భారత్‌లో దూసుకెళ్తున్న చైనా కార్స్.. అక్టోబర్‌లో అమ్మకాలు అదుర్స్..

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్లో అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. గడచిన అక్టోబర్ నెల అమ్మకాల్లో కంపెనీ గణనీయమైన వృద్ధిని నమోదు చేసినట్లు ఎమ్‌జి మోటార్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ నెల అమ్మకపు గణాంకాలను కంపెనీ విడుదల చేసింది.

భారత్‌లో దూసుకెళ్తున్న చైనా కార్స్.. అక్టోబర్‌లో అమ్మకాలు అదుర్స్..

కంపెనీ విడుదల చేసిన నివేదికల ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ గడచిన అక్టోబర్ 2020 నెలలో 3,750 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. నెలవారీ అమ్మకాల పరంగా ఇది 48 శాతం వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 2020లో కంపెనీ 2,537 యూనిట్లను విక్రయించింది. వార్షిక అమ్మకాల పరంగా చూస్తే ఇది 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. గడచిన అక్టోబర్ 2019లో కంపెనీ అమ్మకాలు 3,536 యూనిట్లుగా నమోదయ్యాయి.

భారత్‌లో దూసుకెళ్తున్న చైనా కార్స్.. అక్టోబర్‌లో అమ్మకాలు అదుర్స్..

మొత్తం అమ్మకపు గణాంకాలలో, 3,625 యూనిట్ల ఎమ్‌జి హెక్టర్ వాహనాలు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ 2020లో ఎస్‌యూవీల అమ్మకాలతో పోలిస్తే ఇది 50 శాతం పెరుగుదలను నమోదు చేసింది, ఆ సమయంలో ఇవి 2,410 యూనిట్లుగా ఉన్నాయి. గడచిన నెలలో ఎమ్‌జి మోటార్స్ మొత్తం 125 యూనిట్ల జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది.

MOST READ:వాహనాల వేగపరిమితిని పెంచడానికి ఆసక్తి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?

భారత్‌లో దూసుకెళ్తున్న చైనా కార్స్.. అక్టోబర్‌లో అమ్మకాలు అదుర్స్..

ఈ విషయం గురించి ఎమ్‌జి మోటార్ ఇండియా సేల్స్ డైరెక్టర్ రాకేశ్ సిదానా మాట్లాడుతూ, "పండుగ డిమాండ్‌తో, మేము గత నెలలో 48 శాతం వృద్ధిని నమోదు చేసాము. నవంబర్‌లో దీపావళి కారణంగా ఈ అమ్మకాల జోరు ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాము. ఈ డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్‌ని కూడా సిద్ధం చేస్తున్నాము. మార్కెట్లో విడుదలైన గ్లోస్టర్ 2,000 బుకింగ్‌లను నమోదు చేసుకొని మంచి విజయాన్ని సాధించింద"ని అన్నారు.

భారత్‌లో దూసుకెళ్తున్న చైనా కార్స్.. అక్టోబర్‌లో అమ్మకాలు అదుర్స్..

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఎమ్‌జి మోటార్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన అతికొద్ద సమయంలోనే ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకుంది. ఈ ఏడాదికి ఇప్పటికే ఫస్ట్ బ్యాచ్ అమ్ముడైపోయినట్లు కంపెనీ పేర్కొంది. గ్లోస్టర్ కోసం ఇప్పటికే 2000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి.

MOST READ:కార్ బోనెట్‌పై పడ్డ పోలీస్.. అలాగే డ్రైవ్స్ చేసిన కార్ డ్రైవర్.. చివరికి ఏం జరిగిందంటే ?

భారత్‌లో దూసుకెళ్తున్న చైనా కార్స్.. అక్టోబర్‌లో అమ్మకాలు అదుర్స్..

మార్కెట్లో ఎమ్‌జి గ్లోస్టర్ ఏడు-సీట్ల కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది. ఇది ఈ విభాగంలో ఫోర్డ్ ఎండీవర్, మహీంద్రా అల్టురాస్ జి4 మరియు టయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ ఎస్‌యూవీని నాలుగు వేరియంట్లలో అందిస్తున్నారు. మార్కెట్లో వీటి ధరలు రూ.28.98 లక్షల ఎక్స్‌షోరూమ్ (ఇండియా) నుండి ప్రారంభమవుతాయి.

భారత్‌లో దూసుకెళ్తున్న చైనా కార్స్.. అక్టోబర్‌లో అమ్మకాలు అదుర్స్..

ఎమ్‌జి మోటార్స్ అక్టోబర్ నెల అమ్మకాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎమ్‌జి మోటార్ ఇండియా, భారత మార్కెట్లో అందిస్తున్న ఉత్పత్తులన్నింటికీ మంచి స్పందన లభిస్తోంది. కంపెనీ అమ్మకాలు ప్రతినెలా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్‌లో కంపెనీ మరింత అధిక సంఖ్యలో అమ్మకాలను నమోదు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

MOST READ:మారుతి సుజుకి బాలెనో టర్బో వేరియంట్ వస్తోంది; ఇదిగో టీజర్..

Most Read Articles

English summary
MG Motor India announced that the company has registered a significant growth in terms of monthly sales in the Indian market. The company has released their sales figures for the month of October 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X