ఎమ్‌జి గ్లోస్టర్ కొనుగోలుదారుల కోసం 'మై ఎమ్‌జి షీల్డ్' ప్రత్యేక స్కీమ్

చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్లో తమ నాల్గవ ఉత్పత్తిగా 'ఎమ్‌జి గ్లోస్టర్' ప్రీమియం ఎస్‌యూవీని ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్ నాటికి విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా, కంపెనీ తమ భవిష్యత్ ఎమ్‌జి గ్లోస్టర్ కస్టమర్ల కోసం ఓ ప్రత్యేకమైన ఓనర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది.

ఎమ్‌జి గ్లోస్టర్ కొనుగోలుదారుల కోసం 'మై ఎమ్‌జి షీల్డ్' ప్రత్యేక స్కీమ్

కస్టమర్లకు ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ యజామాన్యాన్ని మరింత సులభతరం చేసేందుకు గాను "మై ఎమ్‌జి షీల్డ్" పేరిట కంపెనీ భారతదేశపు మొట్టమొదటి వ్యక్తిగతీకరించిన కార్ యాజమాన్య కార్యక్రమం (పర్సనలైజ్డ్ కార్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్)ను ప్రవేశపెట్టింది. ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న మొట్టమొదటి లెవల్-1 అటానమస్ ఎస్‌యూవీ అవుతుంది.

ఎమ్‌జి గ్లోస్టర్ కొనుగోలుదారుల కోసం 'మై ఎమ్‌జి షీల్డ్' ప్రత్యేక స్కీమ్

మై ఎమ్‌జి షీల్డ్ ప్రోగ్రామ్ ద్వారా గ్లోస్టర్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు యాజమాన్య కాలం, కవర్ చేసిన కిలోమీటర్లు మరియు ఇతర ప్రాధాన్యతల ఆధారంగా వారికి సౌకర్యవంతమైన ఆఫ్టర్-సేల్స్ సేవలను అందింస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో వారంటీలో 200 కాంబినేషన్స్, రోడ్-సైడ్ అసిస్టెన్స్ (ఆర్‌ఎస్‌ఏ), మెయింటినెన్స్, రెసిడ్యూయల్ వ్యాల్యూ అశ్శూరెన్స్, యాక్ససరీస్, మర్చెండైస్ మొదలైనవి ఉంటాయి.

MOST READ:పరుగులు పెడుతున్న మహీంద్రా థార్ బుకింగ్స్.. ఇప్పటికే దీని బుకింగ్స్ ఎంతంటే ?

ఎమ్‌జి గ్లోస్టర్ కొనుగోలుదారుల కోసం 'మై ఎమ్‌జి షీల్డ్' ప్రత్యేక స్కీమ్

ఎమ్‌జి గ్లోస్టర్ స్టాండర్డ్ 3+3+3 ప్యాకేజీతో లభిస్తుంది. అంటే ఈ ప్యాకేజీలో మూడు సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీ, మూడు సంవత్సరాలు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు మూడు లేబర్-చార్జీ రహిత సర్వీస్‌లు లభిస్తాయి. అంతేకాకుండా, మై ఎమ్‌జి షీల్డ్ ప్యాకేజీ సాయంతో కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణంగా వారి యాజమాన్య ప్యాకేజ్‌ను మరింత పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఎమ్‌జి గ్లోస్టర్ కొనుగోలుదారుల కోసం 'మై ఎమ్‌జి షీల్డ్' ప్రత్యేక స్కీమ్

ఈ ప్యాకేజీలో కంపెనీ మరో మొదటి రకమైన ప్యాకేజీని కూడా అందిస్తోంది, ఇక్కడ గ్లోస్టర్ కస్టమర్లకు రూ.50,000లు విలువైన కస్టమైజేషన్ ఆప్షన్లు ఉంటాయి. వినియోగదారుల తాము ఎంపిక చేసిన కస్టమైజేషన్ల మొత్తం, పై మొత్తాన్ని మించినట్లయితే, మిగిలిన మొత్తాన్ని వారు కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది.

MOST READ:మాజీ ముఖ్యమంత్రిని ఫిదా చేసిన మహీంద్రా థార్.. ఇంతకీ ఎవరా CM తెలుసా?

ఎమ్‌జి గ్లోస్టర్ కొనుగోలుదారుల కోసం 'మై ఎమ్‌జి షీల్డ్' ప్రత్యేక స్కీమ్

అయితే, రూ.50,000 కస్టమైజేషన్ మొత్తాన్ని నగదు తగ్గింపు కోసం రెడీమ్ చేయలేమని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్‌జి డీలర్‌షిప్ కేంద్రాలు ఇప్పటికే ఈ ఎస్‌యూవీని రూ.1 లక్ష టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ అంగీకరిస్తున్నారు. గ్లోస్టర్ సూపర్, షార్ప్, స్మార్ట్ మరియు టాప్-ఎండ్ శావి అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.

ఎమ్‌జి గ్లోస్టర్ కొనుగోలుదారుల కోసం 'మై ఎమ్‌జి షీల్డ్' ప్రత్యేక స్కీమ్

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలోని ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 216 బిహెచ్‌పి శక్తిని మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇకపోతే, ఇందులో సింగిల్ టర్బో వేరియంట్‌ను కూడా అందుబాటులో ఉంటుంది, ఇది 162 బిహెచ్‌పి శక్తిని మరియు 375 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా పైన పేర్కొన్న గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. ఈ బస్సులకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదు

ఎమ్‌జి గ్లోస్టర్ కొనుగోలుదారుల కోసం 'మై ఎమ్‌జి షీల్డ్' ప్రత్యేక స్కీమ్

మై ఎమ్‌జి షీల్డ్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవం గురించి ఎమ్‌జి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ, "ఎమ్‌జి బ్రాండ్ వద్ద, ప్రతి ఒక్కరూ తమ కారుకు వేర్వేరు అవసరాలు ఉంటాయని మేము అర్థం చేసుకున్నాము. ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చినదే ఈ మై ఎమ్‌జి షీల్డ్ ప్రోగ్రామ్. దీని సాయంతో కస్టమర్‌లు వారి ప్రాధాన్యతలను బట్టి ఆఫ్టర్ సేల్స్ సేవలను ఎన్నుకోవడంలో సహాయపడే వ్యక్తిగతీకరించిన మరియు సౌకర్యవంతమైన యాజమాన్య ప్యాకేజీని వారు ఎంచుకోవచ్చు. ఇందులో 200కి పైగా ఆప్షన్లు ఉన్నాయని" అన్నారు.

ఎమ్‌జి గ్లోస్టర్ కొనుగోలుదారుల కోసం 'మై ఎమ్‌జి షీల్డ్' ప్రత్యేక స్కీమ్

ఎమ్‌జి మై షీల్డ్ ప్యాకేజీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మై ఎమ్‌జి షీల్డ్ ప్యాకేజీ ద్వారా, వినియోగదారులు ఎమ్‌జి గ్లోస్టర్ కొనుగోలు చేయడం ద్వారా చాలా ప్రయోజనాలను పొందగలుగుతారు. ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ఇది మహీంద్రా అల్టురాస్ జి4, టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:మహీంద్రా లాంచ్ చేసిన 210 అనివెర్సరీ స్పెషల్ ఎడిషన్ : ప్యూజో 125 స్కూటర్

Most Read Articles

English summary
MG Motor is expected to launch its fourth offering, the Gloster SUV, in the Indian Market around the festival of Diwali this year. However, the company has introduced the 'MY MG SHIELD', which is India's first personalized car ownership program for the Gloster SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X