భారత్‌లో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ విడుదల, ధర

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన 'మినీ' బ్రాండ్, భారత మార్కెట్లో మరో కొత్త కారును విడుదల చేసింది. మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ పేరిట కంపెనీ ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారత్‌లో దీని లభ్యతను కేవలం 15 యూనిట్లకే పరిమితం చేశారు.

భారత్‌లో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ విడుదల, ధర

కొత్త మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్‌ను ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాండర్డ్ కూపర్‌తో పోల్చుకుంటే ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో అనేక కాస్మెటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉంటాయి. ఇందులో కొత్త బాడీ గ్రాఫిక్స్, పెయింట్ స్కీమ్‌లు వంటి ప్రత్యేకమైన డిజైన్ అంశాలు ఉంటాయి.

భారత్‌లో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ విడుదల, ధర

ఈ డిజైన్ ఫీచర్లన్నీ మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపికి నివాళిగా ఉంటాయి. మినీ ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, భారత్‌కు దిగుమతి చేసుకుంటుంది. ఇది దేశంలో కేవలం 15 మంది కస్టమర్లకు మాత్రమే పరిమితం అవుతుంది.

MOST READ:ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో.. ఇది చూస్తే మీరు తప్పకుండా ట్రైన్‌లోనే వెళ్తారు

భారత్‌లో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ విడుదల, ధర

ఈ కారులోని డిజైన్ అంశాలను గమనిస్తే, ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ రేసింగ్ గ్రే మెటాలిక్ అని పిలువబడే ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌తో లభిస్తుంది. మెల్టింగ్ సిల్వర్ మెటాలిక్ కలర్ స్కీమ్‌లో పూర్తి చేసిన రూఫ్ మరియు మిర్రర్ క్యాప్‌లతో ఇది మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇందులో జాన్ కూపర్ వర్క్స్ స్పాయిలర్ కూడా ఉంటుంది.

భారత్‌లో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ విడుదల, ధర

ఎక్స్‌టీరియర్ డిజైన్ అంశాల్లో కొన్ని పియానో-బ్లాక్ ప్యాకేజీని కలిగి ఉంటాయి. ఇందులో హెడ్‌ల్యాంప్‌లు, టైయిల్ లైట్స్, డోర్ హ్యాండిల్స్, ఫ్రంట్ గ్రిల్, మినీ లోగోలు మరియు ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్ మొదలైనవి ఉన్నాయి. మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్‌లో కొత్త 18 ఇంచ్ టూ-టోన్ అల్లాయ్ వీల్స్ అమర్చబడి ఉంటాయి, వీటిపై జిపి బ్యాడ్జ్డ్ కలిగిన వీల్ హబ్ క్యాప్స్ ఉంటాయి.

MOST READ:మళ్ళీ పుంజుకున్న జావా పెరాక్ బైక్ అమ్మకాలు.. కారణం ఏంటో తెలుసా ?

భారత్‌లో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ విడుదల, ధర

అలాగే, ఇంటీరియర్స్ జిపి వర్క్స్ థీమ్ కనిపిస్తుంది. ఇందులో జిపి బ్యాడ్జింగ్‌తో కూడిన జెసిడబ్ల్యు స్పోర్ట్స్ సీట్స్ ఉంటాయి, వీటిని ప్రీమియం లెథర్‌తో తయారు చేశారు. క్యాబిన్‌లో ఎరుపు రంగు కాంట్రాస్ట్ స్టిచింగ్ క్యాబిన్‌కు మరింత స్పోర్టి లుక్‌నిస్తుంది. అలాగే, జిపి లోగో క్యాబిన్‌లోని ఇతర అంశాలపై కూడా కనిపిస్తుంది. ఇందులో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ ఫ్లోర్ మ్యాట్స్, 3డి పాడిల్-షిఫ్టర్స్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ విడుదల, ధర

ఇంకా ఈ కారులో పానోరమిక్ సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6.5 ఇంచ్ వృత్తాకారపు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, ఫ్రంట్ అండ్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబిఎస్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:లగ్జరీ బైక్ కొన్న సాధారణ యువకుడు.. ఇంతకీ ఎలా కొన్నాడో తెలుసా?

భారత్‌లో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ విడుదల, ధర

మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ కారులో యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 2.0-లీటర్ ఫోర్ సిలిండర్ ట్విన్‌పవర్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 228 బిహెచ్‌పి శక్తిని మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ విడుదల, ధర

కొత్త లిమిటెడ్ ఎడిషన్ మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ కేవలం 6.1 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 - 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. భారత మార్కెట్లో ఈ కారు ధర రూ.46.90 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

MOST READ:రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

భారత్‌లో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ విడుదల, ధర

భారత్‌లో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి ఇన్‌స్పైర్డ్ ఎడిషన్ చాలా ప్రత్యేకమైన లిమిటెడ్ వెర్షన్ మోడల్, దీనిని జాన్ కూపర్ వర్క్స్ జిపికి నివాళిగా తయారు చేశారు. దేశంలో కేవలం 15 అదృష్టవంతులైన కస్టమర్లకు మాత్రమే ఈ కారు దక్కుతుంది. ఇది ఖచ్చితంగా వారి గ్యారేజీలో చాలా అరుదైన మరియు కలెక్టబల్ మోడల్‌గా ఉంటుంది.

Most Read Articles

Read more on: #మినీ #mini
English summary
MINI John Cooper Works GP Inspired Edition Launched In India; Price, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X