విడుదలకు ముందే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వేరియంట్ వివరాలు లీక్!

చైనా కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్, గడచిన జులై నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో ఓ 7-సీటర్ వెర్షన్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు కొత్త 7-సీటర్ వెర్షన్ మార్కెట్లో విడుదల కావటానికి ముందే దానికి సంబంధించిన వేరియంట్ వివరాలు లీక్ అయ్యాయి.

విడుదలకు ముందే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వేరియంట్ వివరాలు లీక్!

తాజా నివేదికల ప్రకారం, ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ మోడల్‌ను సూపర్ మరియు షార్ప్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో షార్ప్ వేరియంట్‌ను 4x4 ఆప్షన్‌తో మరియు సూపర్ వేరియంట్‌ను 4x2 ఆప్షన్‌తో విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, ఈ వేరియంట్లలోని ఇంజన్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు, అయితే ఇవి స్టాండర్డ్ 6-సీటర్ వెర్షన్ మాదిరిగానే ఉంటాయని తెలుస్తోంది.

విడుదలకు ముందే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వేరియంట్ వివరాలు లీక్!

గతంలో ఎమ్‌జి మోటార్స్ విడుదల చేసిన స్టాండర్డ్ ఎమ్‌జి హెక్టర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీకి ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా కంపెనీ ఈ ఏడాది తమ కొత్త హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఇది కేవలం 6-సీటర్ ఆప్షన్‌తోనే లభిస్తోంది. ఇందులో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు ఉండి, ముందు వరుసలో ఇద్దరు మధ్య వరుసలో ఇద్దరు మరియు చివరి వరుసలో ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు (2+2+2) కూర్చునే అవకాశం ఉంది.

MOST READ:విడుదలకు ముందే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వేరియంట్ వివరాలు లీక్!

విడుదలకు ముందే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వేరియంట్ వివరాలు లీక్!

కాగా, ఏడు సీట్ల హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో, స్టాండర్డ్ హెక్టర్ ఎస్‌యూవీలో గమనించినట్లుగా వెనుక వరుసలో కనిపించే బెంచ్ సీట్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ మద్య వరుసలో ఈ బెంచ్ సీటును అమర్చున్నారు. ఈ మార్పు వలన ముందు సీటులో ఇద్దరు, మధ్య సీటులో ముగ్గురు మరియు వెనుక సీటులో ఇద్దరు చొప్పున మొత్తం ఏడుగురు కూర్చునే అవకాశం ఉంటుంది.

విడుదలకు ముందే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వేరియంట్ వివరాలు లీక్!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 6-సీటర్ ఎమ్‌జి హెక్టర్ ప్లస్ మంచి ప్రజాదరణను పొందింది. ఇందులోని మధ్య వరుసలో ఉన్న కెప్టెన్ సీట్ల కారణంగా చివరి వరుసలోని సీట్లలోకి ప్రయాణీకులు చేరుకునేందుకు మరియు నిష్క్రమించేందుకు చాలా అనువుగా ఉంది. కానీ, కొత్త 7-సీటర్ వేరియంట్‌లో బెంచ్ సీటును జోడించినట్లయితే, క్యాబిన్ స్థలం తగ్గి, కాస్తంత ఇరుకుగా మారే అవకాశం ఉంది.

MOST READ:నిర్మానుష్య రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే టేక్ కేర్.. ఎందుకో వీడియో చూడండి

విడుదలకు ముందే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వేరియంట్ వివరాలు లీక్!

అంతేకాకుండా, చివరి వరుస సీట్లలోకి ప్రయాణీకులు చేరుకోవాలన్నా లేదా నిష్క్రమించాలన్నా కాస్తంత ఇబ్బందిగా కూడా అనిపించవచ్చు. ఏదేమైనప్పటికీ, ఈ 7-సీటర్ హెక్టర్ ప్లస్ మాత్రం దేశంలోని పెద్ద కుటుంబాలకు చాలా ఆచరణాత్మకంగా ఉంటుంది.

తాజా సమాచారం ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ తమ కొత్త 7-సీటర్ హెక్టర్ ప్లస్‌ను వచ్చే జనవరి నెలలో మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హెక్టర్ ప్లస్ 7-సీటర్ వెర్షన్‌లో కేవలం సీటింగ్ కాన్ఫిగరేషన్ మార్పు మినహా వేరే ఏ ఇతర మార్పులు ఉండబోవని సమాచారం.

విడుదలకు ముందే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వేరియంట్ వివరాలు లీక్!

అయితే, ఇటీవల లీకైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వెర్షన్ స్పై చిత్రాలను గమనిస్తే, ఈ ఎస్‌యూవీలో సీటింగ్ సామర్థ్యాన్ని పెంచడం వలన, క్యాబిన్ లోపల లగేజ్ సామర్థ్యం కోల్పోవడం జరుగుతుంది. ఫలితంగా, ఇందులో అదనపు లగేజ్ స్పేస్ కోసం ఎస్‌యూవీ పైకప్పు-పైభాగంలో ఓ సన్నటి లగేజ్ ర్యాక్‌ను కూడా అమర్చినట్లు తెలుస్తోంది. మరి ఈ ఫీచర్ ఇది వాస్తవంగా లాంచ్ అయినప్పుడు ఉంటుందో లేదో చూడాలి.

MOST READ:అలెర్ట్.. 2021 జనవరి 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

విడుదలకు ముందే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వేరియంట్ వివరాలు లీక్!

ప్రస్తుతం దేశీయ విపణిలో ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని రూ.13.48 లక్షల నుండి రూ.18.53 లక్షల (ఎక్స్‌షోరూమ్, ఇండియా) మధ్యలో విక్రయిస్తున్నారు. హెక్టర్ ప్లస్ 7-సీటర్ వీటి కన్నా కాస్తంత అధిక ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇకపోతే, ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌ను స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే మూడప వేరియంట్లలో అందిస్తున్నారు. ఇందులో నాలుగు వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తాయి.

విడుదలకు ముందే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వేరియంట్ వివరాలు లీక్!

పెట్రోల్ వెర్షన్‌లో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 143 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 170 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పెట్రోల్ ఇంజన్‌లో మాత్రం ఆప్షనల్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది.

MOST READ:ఒకటి, రెండు కాదు ఏకంగా 80 పోర్స్చే కార్లను కలిగి ఉన్న 80 ఏళ్ళ వ్యక్తి ; పూర్తి వివరాలు

విడుదలకు ముందే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వేరియంట్ వివరాలు లీక్!

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీట్ వెర్షన్లలో కూడా ఇవే ఇంజన్లను కొనసాగించే అవకాశం ఉంది మరియు వాటి పవర్, టార్క్ గణాంకాలు కూడా ఇంచు మించు ఇలానే ఉండొచ్చని అంచనా. ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంటుంది మరియు దాని మధ్యలో అమర్చిన ఐ-స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీతో కూడిన 10.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు కొత్త 'చిట్-చాట్' ఫంక్షనాలిటీతో లభిస్తుంది.

విడుదలకు ముందే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వేరియంట్ వివరాలు లీక్!

ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు వైఫై కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఇందులోని ఇతర ఫీచర్లలో పానోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వద్ద పెద్ద ఎమ్ఐడి డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్ మరియు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవి ఉన్నాయి.

Source: Carwale

Most Read Articles

English summary
MG Hector Plus 7 Seater Variant Details Leaked Ahead Of India Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X