అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'ఎమ్‌జి మోటార్స్' నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ 'ఎమ్‌జి గ్లోస్టర్'ను అక్టోబర్ 8వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఎమ్‌జి గ్లోస్టర్ సూపర్, షార్ప్, స్మార్ట్ మరియు శావి అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.

అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్‌జి డీలర్‌షిప్ కేంద్రాలు ఇప్పటికే ఈ ఎస్‌యూవీని రూ.1 లక్ష టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ అంగీకరిస్తున్నారు. ఈ ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో బ్రాండ్ వెబ్‌సైట్‌లో లేదా భారతదేశంలో ఏదైనా అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. గ్లోస్టర్ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో (అగేట్ రెడ్, మెటల్ బ్లాక్, మెటల్ యాష్ మరియు వార్మ్ వైట్) లభిస్తుంది.

అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఎమ్‌జి గ్లోస్టర్ ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది మరియు ఇది బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంటుంది. మార్కెట్లో అధికారికంగా విడుదల కావటానికి ముందే మేము గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీని టెస్ట్ డ్రైవ్ చేశాము. - మా టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఎమ్‌జి మోటార్స్ ఇటీవలే గ్లోస్టర్‌కు సంబంధించి ఓ టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది, ఇందులో గ్లోస్టర్ యొక్క హై-ఎండ్ డ్రైవర్-అసిస్టెడ్ లెవల్ 1 అటానమస్ సిస్టమ్‌ను హైలైట్ చేసింది. ఈ టీజర్ వీడియోలో, డ్రైవర్ చాలా తక్కువ ప్రయత్నంతో ఆటో పార్క్ అసిస్ట్‌ను ఉపయోగించి పెద్ద గ్లోస్టర్ ఎస్‌యూవీని విజయవంతంగా పార్క్ చేయటాన్ని చూడొచ్చు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

అటానమస్ డ్రైవర్ అసిస్టెడ్ సిస్టమ్‌లో భాగమైన ఇతర ఫీచర్లలో ఆటో పార్క్ అసిస్ట్, ఆటో బ్రేకింగ్, కొల్లైజన అవైడెన్స్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ బ్రాండ్ యొక్క అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడిఏఎస్) టెక్నాలజీలో భాగంగా ఉంటాయి.

MOST READ: ట్రక్ దొంగలించిన కొంత సమయానికే పట్టుబడ్డ దొంగల ముఠా.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా ?

అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఎమ్‌జి మోటార్స్ తమ గ్లోస్టర్‌ను మార్కెట్లో విడుదల చేయటానికి ముందే ఇందులో అన్ని కీలక ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. ఈ ఎస్‌యూవీలో క్రోమ్‌లో ఫనిష్ చేసిన పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడి హెడ్‌లైట్లు, ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్, కారులోకి సులువుగా ప్రవేశించేందుకు మరియు నిష్క్రమించేందుకు వీలుగా సైడ్‌స్టెప్, రూఫ్ రైల్స్ మరియు బూట్ లిడ్‌పై పెద్ద అక్షరాలతో హైలైట్ చేసిన ‘గ్లోస్టర్' బ్యాడ్జ్ మొదలైనవి ఉంటాయి.

అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 216 బిహెచ్‌పి శక్తిని మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది జెడ్ఎఫ్ నుండి గ్రహించిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ: యంగ్ కార్ట్ రేసర్‌పై జీవితకాల నిషేధం.. ఎందుకో తెలుసా ?

అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇకపోతే, ఇందులో సింగిల్ టర్బో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంటుంది ఈ ఇంజన్ గరిష్టంగా 162 బిహెచ్‌పి శక్తిని మరియు 375 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా పైన పేర్కొన్న గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది.

అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ట్విన్-టర్బో ఇంజన్ ఆన్-డిమాండ్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటు బ్రాండ్ యొక్క టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ మరియు మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్‌లను కూడా కలిగి ఉంది.

MOST READ: మీకు తెలుసా.. ఈ బస్సులకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదు

అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

గ్లోస్టర్ ఎస్‌యూవీ ముందు వీల్ ఆర్చెస్ వెనుక ఉంచిన బ్రిట్ డైనమిక్స్ బ్యాడ్జ్ ఉంటుంది. బ్రిట్ డైనమిక్ అనేది ఎమ్‌జి బ్రాండ్ యొక్క ప్రత్యేకమైన ప్రమాణాల సమూహం, ఇది వాహనం యొక్క బ్రిటిష్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది వాహనం యొక్క వివిధ అంశాలను నాలుగు విభాగాలుగా వర్గీకరిస్తుంది. అవి: పెర్ఫార్మెన్స్, హ్యాండ్లింగ్, డిజైన్ మరియు సేఫ్టీ.

అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

బ్రిట్ డైనమిక్ బ్యాడ్జ్ ఉన్న వాహనాలు టర్బోచార్జ్డ్ ఇంజన్లను కలిగి ఉంటాయి మరియు ఇందులో రెండు చివర్లలో స్టెబిలైజర్ బార్స్ ఉండి అత్యుత్తమ హ్యాండ్లింగ్‌ను అందిస్తాయి. ఈబిడితో కూడిన ఏబిఎస్, కర్వ్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో బాడీని ఏరోడైనమిక్‌గా ఉంచడానికి కూడా బ్రిట్ డైనమిక్ సహకరిస్తుంది.

MOST READ: రోల్స్ రాయిస్ నుంచి రానున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ విమానం ఇదే.. చూసారా !

అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, భారత మార్కెట్లో కొత్త 2020 ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా వేసింది. ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ఇది మహీంద్రా అల్టురాస్ జి4, టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల తేదీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎమ్‌జి మోటార్స్ తమ గ్లోస్టర్ ఎస్‌యూవీని సెగ్మెంట్-ఫస్ట్ మరియు బెస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లతో అందిస్తోంది. అత్యంత ఖరీదైన కార్లలో లభించే విలాసవంతమైన ఫీచర్లు ఈ కారులో లభ్యం కానున్నాయి. ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో వస్తున్న ఎమ్‌జి గ్లోస్టర్ ఈ ఏడాది పండుగ సీజన్‌లో కంపెనీకి ప్రోత్సాహకర అమ్మకాలను తెచ్చిపెట్టగలదని అంచనా.

Most Read Articles

English summary
MG Motor India has announced that it will be launching the Gloster premium-SUV on October 8, 2020, in the Indian market. The company will be offering the Gloster in four variants and will reveal the prices at the time of its launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X