టెస్టింగ్ దశలో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ - స్పై పిక్స్, డీటేల్స్

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్లో తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని శరవేగంగా విస్తరించుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ను దేశీయ విపణిలో మూడు ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. గ్లోస్టర్ అని పిలువబడే నాల్గవ మోడల్‌ను ఎమ్‌జి మోటార్స్ భారత్‌కు పరిచయం చేయటానికి సన్నద్ధమవుతోంది.

టెస్టింగ్ దశలో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ - స్పై పిక్స్, డీటేల్స్

కాగా, తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ భారత్ కోసం ఓ ఐదవ మోడల్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఐదవ మోడల్ కూడా ఎస్‌యూవీనే కావటం. ఇది పెట్రోల్‌తో జిఎస్ (ZS) మోడల్ కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పడి ఈ మోడల్‌ను కంపెనీ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది.

టెస్టింగ్ దశలో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ - స్పై పిక్స్, డీటేల్స్

మోటార్‌బీమ్ లీక్ చేసిన చిత్రాల ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ భారతదేశంలో జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ టెస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడిన టెస్టింగ్ వాహనాన్ని గుజరాత్ నెంబర్ ప్లేట్‌తో కంపెనీ పరీక్షిస్తోంది. వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా ఇది భారత మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.

MOST READ: భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

టెస్టింగ్ దశలో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ - స్పై పిక్స్, డీటేల్స్

ఇంతకుముందు లీకైన డాక్యుమెంట్ ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ దేశంలో జిఎస్ మోడల్‌ను పెట్రోల్ మరియు హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లతో పరిచయం చేసే అకాశం ఉందని వెల్లడించింది. ఈ ఎస్‌యూవీ ఇప్పటికే వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో విభిన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అమ్ముడవుతోంది.

టెస్టింగ్ దశలో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ - స్పై పిక్స్, డీటేల్స్

ఇందులో 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ఒకటి. ఈ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి శక్తిని మరియు 141 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే రెండవది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్, ఇది గరిష్టంగా 109.4 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: 2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్ లీక్; ఆగస్ట్ 15న విడుదల

టెస్టింగ్ దశలో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ - స్పై పిక్స్, డీటేల్స్

ఈ రెండు ఇంజన్లు ఇప్పటికే యూరో- VI ప్రమాణాలను పాటిస్తున్నాయి. ఇవి మనదేశంలో బిఎస్6 నిబంధనలకు సమానమైన ఉద్గార ప్రమాణం. దీన్ని బట్టి చూస్తుంటే, ఎమ్‌జి మోటార్స్ ఈ రెండు ఇంజన్ ఆప్షన్లను భారత మార్కెట్లో విడుదల చేయటానికి లైన్ క్లియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

టెస్టింగ్ దశలో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ - స్పై పిక్స్, డీటేల్స్

గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికొస్తే, సాంప్రదాయ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే గ్లోబల్-స్పెక్ మోడల్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ మాత్రం సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. భారత మార్కెట్లో విడుదలయ్యే మోడల్‌లో కూడా ఇదే రకమైన గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండొచ్చని అంచనా.

MOST READ: స్పాట్ టెస్ట్ లో కెమెరాకి చిక్కిన కియా సోనెట్

టెస్టింగ్ దశలో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ - స్పై పిక్స్, డీటేల్స్

ఎమ్‌జి జిఎస్ కారు కొత్త ఇంజన్ ఆప్షన్లతో పాటుగా చూడటానికి ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న జిఎస్ ఈవి ఎలక్ట్రిక్-ఎస్‌యూవీ మాదిరిగానే డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. జిఎస్ ఎస్‌యూవీ 4314 మిమీ పొడవు, 1890 మిమీ వెడల్పు మరియు 1611 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ జిఎస్ వీల్‌బేస్ 2589 మిమీ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్ జిఎస్ వీల్‌బేస్ 2580 మిమీ గాను ఉంటుంది.

టెస్టింగ్ దశలో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ - స్పై పిక్స్, డీటేల్స్

జిఎస్ ఎస్‌యూవీ గ్లోబల్ స్పెక్ మోడల్‌లో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ మరియు ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్‌లతో కూడిన బ్రాండ్ యొక్క సిగ్నేచర్ హనీకోంబ్ గ్రిల్‌ను కలిగి ఉంటాయి. రెండు చివర్లలో ఉంచిన అల్యూమినియం స్కిడ్ ప్లేట్‌లతో వ్రాప్ చేయబడిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, 17 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

MOST READ: ఇది చూసారా.. ఆడి కార్ గుర్రపు బండిగా మారింది, ఎందుకో తెలుసా

టెస్టింగ్ దశలో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ - స్పై పిక్స్, డీటేల్స్

ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, గ్లోబల్ వెర్షన్ ఎస్‌యూవీలో క్యాబిన్‌కు మరింత ప్రీమియం రూపాన్ని మరియు అనుభూతిని అందించే అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క తాజా ఐస్‌మార్ట్ కనెక్ట్ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉంటుంది.

టెస్టింగ్ దశలో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ - స్పై పిక్స్, డీటేల్స్

గ్లోబల్-స్పెక్ మోడళ్లను ఎమ్‌జి బ్రాండ్ పైలట్ డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్‌తో అందిస్తున్నారు, ఇందులో యాక్టివ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి అధునాతన సాంకేతిక మరియు భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఈ ఫీచర్లు ఇండియన్ వెర్షన్ జిఎస్‌లో ఉంటాయో లేదో చూడాలి.

MOST READ: అమ్మకానికి ఉన్న విరాట్ కోహ్లీ కార్ ; దీని రేటెంతో తెలుసా !

టెస్టింగ్ దశలో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ - స్పై పిక్స్, డీటేల్స్

ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో ఎస్‌యూవీలకి పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని, ఈ విభాగంలోని అవకాశాలను దక్కించుకోవాలని ఎమ్‌జి మోటార్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్‌జి జిఎస్ భారత విపణిలో విడుదలైతే ఈ విభాగంలో, హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Image Courtesy:Motorbeam

Most Read Articles

English summary
MG Motor currently sells three SUVs in the Indian market. However, it is gearing up to introduce the fourth SUV called the Gloster. According to recent reports, their fifth model in India could also be an SUV. Read in Telugu.
Story first published: Saturday, August 8, 2020, 18:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X