ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో పానరోమిక్ సన్‌రూఫ్, ఆరు సీట్లు

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా, భారత మార్కెట్లో తమ మూడవ మోడల్ 'ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌'ను జూలై 13న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఈ మోడల్‌కు సంబంధించిన మరికొన్ని వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. ఎమ్‌జి మోటార్ హెక్టర్ ప్లస్ పానోరమిక్ సన్‌రూఫ్‌తో రానుంది. దీంతో ఇది ఈ సెగ్మెంట్లో పానరోమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను అందిస్తున్న ఏకైక సిక్స్ సీటర్ ఎస్‌యూవీగా మారనుంది.

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో పానరోమిక్ సన్‌రూఫ్, ఆరు సీట్లు

పానోరమిక్ సన్‌రూఫ్‌తో పాటుగా, ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో ఇతర ఆసక్తికరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు వై-ఫై కనెక్టివిటీతో కూడిన 10.4 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను నిలువుగా అమర్చబడి ఉంటుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ ఐస్‌మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది.

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో పానరోమిక్ సన్‌రూఫ్, ఆరు సీట్లు

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఈ బ్రాండ్‌కు దేశంలో మూడవ మోడల్ అవుతుంది. కంపెనీ ఇప్పటికే హెక్టర్, జెడ్ఎస్ ఈవి (ఎలక్ట్రిక్ కార్) మోడళ్లను విక్రయిస్తోంది. హెక్టర్ ఎస్‌యూవీకి పొడగించడబడిన వెర్షనే ఈ హెక్టర్ ప్లస్. హెక్టర్‌తో పోల్చకుంటే ఇది విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్‌ను కలిగి ఉండి, మరిన్ని అదనపు ఫీచర్లతో వస్తుంది. ఈ రెండు మోడళ్య మద్య వ్యత్యాసాన్ని గుర్తించేందుకు ఎక్స్టీరియర్లలో కూడా చిన్నపాటి మార్పులు చేర్పులు ఉంటాయి.

MOST READ: టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో పానరోమిక్ సన్‌రూఫ్, ఆరు సీట్లు

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఆరు మరియు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుంది. ఇందులో అప్‌డేట్ చేసిన గ్రిల్, హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్స్, బూట్-లిడ్ డిజైన్లు మారే అవకాశం ఉంది. ఇందులో చాలా ముఖ్యమైన మార్పు క్యాబిన్‌లో ఉండనుంది. ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో మూడవ వరుసలో సీటింగ్ ఉంటుంది. రెండవ వరుసలో బెంచ్ సీట్ లేదా ఇండివిడ్యువల్ కెప్టెన్ సీట్లతో ఇది లభ్యం కానుంది.

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో పానరోమిక్ సన్‌రూఫ్, ఆరు సీట్లు

ఫైవ్ సీటర్ ఎమ్‌జి హెక్టర్ మాదిరిగానే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో కూడా ఒకే రకమైన ఇంజన్లను ఉపయోగించనున్నారు. ఇందులో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్ 140 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 173 బిహెచ్‌పిల శక్తిని మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తిరగటం నిషేధించిన NGT ; ఎందుకంటే ?

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో పానరోమిక్ సన్‌రూఫ్, ఆరు సీట్లు

ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. పెట్రోల్ వెర్షన్‌లో 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లభించే అవకాశం ఉంది. హెక్టర్‌తో పోల్చుకుంటే హెక్టర్ ప్లస్‌లో ప్రీమియం అప్‌హెలెస్ట్రీ సీట్లు, లేటెస్ట్-జెన్ ఐస్మార్ట్ కనెక్టివిటీ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో పానరోమిక్ సన్‌రూఫ్, ఆరు సీట్లు

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ పానరోమిక్ సన్‌రూఫ్, సిక్స్ సీటర్ ఆప్షన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ప్రస్తుతం భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీలలో ఒకటి. ఇది ఈ సెగ్మెంట్లోని టొయోటా ఇన్నోవా క్రిస్టా, టాటా గ్రావిటాస్, ఫోర్డ్ ఎండీవర్ వంటి ఏడు సీట్ల ఎస్‌యూవీలతో ఎమ్‌జి హెక్టర్ ప్లస్ పోటీ పడే ఆస్కారం ఉంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ .13 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
MG Motor India is all set to launch the Hector Plus six-seater SUV in the Indian market. The six-seater MG Hector Plus SUV is scheduled to be introduced in the country on the 13th of July. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X