Just In
- 5 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గ్లోస్టర్ ఎస్యూవీ డెలివరీస్ షురూ చేసిన ఎంజి మోటార్స్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజి మోటార్ ఈ ఏడాది తన కొత్త పుల్ సైజ్ ఎస్యూవీ ఎంజి గ్లోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా దేశీయ మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ అయినా ఈ ఎంజి మోటార్స్ కంపెనీ ఈ ఎస్‌యూవీని నాలుగు వేరియంట్లలో ప్రవేశపెట్టింది.

ఇవి కాకుండా 6 సీట్లు, 7 సీట్ల ఆప్షన్లతో ఈ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ నాలుగు వేరియంట్లలో సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు సావి ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఇన్పర్మేషన్ ప్రకారం, ఈ పుల్ సైజ్ ఎస్‌యూవీని డెలివరీ చేయడం కంపెనీ ప్రారంభించింది.

ఎంజి గ్లోస్టర్ యొక్క బుకింగ్స్ ప్రారంభించినప్పటి నుండి 2 వేల యూనిట్లను దాటింది మరియు సంస్థ యొక్క అదనపు సమాచారం ప్రకారం, ఈ సంవత్సరానికి ఎంజి గ్లోస్టర్ అమ్మకాలు పూర్తయ్యాయి. కంపెనీ ఈ ఎస్‌యూవీని రూ. 29.98 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో ప్రారంభించింది.
MOST READ:ఇది కారా లేకా 'మినీ' బారా? - మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్

దీని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 35.58 లక్షల రూపాయలు. ఈ 7 సీట్ల లగ్జరీ ఎస్యూవీ యొక్క టాప్-స్పెక్ వేరియంట్ ధరను ఎంజి మోటార్స్ ఇటీవల లక్ష రూపాయల వరకు పెంచినట్లు తెలిపింది. అయితే ఈ పెరిగిన ధరతోనే వచ్చే ఏడాదికి బుకింగ్‌లు స్వీకరించబడతాయి.

అదే సమయంలో, దాని మిడ్-స్పెక్ వేరియంట్లయిన స్మార్ట్ మరియు షార్ప్ ధరలను వరుసగా రూ. 50,000 మరియు రూ. 30,000 పెంచారు. ఇది కాకుండా, దాని టాప్-స్పెక్ వేరియంట్ గ్లోస్టర్ సావీ ధరను రూ. 20,000 పెంచినట్లు సమాచారం.
MOST READ:నిస్సాన్ మ్యాగ్నైట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ; కాంపాక్ట్ విభాగంలో బెస్ట్ ఎస్యూవీ కానుందా ?

ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీలో ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లాంప్స్, క్వాడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్, 19-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సెగ్మెంట్-ఫస్ట్ అడాస్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఇఎస్పి, టిసి, హెచ్హెచ్సి, హెచ్డిసి , 360-డిగ్రీ కెమెరా, ప్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, 12 వే పవర్ సర్దుబాటు డ్రైవర్ సీటు వంటివి ఇందులో ఉంటాయి.

ఎంజి గ్లోస్టర్ పెద్ద ప్రీమియం ఎస్యూవీ, ఇది 2.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో సహా ఒకే ఇంజన్ ఎంపికతో కంపెనీ దీన్ని విడుదల చేసింది. ఈ ఇంజన్ 215 బిహెచ్పి శక్తిని, 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించబడుతుంది.
Image Courtesy: MG Delhi East And MG Cochin
MOST READ:నుజ్జు నుజ్జయిన 25 కోట్ల విలువైన పగని కార్.. ఎలాగో తెలుసా