వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్; త్వరలోనే విడుదల!

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా, భారత మార్కెట్లో తమ మూడవ మోడల్ 'హెక్టర్ ప్లస్‌'ను ప్రవేశపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ తాజాగా తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని జోడించింది. దీన్నిబట్టి చూస్తుంటే వచ్చే నెలలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్; త్వరలోనే విడుదల!

ఈ మోడల్ భారతీయ మార్కెట్లో విడుదల కావటానికి ముందే డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటోంది. హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని కొత్త కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న హెక్టర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీకి పొడగించబడిన వెర్షనే ఈ కొత్త ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్; త్వరలోనే విడుదల!

హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ రెండు మోడళ్లలో వ్యత్యాసాన్ని చూపేందుకు కంపెనీ హెక్టర్ ప్లస్ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో పలు మార్పులు చేర్పులు చేయనుంది. భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఆరు మరియు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుంది.

MOST READ: విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్; త్వరలోనే విడుదల!

ఇందులో అప్‌డేట్ చేసిన గ్రిల్, హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్స్, బూట్-లిడ్ డిజైన్లు మారే అవకాశం ఉంది. ఇందులో చాలా ముఖ్యమైన మార్పు క్యాబిన్‌లో ఉండనుంది. ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో మూడవ వరుసలో సీటింగ్ ఉంటుంది. రెండవ వరుసలో బెంచ్ సీట్ లేదా ఇండివిడ్యువల్ కెప్టెన్ సీట్లతో ఇది లభ్యం కానుంది.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్; త్వరలోనే విడుదల!

ఫైవ్ సీటర్ ఎమ్‌జి హెక్టర్ మాదిరిగానే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో కూడా ఒకే రకమైన ఇంజన్లను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్ 140 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 173 బిహెచ్‌పిల శక్తిని మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: మరింత పొడుగు పెరగనున్న హెవీ వెహికల్స్, ఎందుకంటే ?

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్; త్వరలోనే విడుదల!

ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. పెట్రోల్ వెర్షన్‌లో 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లభించే అవకాశం ఉంది.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్; త్వరలోనే విడుదల!

హెక్టర్‌తో పోల్చుకుంటే హెక్టర్ ప్లస్‌లో ఇతర ఫీచర్లు మరియు పరికరాలు కూడా ఉంటాయి. ఇందులో ప్రీమియం అప్‌హెలెస్ట్రీ సీట్లు, లేటెస్ట్-జెన్ ఐస్మార్ట్ కనెక్టివిటీ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

MOST READ: కెజిఎఫ్ స్టార్ యష్ లగ్జరీ కార్లు, ఎలా ఉన్నాయో చూసారా ?

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్; త్వరలోనే విడుదల!

భారత్‌లో విడుదలైతే ఈ సెగ్మెంట్లోని టొయోటా ఇన్నోవా క్రిస్టా, టాటా గ్రావిటాస్, ఫోర్డ్ ఎండీవర్ వంటి ఏడు సీట్ల ఎస్‌యూవీలతో ఎమ్‌జి హెక్టర్ ప్లస్ పోటీ పడే ఆస్కారం ఉంది.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్; త్వరలోనే విడుదల!

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌ను వెబ్‌సైట్‌లో జోడించడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎమ్‌జి మోటార్స్ తమ కొత్త హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ అధికారిక వెబ్‌సైట్‌లో జోడించడాన్ని చూస్తుంటే, అతి త్వరలోనే ఈ మోడల్ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి పోటీతో కూడుకున్న ఫుల్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో వస్తున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని కంపెనీ సరసమైన ధరకే ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ .13 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
MG Motor India is gearing up to launch its third SUV in the Indian market next month. Called the Hector Plus is an extended variant of the standard model that is on sale in the Indian market. Ahead of its launch, the company has listed the upcoming SUV on its official website. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X