ఒకే రోజు 11 జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. భారత దేశంలో కూడా ఎలెక్టిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి.

ఒకే రోజు 11 జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

ప్రారంభించిన అతి తక్కువ కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన వాహన తయారీ దారు ఎంజి మోటార్స్ కంపెనీ దేశీయ మార్కెట్లో తన ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఎంజి మోటార్స్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో ఉత్తమ మైలేజ్ ఇచ్చే వాహనాలలో ఇది కూడా ఒకటి.

ఒకే రోజు 11 జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో తర్వాత జెడ్ఎస్ ఇవి కారును డెలివరీ చేయడం ప్రారంభించిన ఎంజి మోటార్ కంపెనీకి ఉత్పత్తి, డిమాండ్‌కు అనుగుణంగా ఇప్పటివరకు 4,000 బుకింగ్‌లు వచ్చాయి. కేరళలోని కొచ్చిన్ లో ఒకే రోజు దాదాపు 11 కొత్త ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్లు డెలివరీ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది.

MOST READ:మార్చి 31 తర్వాత అమ్మిన బిఎస్ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

ఒకే రోజు 11 జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

ఎంజీ మోటార్ కంపెనీ గతంలో జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు హైదరాబాద్ లలో మాత్రమే విడుదల చేసింది. ఇటీవల కాలంలో కంపెనీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను కూడా కొంత వరకు పెంచింది. ఈ కారణంగా ఇప్పుడు జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను ఆరు ప్రధాన నగరాలకు విస్తరించింది.

ఒకే రోజు 11 జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

కొత్త జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారును పూణే, జైపూర్, చెన్నై, సూరత్, కొచ్చిన్ మరియు చండీగర్ ప్రాంతాలలో అధికారికంగా లాంచ్ చేశారు. అంతే కాకుండా బుకింగ్ ప్రక్రియతో పాటు కార్ డెలివరీని కూడా తిరిగి ప్రారంభించింది.

MOST READ:టైర్లు తయారు చేసే కంపెనీ కోవిడ్-19 మాస్క్ తయారు చేస్తే..?

ఒకే రోజు 11 జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

భారత దేశంలో కరోనా లాక్ డౌన్ వల్ల కొన్ని రోజులు ఎంజి మోటార్ కంపెనీ తన జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పుడు లాక్ డౌన్ కి కొంత మినహాయింపు కల్పించడం వల్ల కంపెనీ తన ఉత్పత్తిని తిరిగి ప్రారంభించింది.

ఒకే రోజు 11 జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అవి ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్, ఎక్సైట్ బేస్ వేరియంట్‌గా మరియు ఎక్స్‌క్లూజివ్ హై ఎండ్ మోడల్ వేరియంట్‌గా ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ ఎంజి జెడ్ఎస్ ఎక్సైట్ వెర్షన్ ధర రూ. 20.58 లక్షలు కాగా, ఎక్స్‌క్లూజివ్ వెర్షన్ ధర రూ. 53.58 లక్షలు.

MOST READ:త్వరలో అందుబాటులోకి రానున్న ఎగిరే కార్లు, చూసారా !

ఒకే రోజు 11 జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారులో 44.5 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్క సరి ఫుల్ ఛార్జ్ చేసిన తరువాత గరిష్టంగా 340 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 50 నిమిషాల్లో 80% బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. రాబోయే రోజుల్లో లాంచ్ కానున్న ఎంజి మోటార్స్ యొక్క కొత్త వేరియంట్‌లో 400 కిలోమీటర్ల హై మైలేజ్ ప్రేరేపిత బ్యాటరీ లభిస్తుంది ఇది మునుపటి వాటికంటే కొంత అధిక ధరను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
MG Dealership In Kerala Delivers 11 ZS Electric Cars On A Single Day. Read in Telugu.
Story first published: Thursday, July 9, 2020, 14:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X