అక్టోబర్ నుంచి మరింత ప్రియం కానున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాది అక్టోబర్ 2020 నెల నుండి దేశంలోని అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు సెప్టెంబర్ మొదటి వారం నుండి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. వివిధ రకాల మెర్సిడెస్ బెంజ్ కార్ల ఎక్స్-షోరూమ్ ధరపై 2 శాతం మేర పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది.

అక్టోబర్ నుంచి మరింత ప్రియం కానున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

సెప్టెంబర్ నెలాఖరు వరకూ ప్రస్తుత ధరలు మాత్రమే కొనసాగనున్నాయి. అక్టోబర్ మొదటి వారం నుండి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ధరల పెరుగుదలకు సంబంధించిన కారణాన్ని మెర్సిడెస్ బెంజ్ ఇండియా వెల్లడించలేదు. అయితే, ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.

అక్టోబర్ నుంచి మరింత ప్రియం కానున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

కరోనా మహమ్మారి కారణంగా, గడచిన 6-7 నెలల నుండి కరెన్సీ బలహీనపడటం, ఇన్పుట్ ఖర్చులు పెరగడం ఫలితంగా ఉత్పాదక వ్యయం పెరగటం లాంటివి అన్నీ కలిపి కంపెనీ కార్యకలాపాలపై గణనీయమైన ఒత్తిడిని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

అక్టోబర్ నుంచి మరింత ప్రియం కానున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

మరోవైపు మెర్సిడెస్ బెంజ్ తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో కొత్త టెక్నాలజీలను మరియు 'మెర్సిడెస్ మి కనెక్ట్' వంటి ఫీచర్లను ప్రవేశపెట్టడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణంగా చెప్పుకోవచ్చు.

MOST READ:ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కియా సోనెట్ ఎస్‌యూవీ : ధర & ఇతర వివరాలు

అక్టోబర్ నుంచి మరింత ప్రియం కానున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

ఈ విషయంపై మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఈఓ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, "భారతదేశంలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారుగా, మా వినియోగదారులకు సరికొత్త ఉత్పత్తులు, ఉత్తమ సాంకేతికతలు, సర్వీస్ మరియు యాజమాన్య అనుభవాన్ని అందించడమే మా ప్రధాన లక్ష్యం. అయితే, ఈ సంవత్సరం ప్రారంభం నుండి కరెన్సీని బలహీనపడడం, ఇన్పుట్ ఖర్చులు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే విషయం, ఇది మా బాటమ్ లైన్‌పై గణనీయమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ ఖర్చులను పూడ్చడానికి మరియు స్థిరమైన వ్యాపారాన్ని నడపడానికి నామమాత్రంగా ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కస్టమర్ సెంట్రిక్ బ్రాండ్‌గా మేము ఈ ధరల పెంపులో సింహ భాగాన్ని భరిస్తున్నాము. అయితే, దానిలో కొంత భాగాన్ని 2 శాతం వరకు దాటడం అనివార్యంగా అనిపిస్తుందని" ఆయన అన్నారు.

MOST READ:కొత్త ఫీచర్లతో విడుదల కానున్న హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (టీజర్ వీడియో)

అక్టోబర్ నుంచి మరింత ప్రియం కానున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

"ఈ ధరల పెరుగదలు నామమాత్రంగానే ఉంటుంది. మేము ఇప్పటికే విష్ బాక్స్ 2.0, ప్రత్యేకమైన సర్వీస్ ప్యాకేజీలు మరియు మా కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫైనాన్స్ ఆప్షన్ల సాయంతో మెర్సిడెస్ బెంజ్ కస్టమర్లు తమ అభిమాన కారును సులువుగా సొంతం చేసుకోవటంలో సహకరిస్తాయని" ఆయన చెప్పారు.

అక్టోబర్ నుంచి మరింత ప్రియం కానున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

మెర్సిడెస్ బెంజ్ ఇండియాకు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ భారత మార్కెట్ కోసం తమ మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ తమ పాపులర్ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400 ఆల్-ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో విడుదల చేయనుంది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపు: కొత్త ప్రైస్ లిస్ట్

అక్టోబర్ నుంచి మరింత ప్రియం కానున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400 ఎస్‌యూవీలో 80 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. ప్రతి యాక్సిల్ వద్ద అమర్చిన రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి గరిష్టంగా 405 బిహెచ్‌పి పవర్‌ని మరియు 765 ఎన్ఎమ్ టార్క్‌‌ని ఉత్పత్తి చేస్తాయి. పూర్తి ఛార్జ్‌పై ఈ కారు గరిష్టంగా 400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

అక్టోబర్ నుంచి మరింత ప్రియం కానున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

మెర్సిడెస్ బెంజ్ ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ ధరల పెంపును సమర్థించుకుంటోంది. దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి వలన కరెన్సీ బలహీనపడింది. ఫలితంగా దేశంలో బ్రాండ్ ఉత్పాదక వ్యయం గణనీయంగా పెరిగి, కంపెనీపై తీవ్ర భారం పడినట్లు తెలుస్తోంది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్న మహిళా పోలీస్.. బైక్ కొనడానికి కారణం అడిగితే ఏం చెప్పిందో తెలుసా ?

Most Read Articles

English summary
Mercedes-Benz India has announced that they will be hiking the prices of its select model range effective first week of October this year. The ex-showroom price of Mercedes-Benz's Select model range will be an upward revision of 2 per cent. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X