బర్త్ డే స్పెషల్; సచిన్ టెండూల్కర్ కార్స్.. వివరాలు

భారతదేశంలో క్రికెట్ కి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికి తెలిసిందే. క్రికెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు అందరికి సచిన్ గురించి తెలుసు. కానీ సచిన్ ఒక ఆటో మోటివ్ ఔత్సాహికుడు. 2020 ఏప్రిల్ 24 తన 47 వ పుట్టిన రోజునాడు తన దగ్గర ఉన్న కార్ల గురించి తెలిపాడు. సచిన్ టెండూల్కర్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సచిన్ టెండూల్కర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?

మారుతి 800 :

క్రికెట్ ప్రపంచంలో అత్యున్నత శిఖరాలను అందుకున్న సచిన్ టెండూల్కర్ చాలా లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ గ్యారేజ్లో ఉన్న మొదటి కారు మరియు సచిన్ కొనుగోలు చేసిన మొదటి కారు మారుతి 800. సచిన్ కొన్న మొట్ట మొదటి కారు ఇది. ఈ మారుతి 800 కారుతో సచిన్ కి చాలా అవినాభావ సంబంధం ఉంది.

సచిన్ టెండూల్కర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?

సచిన్ టెండూల్కర్ గ్యారేజ్ లో చాలా విలాసవంతమైన కార్లు ఉన్నప్పటికీ ,ఇప్పటికి కూడా ఈ మారుతి 800 కారుని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఎవరికైనా తమ మొదటి కారు అంటే చాలా ఇష్టం ఉంటుంది.

MOST READ:గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

సచిన్ టెండూల్కర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?

ఫెరారీ-360-మొడెనా :

ఫార్ములా వన్ ఛాంపియన్ అయిన మైఖేల్ షూమేకర్ 2002 లో టెండూల్కర్కు 360 మోడెనా ఫెరారీని గిఫ్ట్ గా ఇచ్చాడు. తరువాత అతను దానిని 2011 లో విక్రయించాడు. సచిన్ యొక్క ఫెరారీ బాలీవుడ్ చిత్రం 'ఫెరారీ కి సావరి' లో కూడా ఉపయోగించారు. సచిన్ టెండూల్కర్ బిఎమ్‌డబ్ల్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నాడు.

సచిన్ టెండూల్కర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?

బిఎండబ్ల్యూ ఐ 8 :

సచిన్ టెండూల్కర్ కార్ గ్యారేజ్ లో బిఎసిడబ్ల్యు ఐ 8 కూడా ఉంది. ఐ 8 జర్మన్ వాహన తయారీ సంస్థ నుండి వచ్చిన ప్రధాన స్పోర్ట్స్ కారు. ఈ బీఎండబ్ల్యూ కారు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది 357 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు 520 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బిఎమ్‌డబ్ల్యూ ఐ 8 ధర 2.54 కోట్ల రూపాయలు.

MOST READ:బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 110 హెచ్ గేర్ : ధర & ఇతర వివరాలు

సచిన్ టెండూల్కర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?

నిస్సాన్ జిటి-ఆర్ :

ప్రపంచంలో వున్నా అత్యంత లగ్జరీ కార్ విభాగంలో నిస్సాన్ జిటి-ఆర్ కూడా ఒకటి. ఫెరారీ మోడెనా నిస్సాన్ జిటి-ఆర్ కారుని కూడా సచిన్ టెండూల్కర్ తన గ్యారేజ్లో కలిగి ఉన్నాడు.

సచిన్ టెండూల్కర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?

గాడ్జిల్లా అని కూడా పిలువబడే జిటి-ఆర్ 550 బిహెచ్‌పి ఉత్పత్తిని చేస్తుంది. అంతే కాకుండా కేవలం 2.9 సెకన్లలో గంటకు 0-100 కిమీ చేయగలదు. దీని ధర సుమారు రూ. 2.4 కోట్లు వరకు కలిగి ఉంటుంది.

MOST READ:కరోనా నివారణలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా హర్యానా, ఇంతకీ ఏం చేసిందో తెలుసా..?

సచిన్ టెండూల్కర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?

బిఎండబ్ల్యూ 7 సిరీస్ :

బిఎండబ్ల్యూ యొక్క పోర్ట్‌ఫోలియోలోని ఇది ప్రధానమైనది. ఈ బీఎండబ్ల్యూ 2016 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేయబడింది. 4.4-లీటర్ ఇంజిన్‌తో నడిచే ఈ 7-సిరీస్ 450 బిహెచ్‌పి శక్తిని మరియు 650 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 250 కిమీ వేగంతో చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ధర రూ. 1.9 కోట్లు వరకు ఉంటుంది.

సచిన్ టెండూల్కర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?

బిఎండబ్ల్యూ ఎమ్ 6 గ్రాన్ కూపే :

భారతదేశంలో మొట్ట మొదటి బీఎండబ్ల్యూ ఎమ్ 6 గ్రాన్ కూపే సచిన్ కి పంపిణీ చేయబడింది. ఇది 500+ బిహెచ్‌పి మరియు 650 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బీఎండబ్ల్యూ ఎమ్ 6 కారు యొక్క ధర సుమారు రూ. 1.4 కోట్లు.

MOST READ:బ్రేకింగ్ న్యూస్.. న్యూయార్క్ మోటార్ షో రీ షెడ్యూల్ డేట్స్ వచ్చేశాయ్

సచిన్ టెండూల్కర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?

బిఎండబ్ల్యూ 30 జహ్రే :

సచిన్ టెండూల్కర్ పరిమిత ఎడిషన్ '30 జహ్రే ఎం 5 ను కలిగి ఉంది. ఇది 4.4 లీటర్ వి 8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది సుమారు 600 హెచ్‌పి శక్తిని మరియు 700 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎం 5 కారు 4 సెకన్లలో గంటకు 0-100 కిమీ చేయగలదు మరియు దీని ధర 1.5 కోట్ల రూపాయలు. సచిన్ టెండూల్కర్ గ్యారేజ్లో ఉన్న త్యంత వేగవంతమైన కార్లలో ఇది కూడా ఒకటి.

Most Read Articles

English summary
Sachin Tendulkar 47th Birthday: Maruti 800 to Ferrari & Nissan GT-R make an excellent car collection. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X