ఎమ్‌జి డీలర్‌షిప్‌లో గ్లోస్టర్ ఎస్‌యూవీ; మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుందా?

ఎమ్‌జి మోటార్స్ ఇండియా భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీని తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. ఎమ్‌జి గ్లోస్టర్ పేరుతో భారత్‌లో తమ తన నాలుగవ ఉత్పత్తిగా రానున్న ఈ ప్రీమియం ఎస్‌యూవీని ఎమ్‌జి మోటార్స్ ఇప్పటిక్ తమ అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేస్తోంది.

ఎమ్‌జి డీలర్‌షిప్‌లో గ్లోస్టర్ ఎస్‌యూవీ; మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుందా?

తాజాగా టీఎమ్ బిహెచ్‌పి ఫోరంలో లీక్ అయిన చిత్రాలను గమనిస్తే, ఎమ్‌జి డీలర్‌షిప్ స్టాక్ యార్డ్‌లో ఉంచిన ఎమ్‌జి గ్లోస్టర్‌ను మనం చూడొచ్చు. దీన్నిబట్టి చూస్తుంటే, అతి త్వరలోనే ఈ మోడల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎమ్‌జి డీలర్‌షిప్‌లో గ్లోస్టర్ ఎస్‌యూవీ; మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుందా?

ఎమ్‌జి మోటార్స్ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న మాక్సస్ డి90 మోడల్ ఆధారంగా చేసుకొని ప్రత్యేకించి భారత్ వంటి మార్కెట్ల కోసం ఎమ్‌జి గ్లోస్టర్‌ను అభివృద్ధి చేశారు. ఎమ్‌జి మోటార్స్ తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో గ్లోస్టర్ ఎస్‌యూవీని ప్రదర్శనకు ఉంచింది.

MOST READ:ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులపై ప్రతీకారం తీర్చుకున్న ఇ-బోర్డు ఉద్యోగి, ఎలాగో తెలుసా

ఎమ్‌జి డీలర్‌షిప్‌లో గ్లోస్టర్ ఎస్‌యూవీ; మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుందా?

లీక్ అయిన చిత్రాలను గమనిస్తే, ఎమ్‌జి గ్లోస్టర్ డిజైన్, ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ ఫీచర్లు పూర్తిగా వెల్లడయ్యాయి. ఇందులో స్టైలిష్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, డి పిల్లర్ వద్ద బ్లాక్ ఎలిమెంట్ ఎస్‌యూవీకి ఫ్లోటింగ్-రూఫ్ ఎఫెక్ట్‌నిస్తుంది, విండోస్ చుట్టూ క్రోమ్ యాక్సెంట్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, బూట్‌కి దిగువన పెద్ద 'గ్లోస్టర్' బ్యాడ్జింగ్ మరియు '4WD', 'ADAS' బ్యాడ్జింగ్‌లను గమనించవచ్చు.

ఎమ్‌జి డీలర్‌షిప్‌లో గ్లోస్టర్ ఎస్‌యూవీ; మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుందా?

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఎమ్‌జి గ్లోస్టర్‌లో బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హిల్-డీసెంట్ కంట్రోల్ కోసం బటన్స్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, రియర్ డిఫరెన్షియల్ లాకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి మరెన్నో ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

MOST READ:మినీ క్లబ్‌మన్ స్పెషల్ ఎడిషన్ కారు కొన్న మలయాళ సినిమా యాక్టర్, ఎవరో తెలుసా ?

ఎమ్‌జి డీలర్‌షిప్‌లో గ్లోస్టర్ ఎస్‌యూవీ; మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుందా?

ఆటో, ఎకో, స్పోర్ట్, స్నో, మడ్, శాండ్ అండ్ రాక్ అనే వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను నియంత్రించడానికి రోటరీ నాబ్‌తో కూడిన కంట్రోల్‌ను ఇందులో చూడొచ్చు. ఇంకా ఇందులో డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

ఎమ్‌జి డీలర్‌షిప్‌లో గ్లోస్టర్ ఎస్‌యూవీ; మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుందా?

క్యాబిన్‌లో అతి ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే, ఇందులోని రెండవ వరుసలో వ్యక్తిగత కెప్టెన్ సీట్లు ఉంటాయి. గ్లోస్టర్ ఎస్‌యూవీలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు పానోరమిక్ సన్‌రూఫ్‌తో పాటుగా వెనుక వరుసలలోని ప్రయాణీకుల కోసం ఏసి వెంట్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

MOST READ:భారత్‌లో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఎమ్‌జి డీలర్‌షిప్‌లో గ్లోస్టర్ ఎస్‌యూవీ; మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుందా?

ఇంజన్ విషయానికొస్తే, ఎమ్‌జి గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీలో అదే 2.0-లీటర్ ఫియట్-సోర్స్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 218 బిహెచ్‌పి పవర్ మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

ఎమ్‌జి డీలర్‌షిప్‌లో గ్లోస్టర్ ఎస్‌యూవీ; మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుందా?

ఎమ్‌జి గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎమ్‌జి గ్లోస్టర్‌ను భారత మార్కెట్లో మిగిలిన మూడు ఉత్పత్తుల మాదిరిగా కాకుండా లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటి ధరలతో పోలిస్తే ఎమ్‌జి గ్లోస్టర్ ధర చాలా ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఇది మార్కెట్లో ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా అల్టురాస్ జి4 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

Team-BHP forum

MOST READ:మతిపోగుడుతున్న మాడిఫైడ్ మహీంద్రా ఇన్వాడర్

Most Read Articles

English summary
Ahead of its launch in the Indian market, the MG Gloster has now been spied arriving at dealerships. Spy pics of the MG Gloster at company dealerships have been released on the Team-BHP forum. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X