ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీ ప్రారంభం

ఎంజీ మోటార్ ఇండియా జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థకు తొలి జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని డెలివరీ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీ ప్రారంభం

క్లీన్ అండ్ గ్రీన్ రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్ మరియు డీజల్‌తో నడిచే కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే కొనుగోలు చేస్తోంది. 2030 నాటికి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీ ప్రారంభం

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికల్‌లో 44.5 kWh కెపాసిటీ గల లిథియం-అయాన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్‌కు విద్యుత్ సరఫరా చేస్తుంది. ఇది 141బిహెచ్‌పి పవర్ మరియు 353ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పటి వరకూ ఇండియాలో లభించే ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక బ్యాటరీ కెపాసిటీ గల మోడల్ కూడా ఇదే.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీ ప్రారంభం

ఈ ఎలక్ట్రిక్ కార్‌లో ఫాస్ట్-ఛార్జింగ్ టెక్నాలజీ కలదు, కేవలం గంట వ్యవధిలోనే బ్యాటరీ 80శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు సింగల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 340కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీ ప్రారంభం

ఎంజీ జడ్ఎస్ ప్రస్తుతం రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. జడ్ఎస్ ఎలక్ట్రిక్‌లోని ఎక్సైట్ వేరియంట్లో 17-ఇంచుల అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న సైడ్ మిర్రర్లు, లెథర్ ఫినిషింగ్ గల స్టీరింగ్ వీల్, అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కైనటిక్ ఎనర్జీ రికవరీ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీ ప్రారంభం

ఈ వేరియంట్లో సేఫ్టీ పరంగా ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు వచ్చాయి.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీ ప్రారంభం

ఎంజీ జడ్ఎస్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్లో 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పానొరమిక్ సన్‌రూఫ్, 6-దిశలలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఎలక్ట్రానిక్ డ్రైవర్ సీట్, ఐ-స్మార్ట్ 2.0-కనెక్టెడ్ టెక్నాలజీ, హీటెడ్ సైడ్ మిర్రర్స్ మరియు ఎయిర్ ఫ్యూరిఫైయర్‌తో పాటు ఎక్సైట్ వేరియంట్లో ఉండే అన్ని ఫీచర్లు ఇందులో వచ్చాయి.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీ ప్రారంభం

ఎంజీ జడ్ఎస్ ఎక్సైట్ వేరియంట్ ధర రూ. 20.88 లక్షలు మరియు ఎంజీ జడ్ఎస్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ. 23.58 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ముంబాయ్, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ మరియు ఢిల్లీ-కేంద్ర రాజధాని పరిధిలో మాత్రమే లభిస్తోంది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీ ప్రారంభం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియా ఫ్యూచర్ రవాణా వ్యవస్థను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంజీ మోటార్ సంస్థకు డ్రైవ్‌స్పార్క్ తరపున శుభాకాంక్షలు. విపరీతమైన గాలి కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వివిధ నగరాలను క్లీన్‌ అండ్ గ్రీన్‌గా మార్చే ఉద్దేశ్యంతో పెట్రోల్, డీజల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తోంది. అందులో భాగంగానే తొలి ఎలక్ట్రిక్ ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ కారును పూర్తి స్థాయిలో మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీటి డెలివరీలను కూడా ప్రారంభించారు. ఈ మోడల్ ఇప్పుడు కస్టమర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
MG ZS Electric SUV Deliveries Begin: First Vehicle Delivered To EESL. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X