కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, భారత మార్కెట్లో మరో సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది. అధునాత లగ్జరీ ఫీచర్లతో తయారు చేసిన సరికొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్‌యూవీని కంపెనీ దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. ఇది రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న ఈ కొత్త జిఎల్ఎస్ ఎస్‌యూవీ మూడవ తరానికి చెందినది.

కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మహారాష్ట్రలో ఉన్న పూనే నగంలో మెర్సిడెస్ బెంజ్ చాకన్ ప్లాంట్‌లో ఇదివరకు స్థానికంగా అసెంబుల్ చేసినట్లు గానే ఈ కొత్త జిఎల్ఎస్ ఎస్‌యూవీని అక్కడే అసెంబుల్ చేయనున్నారు కోవిడ్-19 నేపథ్యంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ 2020 జిఎల్ఎస్ ఎస్‌యూవీని నేరుగా కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా మార్కెట్లో విడుదల చేసింది. ఈ కంపెనీ ఇదివరకే ఏఎమ్‌జి సి 63 మరియు ఏఎమ్‌జి జిటి-ఆర్ మోడళ్లను కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారానే విడుల చేసింది.

కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త తరం మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్‌యూవీ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇందులో కొత్తగా డిజైన్ చేసిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స మరియు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, సరికొత్త ఫ్రంట్ గ్రిల్ (కొత్త క్రోమ్ హారిజాంటల్ స్లాట్స్ మరియు మధ్యలో మెర్సిడెస్ బెంజ్ లోగో ఉంటాయి). అంతేకాకుండా ఈ కొత్త కారులో 21-ఇంచ్ అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ మఫ్లర్ డిజైన్‌లను కూడా మార్చారు.

MOST READ: మహీంద్రా సుప్రో అంబులెన్స్ : ధర & ఇతర వివరాలు

కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇక ఇంటీరియర్ల విషయానికి వస్తే.. ఇందులో 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ఉంటుంది. ఇది కంపెనీ అందిస్తున్న తమ స్వంత కనెక్టింగ్ టెక్నాలజీ అయిన ఎమ్‌బియూఎక్స్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే టెక్నాలజీలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, పానరోమిక్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియెంట్ లైటింగ్, ఆప్షనల్ రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్స్, ఫైవ్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి కీలక ఫీచర్లతో పాటుగా పలు ఇతర విలాసవంతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ కారులో తొలిసారిగా విలాసవంతమైన సిక్స్-సీటర్ క్యాబిన్‌ను జోడించారు. ఇందులో ఆరుగురు ప్రయాణీకులు (డ్రైవర్‌తో కలిపి) అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా సీట్లను డిజైన్ చేశారు. ఇందు కోసం కొత్త జిఎల్ఎస్ ఎస్‌యూవీని కాస్తంత పొడవుగా మార్చారు. మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ కొత్త జిఎల్ఎస్ ఎస్‌యూవీ 77 ఎమ్.ఎమ్. అధిక పొడవును మరియు 22 ఎమ్.ఎమ్. అధిక వెడల్పును కలిగి ఉంటుంది.

MOST READ: మీకు తెలుసా.. ఈ కారు, బైక్ కంటే చాలా చీప్

కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్‌యూవీ వీల్‌బేస్‌ను కూడా 60 ఎమ్.ఎమ్. పొడగించారు. ఈ మార్పుల వలన ఇంటీరియర్ క్యాబిన్ మరింత విశాలంగా అనిపిస్తుంది. ఈ కొత్త కారు పెట్రోల్ (450 4మ్యాటిక్) మరియు డీజిల్ (450డి 4మ్యాటిక్) వెర్షన్లలో లభిస్తుంది. ఈ రెండిటింలో కేవలం ఒకే ఒక ఫుల్లీ లోడెడ్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. మరిన్ని అధిక ఫీచర్లను కావాలనుకునే కస్టమర్లు కోసం కస్టమైజేషన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

పెట్రోల్ వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్‌యూవీలో 3.0 లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 362 బిహెచ్‌పిల శక్తిని, 500 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌లో మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్‌కి చెందిన ఈక్యూ బూస్ట్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించారు.

MOST READ: సివిక్ డీజిల్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన హోండా, డెలివరీస్ ఎప్పుడంటే?

కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇక డీజిల్ వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్‌యూవీలో 2.9 లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 362 బిహెచ్‌పిల శక్తిని, 700 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇంజన్ పవర్ పరంగా పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లు ఒకేరకమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. డీజిల్ వెర్షన్ మాత్రం పెట్రోల్ వెర్షన్ కన్నా అధికంగా 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ల ధరలను కంపెనీ సమానంగా ఉంచుతూ, ఈ రెండింటినీ రూ.99.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరకు మెర్సిడెస్ బెంజ్ ఇండియా విడుదల చేసింది.

ఈ సందర్భంగా.. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎమ్‌డి, సీఈఓ మార్టిన్ షెంక్ మాట్లాడుతూ.. "లగ్జరీ, కంఫర్ట్ మరియు టెక్నాలజీ కలయికతో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అత్యుత్తమ ఎస్‌యూవీ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్. ఈ కొత్త జిఎల్ఎస్ ఎస్‌యూవీలో పూర్తిగా ఏడు సీట్లు ఉండి ఎక్కువ లెగ్‌రూమ్‌ని ఆఫర్ చేస్తుంది. ప్రత్యేకించి రెండవ వరుసలో ఉన్న వారికి మంచి లెగ్‌రూమ్ ఉంటుంది.

MOST READ: కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

'మెర్సిడెస్ మి కనెక్ట్' సర్వీస్‌తో పూర్తిగా కనెక్ట్ అయిన లేటెస్ట్ జనరేషన్ టెక్నాలజీ ఎమ్‌బియూఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తున్న సరికొత్త టెకీ-శావీ ఎస్‌యూవీ ఇది. ఇందులో ఇంటీరియర్స్‌ను ఎస్‌యూవీ ప్రత్యేకతను అడుగడునా గుర్తు చేసేలా మోడ్రన్, లగ్జరీ ఎలిమెంట్స్‌తో డిజైన్ చేశారు. ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో పాటు బెస్ట్ మోడ్రన్ లగ్జరీ కలయికతో జిఎల్ఎస్‌ను డిజైన్ చేశామ"ని అన్నారు.

కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్‌యూవీ పదేళ్లు పూర్తి చేసుకుందని, ఇప్పటి వరకూ 6,700 యూనిట్ల జిఎల్ఎస్ వాహనాలు దేశపు రోడ్లపై తిరుగుతున్నాయని అన్నారు. ఈ విభంగాలో ఇది కస్టమర్లు ఎక్కువగా కోరుకుంటున్న ఫుల్-సైజ్ లగ్జరీ ఎస్‌యూవీని షెంక్ చెప్పారు. జిఎల్ఎస్ భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న నుంచి లభిస్తున్న అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలో జిఎల్ఎస్ కీలకమైన మోడల్‌గా కొనసాగుతుందని అన్నారు.

కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత లగ్జరీ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలైన కొత్త తరం 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లోని బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 మోడల్‌కి డైరెక్ట్ పోటీ ఇస్తుంది. ఇందులో పెట్రోల్, డీజిల్ వెర్షన్ల మధ్య ధరల్లో వ్యత్యాసం లేకుండా రెండింటినీ ఒకే ప్రైస్ రేంజ్‌లో విడుదల చేశారు.

Most Read Articles

English summary
Mercedes-Benz has launched the all-new (2020) GLS SUV in the Indian market. The new Mercedes-Benz GLS is available in two variants, both of which are priced at Rs 99.90 lakh, ex-showroom (India). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X