ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

మెర్సిడెస్ బెంజ్ తన ఫుల్లీ-ఎలక్ట్రిక్ లగ్జరీ ఎస్‌యూవీ ఇక్యూసిని భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి ఇప్పుడు భారతదేశంలో 99.30 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్, ఇండియా) తో అమ్మకానికి ఉంది. ఈ ధర మార్కెట్‌లోని మొదటి 50 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అంతే కాకుండా ఇది వాల్-మౌంట్ ఛార్జర్‌ను కూడా కలిగి ఉంటుంది, ఇది కస్టమర్ యొక్క ఇల్లు లేదా ఆఫీస్ లలో వ్యవస్థాపించబడుతుంది.

ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి ఎస్‌యూవీ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క ‘ఇక్యూ' శ్రేణిలోకి ప్రవేశించినట్లు సూచిస్తుంది. ఇక్యూసి దేశంలో మొట్టమొదటి ఫుల్లీ-ఎలక్ట్రిక్ లగ్జరీ ఎస్‌యూవీ. దీనికి మార్కెట్లో ప్రస్తుతం ప్రత్యక్ష ప్రత్యర్థులు లేరు. ఏదేమైనా ఇది ఆడి ఇ-ట్రోన్‌కి ప్రతార్థిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇక్యూసి ఎలక్ట్రిక్ కార్ వచ్చే ఏడాది విక్రయించబడుతుందని భావిస్తున్నారు.

ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టాల్సి ఉంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా నుండి ఆల్-ఎలక్ట్రిక్ కోసం బుకింగ్స్ ఇప్పుడు ఓపెన్ చేయబడ్డాయి. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభంలో భారతదేశంలోని ఆరు నగరాల్లో లభిస్తుంది. అవి ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్.

MOST READ:సూపర్ ఫీచర్లతో లాంచ్ అయిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ జి 310 బైక్స్ : పూర్తి వివరాలు

ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి తన అండర్ పిన్నింగ్స్‌ను సరికొత్త జిఎల్‌సి ఎస్‌యూవీతో పంచుకుంటుంది. అదే విధమైన డిజైన్‌తో ముందుకు వెళ్తుంది. ఈ ఎస్‌యూవీలో ఫ్రంట్ గ్రిల్ ఉంది. అంతే కాకుండా పెద్ద ‘త్రీ-పాయింటెడ్ స్టార్' దాని మధ్యలో ఉంటుంది.

ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

గ్రిల్ చుట్టూ మందపాటి స్ట్రిప్ క్రోమ్‌తో పాటు, ఇరువైపులా స్టైలిష్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్ యూనిట్లు ఉన్నాయి. హెడ్‌ల్యాంప్ యూనిట్లు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ యూనిట్లు మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌తో వస్తాయి. ఇది టర్న్ సిగ్నల్ ఇండికేటర్‌గా పనిచేస్తుంది.

MOST READ:భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ మినిమాలిక్‌గా ఉంచబడుతుంది. ఈ కారు సైడ్స్ లో ప్రత్యేక లక్షణం పెద్ద స్టైలిష్ డ్యూయల్-టోన్ మరియు ప్రత్యేకంగా కనిపించే అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో ఎల్‌ఈడీ టైల్లైట్స్‌ కూడా కలిగి ఉంటుంది.

ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లోపల డ్యూయల్ 10.3-అంగుళాల డిస్ప్లేలు ఉన్నాయి, ఒకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు మరొకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్. ఇక్యూసి బ్రాండ్ యొక్క లేటెస్ట్ వెర్షన్ MBUX కనెక్ట్ టెక్నాలజీతో కూడా వస్తుంది.

MOST READ:హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి రెండు ఎలక్ట్రిక్ మోటారులతో శక్తినిస్తుంది. దీనికి ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్లు 80 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటాయి. ఇక్యూసి లోని మొత్తం ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ 405 బిహెచ్‌పి మరియు 765 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒకే ఛార్జీపై 471 కిలోమీటర్ల పరిధిని అందించగలదని మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది.

ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి ఎస్‌యువి 5.1 సెకన్లలో 0 - 100 కిలోమీటర్ల / గం నుండి వేగవంతం అవుతుందని, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 180 కి.మీ / గం టాప్ స్పీడ్‌ను కూడా అందిస్తుందని, మెర్సిడెస్ బెంజ్ కూడా 40 నిమిషాల్లో 80% వరకు బ్యాటరీలను ఛార్జ్ చేయగల ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇక్యూసిని అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:యంగ్ కార్ట్ రేసర్‌పై జీవితకాల నిషేధం.. ఎందుకో తెలుసా ?

ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఫుల్లీ ఎలక్ట్రిక్ వెర్షన్. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎటువంటి ప్రత్యక్ష పరత్యర్థులు లేదు, అయినప్పటికీ త్వరలో మార్కెట్లో అడుగుపెట్టనున్న ఆడి ఇ-ట్రోన్ ఎస్‌యూవీకి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mercedes-Benz EQC Launched In India At Rs 99.30 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X