సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా, దేశీయ మార్కెట్లో 'ఎమ్‌జి రీఅష్షూర్' పేరిట ప్రీ ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) కార్ల వ్యాపారంలోకి ప్రవేశించింది.పెట్టింది. ఎమ్‌జి మోటార్స్ తమ కొత్త ప్రీ-ఓన్డ్ కార్ వ్యాపారాన్ని 'ప్రీ-లవ్డ్' కార్ యూనిట్ పిలవాలని భావిస్తోంది. ఈ కొత్త విభాగం ద్వారా కస్టమర్లకు ఉత్తమమైన ప్రీ-ఓన్డ్ కార్లను అందించాలని కంపనీ లక్ష్యంగా పెట్టుకుంది.

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

ఎమ్‌జి రీఅష్షూర్‌లో భాగంగా, విక్రయానికి వచ్చే ప్రతి కారును దాని

ఉత్తమ తనిఖీ ప్రమాణాలను నిర్ధారించడానికి 160కి పైగా నాణ్యత తనిఖీలు చేస్తామని కంపెనీ తెలిపింది. ఎమ్‌జి డీలర్‌షిప్‌ల ద్వారా తిరిగి కస్టమర్లకు విక్రయించబడే అన్ని కార్లను కూడా మరోసారి పూర్తిగా తనిఖీ చేసి, మరమ్మత్తులు ఏవైనా ఉంటే, వాటిని పూర్తి చేశాకే కస్టమర్లకు విక్రయిస్తారు.

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

అన్ని కార్లను కూడా ఒక పద్దతి ప్రకారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరైన ధరను నిర్ధారిస్తారు. ఎమ్‌జి మోటార్స్ ప్రారంభించిన ఎమ్‌జి రీఅష్షూరెన్స్ వద్ద కస్టమర్లు తమ పాత కార్లను విక్రయించడమే కాకుండా, వాటిని కొత్త ఎమ్‌జి కార్ల కోసం ఎక్సేంజ్ కూడా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

MOST READ: టాప్ కార్ న్యూస్: మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కార్లు; ఎస్‌యూవీలదే పైచేయి

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

ఎమ్‌జి మోటార్ ఇండియా పేర్కొన్నా దాని ప్రకారం, భారత మార్కెట్లో తమ వాహనాలు ఉత్తమ రీసేల్ వ్యాల్యూని కలిగి ఉన్నాయని, ప్రస్తుతం ఈ మోడళ్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉందని తెలిపింది. దాదాపు ఒక సంవత్సరం వాడకం తరువాత కూడా ఎమ్‌జి హెక్టర్ వంటి మోడళ్లు ఇప్పటికీ 95 - 100 శాతం వరకూ రీసేల్ వ్యాల్యూని కలిగి ఉంటున్నట్లు కంపెనీ తెలిపింది.

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

ప్రీ-ఓన్డ్ ఎమ్‌జి కార్లను కొనాలని చూస్తున్న కస్టమర్లకు ఆ మోడళ్లను మాత్రమే ఆఫర్ చేస్తారు. రీసేల్‌కి వచ్చిన ఎమ్‌జి కార్లన్నింటికీ కంపెనీ నిర్దేశించిన కఠినమైన తనిఖీ పరీక్షలు నిర్వహిస్తారు. వాటికి ఏవైనా మరమ్మత్తులు అవసరమైతే, వాటిని సరిచేసి సర్టిఫై చేస్తారు.

MOST READ: మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వ్యాగన్ఆర్; త్వరలో విడుదల

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

ఇలాంటి కస్టమర్ల కోసం ఎమ్‌జి మోటార్స్ 3 సంవత్సరాల మరియు అపరిమిత కిలోమీటర్ల వారంటీతో పాటుగా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు మూడు ఉచిత సర్వీస్‌లను కూడా అందిస్తుంది. ఇది దేశంలోనే ఏదైనా అధీకృత వాహన రీసేల్ పరిశ్రమలో అత్యుత్తమ కస్టమర్-సెంట్రిక్ ఆఫర్‌గా మారుతుంది.

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

ప్రీ-ఓన్డ్ వ్యాపారాన్ని ప్రారంభించడం గురించి ఎమ్‌జి మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, 'ఎమ్‌జి రిఅష్షూర్' కార్యక్రమం ద్వారా భారతదేశంలో మా కస్టమర్లకు పారదర్శకమైన, వేగవంతమైన మరియు ఎమ్‌జి కార్ల యొక్క ఉత్తమ రీసేల్ వ్యాల్యూ భరోసాను విస్తరించే వేదికను సృష్టించాలనుకుంటున్నాము" అన్నారు.

MOST READ: రామ్ టిఆర్ఎక్స్ పికప్ ట్రక్ : ప్రారంభించిన కొద్ది గంటల్లో రికార్డు అమ్మకాలు

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

"ఈ కార్యక్రమం ద్వారా మా అష్షూరెన్స్ సెంటర్స్ నుండి నాణ్యమైన ప్రీ-లవ్డ్ ఎమ్‌జి కార్లను కొనుగోలు చేయడానికి ఇతర కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ ప్రణాళిక కస్టమర్ నిలుపుదలని మెరుగుపరుస్తుంది మరియు సౌకర్యవంతమైన యాజమాన్యాన్ని అనుభవించేలా చేస్తుందని" ఆయన అన్నారు.

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

ఎమ్‌జి మోటార్ ఇండియాలో ప్రస్తుతం దేశంలో మూడు మోడళ్లను విక్రయిస్తోంది. అవి: హెక్టర్, జెడ్ఎస్ ఈవి మరియు హెక్టర్ ప్లస్. మరికొద్ది రోజుల్లో ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్లో తమ నాల్గవ ఉత్పత్తిగా తమ ప్రీమియం గ్లోస్టర్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.

MOST READ: కారులో భార్య ఉంగరం పోయింది.. భర్త దాన్ని ఎలా కనిపెట్టించాడో తెలుసా ?

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

ఎమ్‌జి మోటార్ ప్రీ-ఓన్డ్ కార్ బిజినెస్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్లో తన ఉనికిని పెంచుకునేందుకు కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకొస్తోంది. ఇటీవలే తమ కస్టమర్ల కోసం ఓ విశిష్టమైన సర్వీస్ క్యాంప్‌ని ప్రారంభించిన ఎమ్‌జి మోటార్స్, తాజాగా ప్రీ-ఓన్డ్ కార్ బిజినెస్‌ను ప్రారంభించింది. ఎక్సేంజ్ ద్వారా ఎమ్‌జి కార్లను కొనాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

Most Read Articles

English summary
MG Motor India has introduced a new 'MG Reassure' pre-owned car business in India. The new pre-owned or rather 'pre-loved' car unit as MG Motor like to call it, ensures all its cars receive the best residual value across all dealerships. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X