మీ తల్లిదండ్రులు లేదా పిల్లల కారును ఉచితంగా శానిటైజ్ చేసే 'ఎమ్‌జి-సేవా'

చైనాకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఎమ్‌జి మోటార్ ఇండియా, భారత మార్కెట్లోని కస్టమర్ల కోసం ఓ కొత్త సర్వీస్ క్యాంపైన్‌ని ప్రారంభించింది. ఎమ్‌జి-సేవా పేరుతో ఓ కొత్త రకం పేరెంట్స్ ఫస్ట్ ఇన్షియేటివ్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ క్యాంపైన్‌లో భాగంగా, ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఎమ్‌జి యజమానుల కుటుంబాలు ఉపయోగించే వాహనాలను కంపెనీ ఉచితంగా శానిటైజ్ చేసిస్తుంది.

మీ తల్లిదండ్రులు లేదా పిల్లల కారును ఉచితంగా శానిటైజ్ చేసే 'ఎమ్‌జి-సేవా'

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎమ్‌జి బ్రాండ్ డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ కొత్త ప్రణాళిక అమలులో ఉంటుంది. వాహనం యొక్క తయారీ మరియు మోడల్‌తో సంబంధం లేకుండా ఇంట్లో ఒక కారు వరకు తాము ఉచితంగా శానిటైజ్ చేస్తామని ఎమ్‌జి మోటార్స్ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు ఈ క్యాంపైన్ అమలులో ఉంటుంది.

మీ తల్లిదండ్రులు లేదా పిల్లల కారును ఉచితంగా శానిటైజ్ చేసే 'ఎమ్‌జి-సేవా'

ఈ ప్రక్రియలో భాగంగా.. స్టీరింగ్ వీల్, వైపర్ అండ్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్ స్టాక్స్, డోర్ హ్యాండిల్స్ మరియు లాక్స్, ఎయిర్ కండిషనింగ్ కోసం అన్ని కంట్రోల్ స్విచ్‌లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు విండో ఆపరేషన్స్ వంటి అన్ని టచ్ పాయింట్ ప్రాంతాలను ఉచితంగా శుభ్రపరచి, శానిటైజ్ చేయనున్నారు.

MOST READ: 2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

మీ తల్లిదండ్రులు లేదా పిల్లల కారును ఉచితంగా శానిటైజ్ చేసే 'ఎమ్‌జి-సేవా'

ఎమ్‌జి యజమానులు తమ వాహన కొనుగోలు సమయంలో నమోదు చేసుకున్న ఈ-మెయిల్‌పై కస్టమర్లకు ఓ కోడ్‌ను పంపిస్తారు. సదరు కోడ్ అందుకున్న కస్టమర్లు తమకు సమీపంలో ఉన్న ఏదైనా ఎమ్‌జి డీలర్‌షిప్ వద్దకు వెళ్లి ఆ కోడ్‌ని చూపించి ఈ ఉచిత కార్ శానిటైజేషన్‌ను చేయించుకోవచ్చు. డీలర్ల అందుబాటుని బట్టి కస్టమర్లకు కార్ శానిటైజేషన్ తేదీ మరియు సమయాన్ని కేటాయిస్తారు.

మీ తల్లిదండ్రులు లేదా పిల్లల కారును ఉచితంగా శానిటైజ్ చేసే 'ఎమ్‌జి-సేవా'

ఇక ఎమ్‌జి మోటార్స్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ త్వరలోనే భారత మార్కెట్లో తమ మూడవ మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. జులై 13 కంపెనీ తమ సరికొత్త ఎమ్‌జి హెక్టర్ ప్లస్ సిక్స్ సీటర్ ఎస్‌యూవీని దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కోవిడ్-19 నేపథ్యంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ కారును విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

MOST READ: మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

మీ తల్లిదండ్రులు లేదా పిల్లల కారును ఉచితంగా శానిటైజ్ చేసే 'ఎమ్‌జి-సేవా'

ఎమ్‌జి మోటార్స్ అందిస్తున్న హెక్టర్ ప్లాట్‌ఫామ్‌నే ఈ హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని తయారు చేశారు. ఈ రెండు మోడళ్లలో కూడా ఇంజన్ మరియు గేర్‌బాక్స్ యూనిట్లు ఒకే విధంగా ఉంటాయి. అయితే, కారు మొత్తం కొలతలు, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ ఫీచర్లలో మాత్రం కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి.

మీ తల్లిదండ్రులు లేదా పిల్లల కారును ఉచితంగా శానిటైజ్ చేసే 'ఎమ్‌జి-సేవా'

హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో ఎక్కువ మంది ప్రయాణించేందుకు వీలుగా ఇందులో ఆరు సీట్లను జోడించారు. రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు ఉంటాయి. వెనుక వరుస ప్రయాణీకుల కోసం కూడా ఇందులో పానరోమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. ఇంకా ఇందులో 10.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ మరియు వైఫై కనెక్టివిటీ మరియు బ్రాండ్ యొక్క లేటెస్ట్ ఐస్మార్ట్ కనెక్టెడ్ టెక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ: అకడమిక్ సిలబస్ లో చేరనున్న ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ; ఎక్కడో తెలుసా ?

మీ తల్లిదండ్రులు లేదా పిల్లల కారును ఉచితంగా శానిటైజ్ చేసే 'ఎమ్‌జి-సేవా'

ఎమ్‌జి మోటార్స్ ఇప్పటికే భారత మార్కెట్లో హెక్టర్, జెడ్ఎస్ ఈవి (ఎలక్ట్రిక్ కార్) అనే రెండు మోడళ్లను కూడా విక్రయిస్తోంది. హెక్టర్ ఎస్‌యూవీకి పొడగించడబడిన వెర్షనే ఈ హెక్టర్ ప్లస్. హెక్టర్‌తో పోల్చకుంటే ఇది విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్‌ను కలిగి ఉండి, మరిన్ని అదనపు ఫీచర్లతో వస్తుంది. ఈ రెండు మోడళ్య మద్య వ్యత్యాసాన్ని గుర్తించేందుకు ఎక్స్టీరియర్లలో కూడా చిన్నపాటి మార్పులు చేర్పులు ఉంటాయి. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

మీ తల్లిదండ్రులు లేదా పిల్లల కారును ఉచితంగా శానిటైజ్ చేసే 'ఎమ్‌జి-సేవా'

ఎమ్‌జి మోటార్స్ ప్రారంభించిన ఎమ్‌జి-సేవా క్యాంపైన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత్-చైనాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా దేశంలో చైనా ఉత్పత్తులు, చైనా కంపెనీలపై ఒక రకమైన తిరుగుబాటు మొదలైన పరిస్థితుల్లో భారతీయులకు మరింత చేరువయ్యేందుకు ఈ చైనీస్ కార్ కంపెనీ కొత్త ప్రయోగాలు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇందులో భాగంగానే, ఈ కొత్త స్కీమ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్‌జి కార్లను కలిగి ఉన్న కస్టమర్లు తమ వద్ద ఉన్న సెకండ్ కారు లేదా తమ తల్లిదండ్రులు లేదా పిల్లల కారును ఈ స్కీమ్ క్రింద ఉచితంగా ఎమ్‌జి డీలర్‌షిప్‌ల వద్ద శానిటైజ్ చేయించుకోవచ్చు.

Most Read Articles

English summary
China owned auto-manufacturer, MG Motor India has launched a new MS-SEWA - Parents First initiative in the country. The brand's new initiative will see the company sanitise vehicles that MG owners' families use, for no extra cost. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X