ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో 7సీటర్ వేరియంట్; త్వరలో విడుదల - వివరాలు

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ కొత్త 7-సీటర్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశీయ విపణిలో కంపెనీ ఈ మోడల్‌ను రూ.13.48 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)తో విడుదల చేసింది. కంపెనీ అందిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ హెక్టర్‌కు పొడగించబడిన మోడలే ఈ కొత్త హెక్టర్ ప్లస్.

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో 7సీటర్ వేరియంట్; త్వరలో విడుదల - వివరాలు

ఈ మోడల్ విడుదల సమయంలో కంపెనీ హెక్టర్ ప్లస్ యొక్క సెవన్ సీట్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు సూచనప్రాయంగా పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో విడుదల చేసిన హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు ఉండి, కేవలం ఆరు మంది (2+2+2) కూర్చునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, కంపెనీ ఓ 7-సీటర్ వెర్షన్‌ను ప్రస్తుతం భారత రోడ్లపై పరీక్షిస్తోంది.

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో 7సీటర్ వేరియంట్; త్వరలో విడుదల - వివరాలు

ఏడు సీట్ల వేరియంట్లో స్టాండర్డ్ హెక్టర్ ఎస్‌యూవీలోని వెనుక వరుసలో కనిపించినట్లుగా బెంచ్ సీట్‌ను హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ మద్య వరుసలో అమర్చున్నారు. అంటే ఇందులో ముందు వరుసలో ఇద్దరు, మధ్య వరుసలో ముగ్గురు, చివరి వరుసలో ఇద్దరు చొప్పున మొత్తం ఏడు మంది కూర్చునే సౌకర్యం ఉంటుంది. తాజాగా 7-సీటర్ హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

MOST READ: కారులో భార్య ఉంగరం పోయింది.. భర్త దాన్ని ఎలా కనిపెట్టించాడో తెలుసా ?

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో 7సీటర్ వేరియంట్; త్వరలో విడుదల - వివరాలు

ఈ చిత్రాల ప్రకారం, 7-సీటర్ హెక్టర్ ప్లస్‌లో సీటింగ్ సామర్థ్యాన్ని పెంచడం వలన ఎస్‌యూవీ పైకప్పు-పైభాగంలో లగేజ్ ర్యాక్‌ను అమర్చారు. ఇది తప్ప డిజైన్ పరంగా ప్రస్తుత 6-సీటర్‌కు కొత్త 7-సీటర్‌కు ఎలాంటి మార్పులు లేవు. ఆరు సీట్ల హెక్టర్ ప్లస్‌లో కనిపించే అన్ని ఫీచర్లు, పరికరాలు కొత్త ఏడు సీట్ల మోడల్‌లోనూ కనిపించనున్నాయి.

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో 7సీటర్ వేరియంట్; త్వరలో విడుదల - వివరాలు

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో నాలుగు వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. డీజిల్ ఇంజన్‌తో నడిచే టాప్-స్పెక్ ‘షార్ప్' వేరియంట్ ధర రూ.18.53 లక్షలు ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా ఉంది. కొత్త ఏడు సీట్ వేరియంట్‌ను విపణిలో విడుదల చేసిన తర్వాత దానిని కూడా టాప్-స్పెక్ వేరియంట్‌తో సమానమైన ధరకే విడుదల చేసే అవకాశం ఉంది.

MOST READ: కొత్త మహీంద్రా థార్ నడిపిన పృథ్వీరాజ్.. కారు గురించి అతను ఏమి చెప్పాడో తెలుసా ?

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో 7సీటర్ వేరియంట్; త్వరలో విడుదల - వివరాలు

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్డ్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ మరియు రివైజ్డ్ ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ ఉన్నాయి. ఇందులోని అల్లాయ్ వీల్ డిజైన్ కూడా హెక్టర్ ఎస్‌యూవీ కన్నా భిన్నంగా ఉంటుంది.

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో 7సీటర్ వేరియంట్; త్వరలో విడుదల - వివరాలు

ఇంటీరియర్స్‌ని గమనిస్తే, కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్ మధ్యలో అమర్చిన ఐ-స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీతో కూడిన 10.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు కొత్త ‘చిట్-చాట్' ఫంక్షనాలిటీతో లభిస్తుంది.

MOST READ: కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో 7సీటర్ వేరియంట్; త్వరలో విడుదల - వివరాలు

ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు వైఫై కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఇందులోని ఇతర ఫీచర్లలో పానోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వద్ద పెద్ద ఎమ్ఐడి డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్ మరియు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవి ఉన్నాయి.

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో 7సీటర్ వేరియంట్; త్వరలో విడుదల - వివరాలు

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ రెండు ఇంజన్ ఆప్షన్లలో అందించబడుతుంది. అవి: 1.5-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ యూనిట్. ఇందులోని టర్బో-పెట్రోల్ ఇంజన్ 140 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే డీజిల్ ఇంజన్ 170 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పెట్రోల్ ఇంజన్‌లో ఆప్షనల్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ కూడా అందుబాటులో ఉంది.

MOST READ: కొడుకు పరీక్ష రాయించడానికి 105 కి.మీ సైకిల్ పై తీసుకెళ్లిన తండ్రి

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో 7సీటర్ వేరియంట్; త్వరలో విడుదల - వివరాలు

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎమ్‌జి మోటార్ ఇండియా ఇటీవలే విడుదల చేసిన హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని 6-సీటర్ ఆప్షన్‌తో మాత్రమే విడుదల చేసింది. భారత వంటి మార్కెట్లకు ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగిన వాహనాలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో 7-సీటర్ వెర్షన్‌ను డెవలప్ చేస్తోంది. మధ్య వరుసలో బెంచ్ సీటు ఉండటం వల్ల మెరుగైన ప్రాక్టికాలిటీ లభిస్తుంది.

Source: MotorBeam

Most Read Articles

English summary
MG Motor India recently launched the Hector Plus SUV in the Indian market. The company has priced the SUV starting at Rs 13.48 lakh, ex-showroom (India). Read in Telugu.
Story first published: Saturday, August 22, 2020, 16:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X