హెక్టర్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్న ఎమ్‌జి మోటార్స్!

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆధారంగా కంపెనీ ఓ పెట్రోల్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది.

హెక్టర్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్న ఎమ్‌జి మోటార్స్!

తాజాగా, బెంగుళూరు నగర వీధుల్లో ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీని టెస్టింగ్ చేస్తుండగా, ఓ నెటిజెన్ తన కెమెరాలో బంధించారు. ఇప్పుడు ఈ మోడల్‌కి సంబంధించిన కొత్త స్పై చిత్రాలు మరియు మరిన్ని కొత్త వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

హెక్టర్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్న ఎమ్‌జి మోటార్స్!

సచిన్ దేవ్ లీక్ చేసిన స్పై చిత్రాల ప్రకారం, పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడిన ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీని తాత్కాలిక నెంబర్ ప్లేట్‌తో బెంగుళూరు రోడ్లపై టెస్ట్ చేస్తుండటాన్ని గమనించవచ్చు. ఇందులో ఎస్‌యూవీ కుడివైపు ఉన్న గుండ్రగా ఉన్న ఫ్యూయెల్ క్యాప్‌ని గమనిస్తే, ఇది ఖఛ్చితంగా పెట్రోల్ వెర్షన్ అని తెలుస్తోంది.

MOST READ:మోడీ ప్రారంభించిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

హెక్టర్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్న ఎమ్‌జి మోటార్స్!

ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఈ ఫ్యూయెల్ క్యాప్ ఉండదు. దాని ఫ్రంట్ గ్రిల్‌లో చార్జింగ్ స్లాట్ ఉంటుంది. కాగా, పెట్రోల్ వెర్షన్ ఎమ్‌జి జిఎస్ స్పై చిత్రాల్లో వెనుక వైపు బూట్ డోర్‌పై గుండ్రటి ఎమ్‌జి బ్యాడ్జింగ్ మరియు స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ డిజైన్‌ను గమనించవచ్చు.

హెక్టర్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్న ఎమ్‌జి మోటార్స్!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీని దేశంలోని మాస్-మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల చేయానిల కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఎమ్‌జి హెక్టర్ మోడల్‌కు దిగువన దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఫలితంగా, ఇది హెక్టర్ కన్నా తక్కువ ధరకే లభ్యం కానుంది.

MOST READ:టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసిన కేరళ ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ?

హెక్టర్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్న ఎమ్‌జి మోటార్స్!

మోరిస్ గ్యారేజ్ (ఎమ్‌జి) ఇండియా, తమ పెట్రోల్ వెర్షన్ ఎమ్‌జి జిఎస్ ఎస్‌యూవీని తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నాటికి ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎమ్‌జి మోటార్స్‌కి ఈ కొత్త మోడల్ భారత్‌లో ఐదవ ఉత్పత్తి కానుంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ దేశీయ మార్కెట్లో హెక్టర్, హెక్టర్ ప్లస్, జిఎస్ ఎలక్ట్రిక్ మరియు గ్లోస్టర్ ఎస్‌యూవీలను విక్రయిస్తోంది.

హెక్టర్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్న ఎమ్‌జి మోటార్స్!

ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తోంది. ఈ ఇంటర్నేషనల్ మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. భారత్‌లో కూడా ఇవే ఇంజన్ ఆప్షన్లను కొనసాగించవచ్చని సమాచారం.

MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

హెక్టర్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్న ఎమ్‌జి మోటార్స్!

ఇంటర్నేషనల్ స్పెక్ జిఎస్ వెర్షన్‌లోని 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి శక్తిని మరియు 141 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే ఇందులోని 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 109.4 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 48 వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

హెక్టర్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్న ఎమ్‌జి మోటార్స్!

గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికొస్తే, సాంప్రదాయ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే గ్లోబల్-స్పెక్ మోడల్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ మాత్రం సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. భారత మార్కెట్లో విడుదలయ్యే మోడల్‌లో కూడా ఇదే రకమైన గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండొచ్చని అంచనా.

అంతర్జాతీయ మార్కెట్లలో లభించే జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీలో ఎమ్‌జి సిగ్నేచర్ హనీకోంబ్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్‌లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ మరియు స్ప్లిట్ స్టైల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఫాక్క్స్ స్కిడ్ ప్లేట్‌, 17 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:3 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లగ్జరీ కార్‌లో కనిపించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ కార్ ఏదో మీరూ చూడండి

హెక్టర్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్న ఎమ్‌జి మోటార్స్!

ఇక ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క తాజా ఐస్‌మార్ట్ కనెక్ట్ టెక్నాలజీని సపోర్ట్ చేసే 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రీమియం లెదర్ అప్‌హోలెస్ట్రీ, క్లైమేట్ కంట్రోల్, స్టార్ట్ / స్టాప్ పుష్ బటన్ మొదలైనవి ఉండనున్నాయి.

ఇంకా ఇందులో రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, బహుళ ఎయిర్‌బ్యాగులు, హిల్ లాంచ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. గ్లోబల్-స్పెక్ మోడళ్లలో ఆఫర్ చేస్తున్న ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్లను ఇండియన్-స్పెక్ జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీలోకూడా అలానే కొనసాగించవచ్చని తెలుస్తోంది.

హెక్టర్ కన్నా తక్కువ ధరకే కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్న ఎమ్‌జి మోటార్స్!

హెక్టర్ ధర కంటే జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ ధర తక్కువగా ఉంటుందని ఎమ్‌జి మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా కూడా గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో హెక్టర్ ప్రారంభ ధర రూ.12.83 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అంటే, ఈ కొత్త జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ ధర అంత కన్నా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీ ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు నిస్సాన్ కిక్స్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

Most Read Articles

English summary
MG ZS Petrol Version Spotted Testing In Bangalore; India Launch Expected Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X