఎమ్‌యు-ఎక్స్ మోడల్ రూ. 3 లక్షల డిస్కౌంట్‌తో విలువకు తగ్గ ఉత్పత్తిగా నిలిచింది. ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మహీంద్రా అల్టురాస్ మోడళ్లతో పోటీలో నిలిచింది. ప్రస్తుతం ఉన్న బీఎస్4 స్టాక్‌ను పూర్తిగా విక్రయించిన తర్వాతే బీఎస్6 వెర్షన్ ఎమ్‌యు-ఎక్స్ లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

బీఎస్4 ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు: ఏయే మోడల్ మీద ఎంత?

మహీంద్రా అల్టురాస్

మహీంద్రా అల్టురాస్ కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ మోడల్. ఇండియన్ మార్కెట్లో మహీంద్రా విక్రయిస్తున్న హైఎండ్ మోడల్ కూడా ఇదే. మహీంద్రా అల్టురాస్ బీఎస్4 మోడల్ మీద గరిష్టంగా రూ. 2.9 లక్షల క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. పలు ఇతర ఆఫర్లు, ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ కలుపుకొని మొత్తం రూ. 4 లక్షల విలువైన ప్రయోజనాలు లభిస్తున్నాయి.

బీఎస్4 ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు: ఏయే మోడల్ మీద ఎంత?

హోండా సీఆర్-వి

హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన మోడల్ హోండా సీఆర్-వి. బీఎస్4 వెర్షన్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్ల మీద గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. హోండా సీఆర్-వి ఎస్‌యూవీ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో కూడా లభిస్తోంది.

Most Read Articles

English summary
Massive discounts on BS4 SUVs in India: From Hyundai Venue to Jeep Compass. Read in Telugu.
Story first published: Saturday, February 29, 2020, 15:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X