గుడ్ న్యూస్... ఇండియాలో 2020 జిఎల్‌ఇ డెలివరీలను ప్రారంభించిన బెంజ్

జర్మనీ కి చెందిన వాహన తయారీదారు అయిన మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో తన కొత్త బ్రాండ్ అయిన 2020 జిఎల్‌ఇ యొక్క డెలివరీలను ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

గుడ్ న్యూస్... ఇండియాలో 2020 జిఎల్‌ఇ డెలివరీలను ప్రారంభించిన బెంజ్

మెర్సిడెస్ బెంజ్ యొక్క 2020 జిఎల్‌ఇ డెలివరీలను భారతదేశంలో మొట్ట మొదట కేరళకు చెందిన మెర్సిడెస్ బెంజ్ డీలర్ రాజశ్రీ మోటార్స్ కి డెలివరీ చేసింది. బెంజ్ 2020 జిఎల్‌ఇ 300 డి ని కేరళలో కురియన్ అనే వ్యాపారవేత్తకు పంపిణీ చేయడం జరిగింది. బెంజ్ జిఎల్‌ఇ ఎల్‌డబ్ల్యుబి యొక్క రెండు వేరియంట్లు అందుబాటులో ఉండగా, మొదట 300 డి పంపిణీ చేయబడింది.

గుడ్ న్యూస్... ఇండియాలో 2020 జిఎల్‌ఇ డెలివరీలను ప్రారంభించిన బెంజ్

మెర్సిడెస్ బెంజ్ యొక్క నాలుగో తరం జిఎల్‌ఇ ఐదు సీట్ల ఎస్‌యువిని వారం క్రితం లాంచ్ చేశారు. కొత్త జిఎల్‌ఇ రెండు లాంగ్ వీల్ బేస్ ఫార్మాట్లలో లభిస్తాయి. అవి 300 డి, మరియు 400 డి. ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 73.70 లక్షలు, రూ. 1.25 కోట్లు (ఎక్స్-షోరూమ్).

గుడ్ న్యూస్... ఇండియాలో 2020 జిఎల్‌ఇ డెలివరీలను ప్రారంభించిన బెంజ్

సరికొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ 300 డి మోడల్ 2.0 లీటర్ నాలుగు సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 242 బిహెచ్‌పి శక్తి మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 9- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడుతుంది.

గుడ్ న్యూస్... ఇండియాలో 2020 జిఎల్‌ఇ డెలివరీలను ప్రారంభించిన బెంజ్

కొత్తగా వచ్చిన ఎస్‌యువి మునుపటి తరం మోడళ్ల కంటే సొగసైనది. ఇది ట్విన్-ఐబ్రో ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు మరియు వెనుకవైపు ఎల్‌ఇడి టెయిల్ లైట్లను కలిగి ఉంటుంది. ఇంటీరియర్స్ చాలా అప్‌డేట్‌లను కలిగి ఉంది.

గుడ్ న్యూస్... ఇండియాలో 2020 జిఎల్‌ఇ డెలివరీలను ప్రారంభించిన బెంజ్

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ 300 డి ఎల్‌డబ్ల్యుబి డ్యూయల్ 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లను కలిగి ఉంటుంది. ఇందులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కంపాటిబుల్, బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ మరియు ఎయిర్‌మాటిక్ ఎయిర్ సస్పెన్షన్ వంటివి కూడా ఇందులో ఉంటాయి.

గుడ్ న్యూస్... ఇండియాలో 2020 జిఎల్‌ఇ డెలివరీలను ప్రారంభించిన బెంజ్

ఈ వాహనంలో ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్లు, సీట్ మెమరీ ఫంక్షన్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 4 జోన్ థర్మోట్రోనిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. మెర్సిడెస్ వారి MBUX సిస్టం 2020 జిఎల్‌ఇ 300 డి ఎల్‌డబ్ల్యుబి లో వ్యవస్థాపించింది. ఇది మీడియా, నావిగేషన్, సీట్ మసాజ్ ఫంక్షన్ మరియు వాయిస్ కంట్రోల్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

గుడ్ న్యూస్... ఇండియాలో 2020 జిఎల్‌ఇ డెలివరీలను ప్రారంభించిన బెంజ్

బెంజ్ జిఎల్‌ఇ 300 డి లో భద్రతా లక్షణాలను గమనించినట్లైతే ఇందులో ఎబిఎస్ విత్ ఇబిడి, పార్క్ అసిస్ట్ సిస్టమ్, ఏడు ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ కెమెరా మరియు పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ కి సంబంధించిన వార్తల ప్రకారం ఇటీవల జరిగిన 2020 ఆటో ఎక్స్పోలో తమ బ్రాండ్ యొక్క వి క్లాస్ మార్కోపోలో ను కూడా ఆవిష్కరించింది. మార్కోపోయో వాణిజ్యపరంగా డెవలప్ చేసిన మొట్ట మొదటి క్యాంపర్.

గుడ్ న్యూస్... ఇండియాలో 2020 జిఎల్‌ఇ డెలివరీలను ప్రారంభించిన బెంజ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మెర్సిడెస్ బెంజ్ తన కొత్త బ్రాండ్ అయిన 2020 జిఎల్‌ఇ 300 డి ని డెలివరీ చేయడం హర్సిన్చాదగ్గ విషయం. ఈ కొత్త కారుకి మొదటి ఓనర్ అయినందుకు రామ్ కురియన్ కి అభినందనలు. బెంజ్ సంస్థ ప్రతిసారి కచ్చితమైన సమయానికి డెలివరీలను అందిస్తుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Mercedes GLE LWB Deliveries Begin In India: First 300d Model Delivered In Kerala. Read in Telugu.
Story first published: Wednesday, February 12, 2020, 15:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X