ఒకే రోజు ఏడు గ్లోస్టర్ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన ఎంజి మోటార్ ; ఎక్కడో తెలుసా ?

ఇటీవల భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఎంజి మోటార్స్ యొక్క ఎంజి గ్లోస్టర్ కి మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా ఈ కొత్త ఎస్‌యూవీ ఎక్కువ సంఖ్యలో బూకిన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు కేరళలోని కొచ్చిన్‌లో ఒకే రోజులో మొత్తం ఏడు గ్లోస్టర్ ఎస్‌యూవీలను పంపిణీ చేసినట్లు ఎంజి మోటార్ ఇండియా ప్రకటించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒకే రోజు ఏడు గ్లోస్టర్ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన ఎంజి మోటార్ ; ఎక్కడో తెలుసా ?

ఎంజి గ్లోస్టర్ ఎంజి మోటార్ బ్రాండ్ యొక్క సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ. దీని ప్రారంభ ధర రూ .28.98 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా). ఏడు సీట్ల ఎస్‌యూవీ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క ఉత్పత్తి శ్రేణిలో హెక్టర్ ప్లస్ పైన ఉంది. ‘అటానమస్ లెవల్ 1' టెక్నాలజీ మరియు ఇతర అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం తో భారతదేశపు మొట్టమొదటి ప్రీమియం ఎస్‌యూవీ గా ఈ ఎంజీ గ్లోస్టర్ నిలిచింది.

ఒకే రోజు ఏడు గ్లోస్టర్ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన ఎంజి మోటార్ ; ఎక్కడో తెలుసా ?

భారతీయ మార్కెట్లో గ్లోస్టర్ కోసం కంపెనీ మంచి స్పందనను పొందగలిగింది. ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ తన మొదటి నెలలో 627 యూనిట్లను భారతీయ మార్కెట్లో నమోదు చేసింది. ఇది నవంబర్ 2020 నెలలో ఎంజి మోటార్ కోసం మొత్తం 4,163 యూనిట్ల అమ్మకాలకు దోహదపడింది.

MOST READ:నమ్మండి ఇది నిజంగా హీరో స్ప్లెండర్ బైక్, కావాలంటే వీడియో చూడండి

ఒకే రోజు ఏడు గ్లోస్టర్ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన ఎంజి మోటార్ ; ఎక్కడో తెలుసా ?

హెక్టర్ మరియు జెడ్ఎస్ ఇవి మోడల్స్ వరుసగా 3,426 యూనిట్లు మరియు 110 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ఎంజి మోటార్ భారతదేశంలో ఇప్పటివరకు అత్యధిక అమ్మకాల గణాంకాలను నమోదు చేసింది మరియు వార్షిక అమ్మకాలలో 28.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఒకే రోజు ఏడు గ్లోస్టర్ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన ఎంజి మోటార్ ; ఎక్కడో తెలుసా ?

ఎంజి గ్లోస్టర్‌ యొక్క ఏడు సీట్ల వెర్షన్ రెండు ఇంజన్ ఆప్షన్ల ఎంపికతో వస్తుంది. అవి 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ మరియు 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్. ట్విన్-టర్బో డీజిల్ యూనిట్ హై-స్పెక్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది, ఇది 215 బిహెచ్‌పి మరియు 480 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుది. రెండు ఇంజన్లు ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్ గా జతచేయబడతాయి.

MOST READ:వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యో హోండా మోటార్‌సైకిల్!

ఒకే రోజు ఏడు గ్లోస్టర్ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన ఎంజి మోటార్ ; ఎక్కడో తెలుసా ?

ఎంజి గ్లోస్టర్ సూపర్, షార్ప్, స్మార్ట్ మరియు సావి అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. నాలుగు వేరియంట్లు అనేక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉన్నాయి. వీటిలో కొన్ని ఆటో పార్క్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్ణింగ్ వంటివి ఉన్నాయి.

ఒకే రోజు ఏడు గ్లోస్టర్ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన ఎంజి మోటార్ ; ఎక్కడో తెలుసా ?

ఎంజి గ్లోస్టర్‌లోని ఇతర ఫీచర్స్ గమనించినట్లయితే ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్ప్లేతో కూడిన 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు సరికొత్త ఐ-స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ, 8 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆరు మరియు ఏడు-సీట్ల కాన్ఫిగరేషన్, చుట్టూ ఎల్ఈడి లైటింగ్ ఉన్నాయి. ఈ కొత్త ఎంజి గ్లోస్టర్ దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది.

MOST READ:త్వరలో రోడ్డెక్కనున్న అలీబాబా డ్రైవ్‌లెస్ రోబోటాక్సిస్, ఇవే.. మీరు చూసారా

Most Read Articles

English summary
MG Motor India Delivers Seven Gloster SUVs To Cochin Customers In A Single Day. Read in Telugu.
Story first published: Monday, December 7, 2020, 18:09 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X