హైపర్‌స్క్రీన్ టెక్నాలజీని ఆవిష్కరించనున్న బెంజ్; ఇదేంటో తెలుసా?

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, వచ్చే నెలలో ఓ కొత్త టెక్నాలజీని అంతర్జాతీయంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఎమ్‌బియూఎక్స్ హైపర్‌స్క్రీన్ అని పిలువబడే ఓ సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీని మెర్సిడెస్ బెంజ్ ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఇది కొత్త ఫీచర్లు మరియు టెక్నాలజీలతో కూడి ఉంటుంది.

హైపర్‌స్క్రీన్ టెక్నాలజీని ఆవిష్కరించనున్న బెంజ్; ఇదేంటో తెలుసా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే ఎమ్‌బియూఎక్స్ హైపర్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, కంఫర్ట్ మరియు వెహికల్ ఫంక్షన్ల యొక్క వివిధ రకాల ఆపరేషన్ ఫీచర్లను ఓ కొత్త స్థాయికి తీసుకువెళుతుందని కంపెనీ పేర్కొంది. ఇది డ్యాష్‌బోర్డులో అమర్చబడే ఓ పెద్ద కర్వడ్ డిస్‌పిలే యూనిట్‌గా ఉంటుంది.

హైపర్‌స్క్రీన్ టెక్నాలజీని ఆవిష్కరించనున్న బెంజ్; ఇదేంటో తెలుసా?

ఎమ్‌బియూఎక్స్ (మెర్సిడెస్ బెంజ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్) అమర్చిన హైపర్‌స్క్రీన్, ఈ బ్రాండ్ నుండి రాబోయే ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారులో ఆప్షనల్‌గా ఆఫర్ చేయనున్నారు. మెరుగైన సాంకేతికతను కలిగి ఉండే ఈ హైపర్‌స్క్రీన్ దాని అభ్యాస సామర్ధ్యాల (లెర్నింగ్ క్యాపబిలిటీస్) కారణంగా ఇది చాలా సున్నితమైన అనుభవాన్ని అందించనుంది.

MOST READ:భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..

హైపర్‌స్క్రీన్ టెక్నాలజీని ఆవిష్కరించనున్న బెంజ్; ఇదేంటో తెలుసా?

ఎమ్‌బియూఎక్స్ హైపర్‌స్క్రీన్‌కు సంబంధించిన వరల్డ్ ప్రీమియంర్‌ను జనవరి 7, 2021న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో, మెర్సిడెస్ బెంజ్ ఎమ్‌బియూఎక్స్ హైపర్‌స్క్రీన్ యొక్క విశిష్టతలను తెలియజేయనుంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ లగ్జరీ సెడాన్ కారులో ఈ కొత్త ఫీచర్ కీలక పాత్రను పోషించనుంది.

హైపర్‌స్క్రీన్ టెక్నాలజీని ఆవిష్కరించనున్న బెంజ్; ఇదేంటో తెలుసా?

డిజిటల్ ఈవెంట్ ద్వారా మెర్సిడెస్ బెంజ్ తమ ఎమ్‌బియూఎక్స్ హైపర్‌స్క్రీన్ వివరాలను ప్రపంచానికి తెలియజేయనుంది. అంతేకాకుండా, మెర్సిడెస్ బెంజ్ మొట్టమొదటి డిజిటల్ 2021 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సిఇఎస్)లో కూడా ఎమ్‌బియుఎక్స్ హైపర్‌స్క్రీన్‌ను ప్రదర్శించనున్నారు. ఈ డిజిటల్ ఎక్స్‌పో ఈవెంట్ జనవరి 11 మరియు 14, 2021వ తేదీల మధ్యలో జరగనుంది.

MOST READ:మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

హైపర్‌స్క్రీన్ టెక్నాలజీని ఆవిష్కరించనున్న బెంజ్; ఇదేంటో తెలుసా?

ఈ కార్యక్రమానికి అనేక మంది అగ్రశ్రేణి సిబ్బంది హాజరై, వారు అభివృద్ధి చేసిన తమ సరికొత్త సాంకేతికతను గరించి వివరించనున్నారు. ఎమ్‌బియూఎక్స్ అనేది మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ యొక్క ఏఐ- అసిస్టెడ్ కనెక్ట్ టెక్నాలజీ, ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది.

హైపర్‌స్క్రీన్ టెక్నాలజీని ఆవిష్కరించనున్న బెంజ్; ఇదేంటో తెలుసా?

ఈ టెక్నాలజీ కలిగిన మెర్సిడెస్ బెంజ్ వాహనాలలో ప్రయాణించే డ్రైవర్ మరియు ప్రయాణీకులు కారులోని వివిధ రకాల విధులను నియంత్రించిందేకు ఇది సహకరిస్తుంది. మెరుగైన డ్రైవింగ్/క్యాబిన్ అనుభవం కోసం ఎప్పటికప్పుడు ఈ హైపర్‌స్క్రీన్‌లో అప్‌గ్రేడ్స్ పొందడానికి వీలుగా ఇందులో ఏఐ-అసిస్టెడ్ సాంకేతికత సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది.

MOST READ:డ్రీమ్ కార్‌లో కనిపించిన రిషబ్ శెట్టి.. అతని డ్రీమ్ నిజం చేసినది ఎవరో తెలుసా ?

హైపర్‌స్క్రీన్ టెక్నాలజీని ఆవిష్కరించనున్న బెంజ్; ఇదేంటో తెలుసా?

ఆధునిక యుగంలో కారును కొనుగోలు చేసే కస్టమర్లు ప్రధానంగా కోరుకునే అంశాల్లో లేటెస్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు కనెక్ట్ చేయబడిన సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒకటిగా మారిపోయింది. ఇప్పటికే అత్యంత పాపులర్ అయిన ఎమ్‌బియూఎక్స్ సిస్టమ్ ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మరింత మెరుగైన సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది.

Most Read Articles

English summary
Mercedes Benz To Unveil Its Latest MBUX Hyperscreen Technology Next Month, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X