Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో డీజిల్ కార్లు కొనసాగిస్తాం: మెర్సిడెస్ బెంజ్
భారతదేశంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి బిఎస్ 6 కాలుష్య నిబంధనలను తప్పనిసరి అయిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, చాలా వరకు ఆటోమొబైల్ కంపెనీలు తమ డీజిల్ ఇంజన్లను బిఎస్6 వెర్షన్లకు అప్‌గ్రేడ్ చేయటానికి ఎక్కువ సమయం పడుతుండటం, దీనికి అయ్యే ఖర్చు కూడా అధికంగా ఉండటంతో వీటిని నిలిపివేసేందుకే మొగ్గు చూపుతున్నాయి.

ఇదే కోవలో, జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా దేశీయ విపణిలో తమ బిఎస్4 డీజిల్ కార్ల విక్రయాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో, భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ డీజిల్ కార్ల భవిష్యత్తుపై కంపెనీ ఓ కీలక ప్రకటన చేసింది.

ఈ విషయంపై మెర్సిడెస్ బెంజ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ, కాలుష్య నిబంధనల్లో కొత్త మార్గదర్శకాల కారణంగా బిఎస్6 డీజిల్ ఇంజన్లు మరింత మెరుగ్గా ఉంటాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఈ ఇంజన్లు పర్యావరణానికి హాని కలిగించే వాయువులను మోతాదులో ఉత్పత్తి చేస్తాయని అన్నారు.
MOST READ: ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

డీజిల్ ఇంజన్లు సాధారణంగా పెట్రోల్ యూనిట్లతో పోల్చినప్పుడు తక్కువ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోకార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తాయి. కానీ, డీజిల్ అధిక మొత్తంలో నైట్రోజన్ ఆక్సైడ్స్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఫలితంగా ఆయా డీజిల్ కార్లలో మనం నల్లటి పొగను చూస్తుంటాం. అయితే, ఇప్పుడు అందుబాటులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో, ఈ సమస్యకు కొంత వరకు పరిష్కారం దొరికింది.

ఇక మెర్సిడెస్ బెంజ్‌కి సంబంధించి ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే తమ సరికొత్త 2021 ఈ63 ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. ఈ ఏఎమ్‌జి ఈ63 కారును సెడాన్ మరియు ఎస్టేట్ బాడీ స్టైల్స్ రెండింటినీ కలిపి డిజైన్ చేశారు. ఇందులో మెరుగైన ఎలక్ట్రానిక్ ప్యాకేజీని జోడించడంతో పాటుగా డిజైన్‌లో కూడా మార్పులు చేర్పులు చేశారు.
MOST READ: టాటా నెక్సాన్ ఆక్సిడెంట్ : ఎగిరి బయట పడ్డ ఇంజిన్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

ఈ కారు ఫ్రంట్ డిజైన్‌ను కొత్త ఏఎమ్‌జి-జిటి నుండి స్పూర్తి పొంది సపనామెరికానా గ్రిల్‌తో అప్‌గ్రేడ్ చేశారు. ఇంకా ఇందులో కొత్త ఎల్‌ఈడి హెడ్‌లైట్స్, ఫ్రంట్ బంపర్ రెండు చివర్లలో పెద్ద ఎయిర్ కర్టెన్స్‌ను జోడించారు. ఇందులో కొత్త డిజైన్‌తో కూడిన 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, అలాగే వెనుక వైపు మార్పులను గమనిస్తే, కొత్త లిప్ స్పాయిలర్ మరియు క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ డిజైన్‌లను ప్రధానంగా చెప్పుకోవచ్చు.

ఫేస్‌లిఫ్ట్ ఏఎమ్‌జి ఈ63 కారులో మునుపటి వెర్షన్‌లో ఉపయోగించిన 4.0-లీటర్ V8 బైటర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 596bhp శక్తిని మరియు 850 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ వెర్షన్. ఇందులో 9-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డిసిటి) గేర్‌బాక్స్ ఉంటుంది. ఏఎమ్‌జి ఈ63 ఎస్ కేవలం 3.3 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది, ఇకపోతే వ్యాగన్ వెర్షన్ 3.4 సెకన్ల వ్యవధిలో ఈ వేగాన్ని చేరుకుంటుంది.
MOST READ: కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

మెర్సిడెస్ బెంజ్ ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త 2020 జిఎల్ఎస్ ఎస్‌యూవీని కూడా విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో లభిస్తుంది, ఈ రెండింటి ధర రూ .99.90 లక్షలు, ఎక్స్‌షోరూమ్‌గా ఉన్నాయి.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ డీజిల్ కార్ల కొనసాగింపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
పెద్ద ఎస్‌యూవీలలో ఎక్కువ డీజిల్ ఇంజన్లను ఉపయోగిస్తుంటారు. మెర్సిడెస్ బెంజ్ తమ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త బిఎస్ 6 ఇంజన్‌లను మరింత క్లీన్‌గా ఉండేలా, పర్యావరణానికి ఎక్కువ హాని కలిగించని విధంగా అభివృద్ధి చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము.