2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేయనున్న మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో

భారతదేశంలో ఉపయోగించే విలాసవంతమైన కార్లలో మెర్సిడెస్ బెంజ్ ఒకటి. ఈ బ్రాండ్ నుంచి మార్కెట్లోకి చాలా వాహనాలు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు బెంజ్ నుంచి కొత్త వి- క్లాస్ మార్కోపోలో వాహనాన్ని విడుదలచేయడానికి సిద్ధంగా ఉంది. దీనిని గురించి మరింత తెలుసుకుందాం!

2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేయనున్న మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో

మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో రాబోయే ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. ఇది మార్కెట్లో ప్రారంభించిన తర్వాత దేశంలోనే మొట్టమొదటి వాణిజ్యపరంగా తయారు చేయబడిన క్యాంపర్‌గా ఉండబోతోంది. జర్మనీ లగ్జరీ ఆటో తయారీ సంస్థ వారి వి-క్లాస్ మోడల్ విజయవంతం అయిన తరువాత భారతదేశంలో మార్కో పోలోను ప్రారంభించటానికి పిలుపునిచ్చింది.

2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేయనున్న మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో

మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. మెకోపోలో భారతదేశంలో ఇంతకు ముందెన్నడూ చూడని ప్రత్యేకమైనది వాహనంగా ఉంటుంది. భారతదేశంలో వి-క్లాస్ లగ్జరీ ఎంపివి విజయం కావడంతో దాని నుండి ప్రేరణ పొందిన మేము వి-క్లాస్ మార్కో పోలో క్యాంపర్‌ను ప్రారంభించబోతున్నాము.

2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేయనున్న మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో

మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో ఫీచర్స్ ని గమనించినట్లైయితే ఇందులో వినియోగదారుని అనుకూలంగా ఉండే అన్ని లక్షణాలతో ఉంటుంది. వి- క్లాస్ మార్కో పోలో క్యాంపర్ వారి ప్రస్తుత కస్టమర్లలో కూడా చాలా ఆసక్తిని కలిగిస్తుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేయనున్న మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో

ప్రస్తుతానికి లక్షణాలు మరియు స్పెసిఫికేషన్ గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీనికి మార్కో పోలో అని పేరు పెట్టడం జరిగింది.

2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేయనున్న మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో

విదేశీ మార్కెట్లో ఉన్న మార్కోపోలో కార్ లో ముందు సీట్లు మరియు వెనుక సీట్లు మంచాలాగా మడవటాని అనుకూలంగా ఉంటుంది. ఈ వాహనానికి పాప్-అప్ పైకప్పు కూడా ఉంది. ఇది మేడ మీద నిద్రపోయే అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో వార్డ్రోబ్‌లు, డ్రాయర్లు, స్టవ్, ఫ్రెష్ మరియు వేస్ట్ వాటర్ ట్యాంకులతో కూడిన సింక్ వంటివి ఉంటాయి. ఇది చూడటానికి మొబైల్ హౌస్ లాగా ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేయనున్న మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో

వి-క్లాస్ మార్కో పోలో 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో-డీజిల్ ఇంజన్ని కలిగి ఉంటుంది. ఇది 234 బిహెచ్‌పి శక్తిని మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 9- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేయనున్న మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో

మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలోలోని భద్రతా లక్షణాలలో బ్రేక్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ సైడ్ ఇంపాక్ట్ బీమ్ , క్రాష్ సెన్సార్, సెంట్రల్లీ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్, అటెన్షన్ అసిస్ట్ మరియు హిల్ అసిస్ట్ వంటివి ఉన్నాయి ఉన్నాయి.

2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేయనున్న మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశంలో క్యాంపర్ తరహా ప్రయాణం చాలా అరుదుగా ఉంది. సాధారణంగా వాహనదారులు వారి ప్రయాణంలో రెస్ట్ తీసుకోవడానికి హోటల్స్ మరియు రిసార్ట్స్ ని ఉపయోగిస్తారు. కానీ మార్కోపోలో వినియోగదారులకు ఆ అవసరం ఉండదు. రెస్ట్ తీసుకోవడాని,నిద్రపోవడానికి సరైన నిర్మాణాలను ఇందులో తయారు చేయడం జరిగింది. ఇది వినియోగదారుని కొత్త అనుభూతిని అందించబోతోంది అని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Mercedes-Benz V-Class Marco Polo Launching In India: Will Debut At Auto Expo. Read in Telugu.
Story first published: Tuesday, January 28, 2020, 13:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X