ఎమ్‌జి హెక్టర్ డ్యూయెల్ టోన్ వేరియంట్ విడుదల: కలర్ ఆప్షన్స్, ధర, వివరాలు

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న 'హెక్టర్' మిడ్-సైజ్ ఎస్‌యూవీలో కంపెనీ కొత్తగా డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానున్న హెక్టర్ ఎస్‌యూవీ ధరలు రూ.16.84 లక్షలు, ఎక్స్‌షోరూమ్‌ (ఇండియా) నుంచి ప్రారంభమవుతాయి.

ఎమ్‌జి హెక్టర్ డ్యూయెల్ టోన్ వేరియంట్ విడుదల: కలర్ ఆప్షన్స్, ధర, వివరాలు

కొత్త డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో భాగంగా రెండు కలర్ ఆప్షన్లు లభ్యం కానున్నాయి. అవి: 'గ్లేజ్ రెడ్' మరియు 'కాండీ వైట్'. ప్రస్తుతం హెక్టర్‌లో లభిస్తున్న ఇతర కలర్ ఆప్షన్లకు అదనంగా ఈ రెండు కొత్త కలర్ ఆప్షన్లు కూడా లభ్యం కానున్నాయి. అయితే, ఈ కొత్త డ్యూయెల్ టోన్ పెయింట్ కలర్ ఆప్షన్లు కేవలం టాప్-ఎండ్ (షార్ప్) వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఎమ్‌జి హెక్టర్ డ్యూయెల్ టోన్ వేరియంట్ విడుదల: కలర్ ఆప్షన్స్, ధర, వివరాలు

హెక్టర్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లు రెండింటిలోనూ ఈ కొత్త డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లు లభిస్తాయి. ఇందులో రూఫ్ మొత్తాన్ని నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటుంది. మిగిలిన బాడీలో ఎక్కువ భాగం తెలుపు లేదా ఎరుపు రంగులో (కస్టమర్ ఎంచుకునే కలర్‌ను బట్టి) ఫినిష్ చేయబడి ఉంటుంది.

MOST READ:రోడ్ రోలర్‌గా మారిన టివిఎస్ బైక్ [వీడియో]

ఎమ్‌జి హెక్టర్ డ్యూయెల్ టోన్ వేరియంట్ విడుదల: కలర్ ఆప్షన్స్, ధర, వివరాలు

అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీలోని అన్ని పిల్లర్స్ (ఏ, బి, సి, డి) మరియు సైడ్ మిర్సర్స్ కూడా నలుపు రంగులో ఫనిషింగ్ చేయబడి ఎస్‌యూవీ స్పోర్టీ లుక్‌ని మరింత పెంచడంలో సహకరిస్తాయి. అయితే, ఈ డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ స్టాండర్డ్ పెయింట్ స్కీమ్ కంటే రూ.20,000 ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. ఈ కొత్త వేరియంట్లలో కొత్త పెయింట్ స్కీమ్ మినహా వేరే ఈ ఇతర మార్పులు లేవు.

Variant Price
1.5 Petrol-Hybrid ₹16.84 Lakh
1.5 Petrol DCT ₹17.75 Lakh
1.5 Diesel MT ₹18.08 Lakh
ఎమ్‌జి హెక్టర్ డ్యూయెల్ టోన్ వేరియంట్ విడుదల: కలర్ ఆప్షన్స్, ధర, వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తంది. ఇందులో 143 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 173 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.

MOST READ:షోరూమ్ కండిషన్‌లో సుజుకి సమురాయ్.. ఇది ఎన్ని సంవత్సరాల బైక్ అని ఆశ్చర్యపోతున్నారా..!

ఎమ్‌జి హెక్టర్ డ్యూయెల్ టోన్ వేరియంట్ విడుదల: కలర్ ఆప్షన్స్, ధర, వివరాలు

ఇందులోని పెట్రోల్ ఇంజన్‌ను 48వి మైల్డ్-హైబ్రిడ్ యూనిట్‌తో కూడా లభిస్తుంది మరియు ఇది ఎక్కువ మైలేజీని ఇస్తుంది. హెక్టర్‌లోని అన్ని ఇంజన్ ఆప్షన్లు కూడా స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ మాత్రం ఆప్షనల్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో లభిస్తుంది.

ఎమ్‌జి హెక్టర్ డ్యూయెల్ టోన్ వేరియంట్ విడుదల: కలర్ ఆప్షన్స్, ధర, వివరాలు

ఎమ్‌జి హెక్టర్ డ్యాష్‌బోర్డ్‌లో నిలువుగా అమర్చిన 10.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది, ఇది బ్రాండ్ యొక్క లేటెస్ట్ 'ఐ-స్మార్ట్' ఇంటర్నెట్ కనెక్టివిటీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ సాయంతో వాహన యజమానులు స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా తమ ఎస్‌యూవీలోని వివిధ అంశాలను కంట్రోల్ చేయవచ్చు. ఇందులో ఏసి, సన్‌రూఫ్, టెయిల్‌గేట్ మరియు డోర్ ఆపరేషన్ మొదలైన స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ; ధర & ఇతర వివరాలు

ఎమ్‌జి హెక్టర్ డ్యూయెల్ టోన్ వేరియంట్ విడుదల: కలర్ ఆప్షన్స్, ధర, వివరాలు

హెక్టర్ ఎస్‌యూవీ దేశంలోనే మొట్టమొదటి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత వాహనం. ఈ ఎస్‌యూవీని కంట్రోల్ చేయటానికి యజమానులు ఆన్‌బోర్డ్ వాయిస్ అసిస్టెంట్‌తో మాట్లాడవచ్చు, ఇందులో 100కి పైగా వాయిస్ కమాండ్స్ ఉంటాయి. హెక్టర్ ఎస్‌యూవీలో జియో-ఫెన్సింగ్, ఎమర్జెన్సీ కాల్ అసిస్టెన్స్, జనరల్ అసిస్టెన్స్ కోసం కోసం కాల్ సెంటర్‌ను సంప్రదించడానికి ఒక నిర్దేశిత బటన్ మరియు ప్రీలోడ్ చేయబడిన ప్రీమియం గానా అకౌంట్ మొదలైనవి ఉన్నాయి.

ఎమ్‌జి హెక్టర్ డ్యూయెల్ టోన్ వేరియంట్ విడుదల: కలర్ ఆప్షన్స్, ధర, వివరాలు

ఇక ఎస్‌యూవీలోని సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టిసిఎస్), 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఏబిఎస్ విత్ ఈబిడి మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఎమ్‌జి హెక్టర్ డ్యూయెల్ టోన్ వేరియంట్ విడుదల: కలర్ ఆప్షన్స్, ధర, వివరాలు

హెక్టర్ ఎస్‌యూవీ డ్యూయెల్ టోన్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత పండుగ సీజన్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎమ్‌జి మోటార్స్ తమ పాపులర్ హెక్టర్ మోడల్‌లో కొత్తగా డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌ను పరిచయం చేసింది. బ్లాక్ అండ్ బాడీ కలర్ పెయింట్ స్కీమ్‌లో ఉన్న కొత్త హెక్టర్ ఎస్‌యూవీ ఇప్పుడు మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. ఇది ఈ విభాగంలో జీప్ కంపాస్ మోడల్‌కు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
MG Motors India has launched the Hector dual-tone paint scheme in the Indian market. Prices for the SUV start at Rs 16.84 lakh, ex-showroom (India). The company is offering the new dual-tone paint scheme in two colour options. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X