ఎంజీ మార్వెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: 40 నిమిషాల్లో 80% ఛార్జింగ్

ఎంజీ మోటార్ గత ఏడాది ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. హెక్టార్ ఎస్‌యూవీతో ప్రయాణాన్ని ప్రారంభించి, అనతి కాలంలో రెండో మోడల్ జడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేసి, భారతీయుల మన్ననలు పొందింది. ఈ ప్రయాణానికి కొనసాగింపుగా అతి త్వరలో ప్రారంభంకాబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో దేశీయ మార్కెట్ కోసం పలు కొత్త మోడళ్లను ఆవిష్కరించేందుకు సిద్దమవుతోంది. అందులో మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒకటి.

ఎంజీ మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్ గురించి మరిన్ని విశేషాలు ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి..

ఎంజీ మార్వెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: 40 నిమిషాల్లో 80% ఛార్జింగ్

చైనా కంపెనీ SAIC సొంతం చేసుకున్న బ్రిటన్ ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియన్ మార్కెట్ కోసం ఏకంగా 14 కొత్త కార్లను ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనుంది. అందులో ఎంజీ మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్ సందడి చేయనుంది. ఇప్పటికే దీనికి సంభందించిన ఫోటోలు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఎంజీ మార్వెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: 40 నిమిషాల్లో 80% ఛార్జింగ్

మార్వెల్ ఎక్స్ ఎస్‌యూవీని కంప్లీట్‌గా న్యూ రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్‌లో తెసుకొస్తుందో తెలీదు కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ సామ్రాజ్యంలో తన బలాన్ని నిరూపించుకునేందుకు ఎలక్ట్రిక్ పవర్‍‌ట్రైన్‌‌తో దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఎంజీ మార్వెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: 40 నిమిషాల్లో 80% ఛార్జింగ్

మార్వెల్ ఎక్స్ కారును 2017లో జరిగిన షాంఘై మోటార్ షోలో రోయ్ విజన్ ఇ-కాన్సెప్ట్ పేరుతో తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ ప్యూర్ ఎలక్ట్రిక్ కారులో 52.5kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ కలదు. కేవలం 40 నిమిషాల్లోనే 80శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది, ఈ కారుకు ఇదే ప్రధాన హైలెట్.

ఎంజీ మార్వెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: 40 నిమిషాల్లో 80% ఛార్జింగ్

చైనా మార్కెట్లో మార్వెల్ ఎక్స్ కారు రెండు వెర్షన్‌లలో లభ్యమవుతోంది. అయితే, ఇండియన్ మార్కెట్ కోసం ఏ వెర్షన్ తీసుకొస్తారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. బహుశా.. 185పీఎస్ పవర్ మరియు 410ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే రియర్ వీల్ డ్రైవ్ వెర్షన్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఎంజీ మార్వెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: 40 నిమిషాల్లో 80% ఛార్జింగ్

మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్ 301పీఎస్ పవర్ మరియు 665ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే పవర్‌ఫుల్ ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్ రాకపోవచ్చు. అయితే, రెండు వేరియంట్లలో కూడా ఒకే తరహా బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్ ఉంది.

ఎంజీ మార్వెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: 40 నిమిషాల్లో 80% ఛార్జింగ్

మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్ కారులో ప్రయాణికుల భద్రతకు కూడా పెద్దపీఠ వేశారు. ఇందులో ఇంటెలిజంట్ పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ యాక్సిడెంట్ అలారమ్, రియల్-లైఫ్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్ ఇంకా ఎన్నో బేసిక్ సేఫ్టీ ఫీచర్లు వచ్చాయి.

ఎంజీ మార్వెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: 40 నిమిషాల్లో 80% ఛార్జింగ్

అంతర్జాతీయంగా కార్ల భద్రతను పరీక్షించే గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టుల్లో ఎంజీ మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్ 5-స్టార్ రేటింగ్ కూడా పొందింది. ఎలక్ట్రానిక్ వ్యవస్థలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా 6 హై వోల్టోజ్ సర్క్యూట్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం, IP67 వాటర్‌ఫ్రూఫ్ బ్యాటరీ వంటివి దీని సొంతం.

ఎంజీ మార్వెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: 40 నిమిషాల్లో 80% ఛార్జింగ్

ధరల విషయానికి వస్తే, ఎంజీ మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్ భారీ ధరలో వచ్చే అవకాశం ఉంది. ఇదే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్‌తో పాటు టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి పోటీనిచ్చేలా ఎంజీ మ్యాక్సస్ డీ90 మరియు ఎర్టిగాకు పోటీగా ఎంజీ హెక్టార్ 6-సీటర్ కార్లను కూడా ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.

Source: ICN

Most Read Articles

English summary
MG Will Debut Marvel X Electric SUV In India at 2020 Auto expo. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X