భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఎంజి మోటార్ ఇండియా తమ కొత్త గ్లోస్టర్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఎంజి గ్లోస్టర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది మరియు ఇప్పుడు మార్కెట్లో రూ. 28.98 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధరతో లభిస్తుంది.

భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఎంజి గ్లోస్టర్ సూపర్, స్మార్ట్, షార్ప్ & సావి అనే నాలుగు వేరియంట్లలో అందించబడుతుంది. ప్రతి వేరియంట్లు అనేక కొత్త ఫీచర్స్ కలిగి ఉంటుంది. బేస్ వేరియంట్‌ ధర రూ. 28.98 లక్షలు ఉండగా, టాప్-స్పెక్ 'సావీ' ట్రిమ్ ధర రూ. 35.38 లక్షలతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రీమియం ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, డెలివరీలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Variant Price
Super 7 Seater ₹28,98,000
Smart 7 Seater ₹30,98,000
Sharp 7 Seater ₹33,68,000
Sharp 6 Seater ₹33,98,000
Savvy 6 Seater ₹35,38,000
భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఎంజి గ్లోస్టర్ బ్రాండ్ యొక్క హెక్టర్ ప్లస్ సమర్పణకు పైన ఉంటుంది. ఇది కంపెనీ యొక్క కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా నిలిచింది. ఈ ఏడు సీట్ల మోడల్ దేశంలోని మొట్టమొదటి అటానమస్ 'లెవల్ 1' ఎస్‌యూవీ అవుతుంది. ఇందులో ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్ (ఎపిఎ), ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఎఇబి), ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మరియు లేన్ డిపార్చర్ వార్ణింగ్ వంటివి ఉంటాయి.

MOST READ:మరోసారి పెరిగిన బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ధర; ఈసారి ఎంత పెరిగిందంటే?

భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఇవి కాకుండా, ఎస్‌యూవీల ఎక్స్టీరియర్స్ మరియు ఇంటీరియర్‌లలో చుట్టూ ఇతర ఫీచర్లు మరిన్ని అందుబాటులో ఉన్నాయి. చుట్టూ ఉన్న ఎల్‌ఈడీ లైటింగ్, ఆటో లెవలింగ్‌తో హెడ్‌ల్యాంప్స్, ఎంజి లోగో ప్రొజెక్షన్‌లతో కూడిన ఓఆర్‌విఎంలు, పనోరమిక్ సన్‌రూఫ్, 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ లాంప్స్, స్టీరింగ్-అసిస్ట్ కార్నరింగ్ లాంప్స్, డ్యూయల్ బారెల్ ట్విన్ క్రోమ్ ఎగ్జాస్ట్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఈ ఎస్‌యూవీలో ఇంటీరియర్స్ ఫీచర్ల గమనించినట్లయితే ఇందులో లెదర్ తో చుట్టబడిన సీట్లు, రెండవ వరుసలో వ్యక్తిగత కెప్టెన్ సీట్లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు లేటెస్ట్ ఐ-స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 8 ఇంచెస్ MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పాడిల్ షిఫ్టర్లు, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టీ-వే ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ఫ్రెంట్ సీట్లు ఉన్నాయి.

MOST READ:కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఈ ఐ-స్మార్ట్ టెక్ కారును డ్రైవర్ యొక్క స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది, ఇది మొత్తం 57 అదనపు ఫీచర్స్ అందిస్తుంది. ఇందులో వెహికల్ స్టేటస్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్, వేరియస్ ఇన్-కార్ ఫీచర్ల రిమోట్ ఆపరేషన్లు ఉన్నాయి.

భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఎంజి గ్లోస్టర్ యొక్క కొలతలను గమనించినట్లయితే దీని పొడవు 4985 మి.మీ, వెడల్పు 1926 మి.మీ, ఎత్తు 1867 మి.మీ మరియు వీల్‌బేస్ 2950 మి.మీ కలిగి ఉంటుంది. ఇందులో క్యాబిన్ లోపల పుష్కలంగా స్థలాన్ని అందిస్తుంది.

MOST READ:ట్రక్ దొంగలించిన కొంత సమయానికే పట్టుబడ్డ దొంగల ముఠా.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా ?

భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

MG గ్లోస్టర్ అన్ని వేరియంట్లలో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో స్టాండర్డ్ గా ఉంటుంది. అయినప్పటికీ, సూపర్ మరియు స్మార్ట్ యొక్క బేస్ వేరియంట్లు ఒకే టర్బోచార్జర్‌ను అందుకుంటాయి, టాప్-స్పెక్ షార్ప్ మరియు సావి ట్రిమ్‌లు ట్విన్-టర్బో సెటప్‌ను పొందుతాయి.

భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

బేస్ వేరియంట్లలోని 2.0-లీటర్ టర్బో డీజిల్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 160 బిహెచ్‌పి మరియు 1500 - 2400 ఆర్‌పిఎమ్ వద్ద 375 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాప్-స్పెక్ ట్రిమ్స్‌లోని 2.0-లీటర్ ట్విన్-టర్బో యూనిట్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 216 బిహెచ్‌పి మరియు 1500 - 2400 ఆర్‌పిఎమ్ వద్ద 480 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ యొక్క రెండు వెర్షన్లు స్టాండర్డ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి.

MOST READ:యంగ్ కార్ట్ రేసర్‌పై జీవితకాల నిషేధం.. ఎందుకో తెలుసా ?

భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ నాలుగు కలర్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది. అవి అగాటా రెడ్, మెటల్ బ్లాక్, మెటల్ యాష్ మరియు వార్మ్ వైట్ కలర్స్. మేము ఇటీవల ఎంజి మోటార్ ఇండియా యొక్క గ్లోస్టర్ ఎస్‌యూవీని ఫస్ట్ డ్రైవ్ చేసాము. ఈ ప్రీమియం ఎస్‌యూవీ యొక్క ఫస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క లేటెస్ట్ ఆఫర్. ఈ కొత్త ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ భారతీయ మార్కెట్లో మహీంద్రా అల్టురాస్ జి 4, టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ వంటి ప్రత్యర్థులను తీసుకుంటుంది. కొత్తగా లాంచ్ అయిన ఈ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో మంచి స్పందనను చూరగొంటుందని మేము ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
MG Gloster Launched In India At Rs 28.98 Lakh. Read in Telugu.
Story first published: Thursday, October 8, 2020, 11:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X