ఇది కారా లేకా 'మినీ' బారా? - మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ ఓ సరికొత్త కాన్సెప్ట్ వాహనాన్ని ప్రపంచానికి పరిచం చేసింది. 'మినీ విజన్ అర్బనాట్' కాన్సెప్ట్ పేరుతో కంపెనీ అద్భుతమైన అటానమస్ వాహనాన్ని ఆవిష్కరించింది. 'ఏ విజన్ ఆఫ్ స్పేస్' క్యాప్షన్‌తో మినీ విజన్ అర్బనాట్‌ను తయారు చేసింది.

ఇది కారా లేకా 'మినీ' బారా? - మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్

క్యాప్షన్‌కు తగినట్లుగానే మినీ విజన్ అర్బనాట్‌ను పూర్తిగా ఇంటీరియర్ స్పేస్‌ను దృష్టిలో తయారు చేశారు. ఇదొక పూర్తి డిజిటల్ వాహనం మరియు ఇదొక పూర్తి ఆటోమేటిక్ కారు. ఇందులో ఒక కుర్చీ, సోఫా మరియు బెడ్ ఉంటుంది. గతంలో మినీ ప్రవేశపెట్టిన కాన్సెప్ట్ వాహనాల కంటే ఇవి ఎక్కువ ఇంటీరియర్ స్థలాన్ని కలిగి ఉంటుంది.

ఇది కారా లేకా 'మినీ' బారా? - మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్

మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్ వాహనాన్ని లోపలి నుండి బయటి వైపుకు డిజైన్ చేశారు. అంటే, ముందు ఇంటీరియర్స్ ప్లాన్ చేసి, తర్వాత ఎక్స్టీరియర్‌ను డిజైన్ చేశారన్నమాట. అందుకే, దీని ఇంటీరియర్స్ చాలా సింపుల్‌గా మరియు అంతే ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయి. అలాగే, ఎక్స్టీరియర్స్ కూడా మినమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:రోడ్డుపైకి రానున్న మరో రేస్ కార్ లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టిఓ ; వివరాలు

ఇది కారా లేకా 'మినీ' బారా? - మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్

ఈ కాన్సెప్ట్ మోడల్ యొక్క డిజైనర్ పూర్తి ఫ్లోర్ ప్లాన్, ఫర్నిచర్ మరియు స్కేల్ మోడళ్లతో మొదట విశాలమైన ఇంటీరియర్ అనుభవాన్ని సృష్టించాడు. ఫైనల్ కాన్సెప్ట్ వాహనం రూపుదిద్దుకునే సమయానికి ఇది సుమారు 4460 మిమీ పొడవును కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇందులోని ఇంటీరియర్ ఫ్లోర్ ప్లాన్‌ను కస్టమర్లకు నచ్చినట్లుగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఇది కారా లేకా 'మినీ' బారా? - మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్

ఈ కాన్సెప్ట్ గురించి బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ డిజైన్ హెడ్ అడ్రియన్ వాన్ హూయిడోంక్ మాట్లాడుతూ "మినీ బ్రాండ్ ఎల్లప్పుడూ 'స్థలాన్ని తెలివిగా ఉపయోగించుకోవటం'పై పనిచేస్తుంది. మినీ విజన్ అర్బనాట్‌లో, మేము ప్రైవేట్ స్థలాన్ని ప్రజా రంగానికి విస్తరించాలని భావించాము. ఇది పూర్తిగా కొత్త మరియు సుసంపన్నమైన అనుభవాలను సృష్టిస్తుంద"ని అన్నారు.

MOST READ:సాధారణ ట్రక్కులకంటే మరింత శక్తివంతమైన ఇన్‌ఫ్రా ప్రైమ్ ఎలక్ట్రిక్ ట్రక్కులు.. చూసారా !

ఇది కారా లేకా 'మినీ' బారా? - మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్

మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్ అనుభవాన్ని మరింత విస్తరించేందుకు ఇందులో మూడు మోడ్‌లను కంపెనీ పరిచయం చేసింది. మినీ బ్రాండ్ వీటిని ‘మూమెంట్స్' అని పిలుస్తుంది. వీటిలో చిల్, వైబ్ మరియు వాండర్‌లస్ట్ అనే మోడ్స్ ఉన్నాయి, ఇవి కారు ప్రవర్తనను బట్టి మారుతూ ఉంటాయి.

ఇది కారా లేకా 'మినీ' బారా? - మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్

‘చిల్' మోడ్‌లో కారు రిలాక్స్డ్ ప్రవర్తనను అందించడానికి లేదా పూర్తి ఏకాగ్రతతో పనిచేయడానికి సహకరిస్తుంది. అలాగే, ‘వైబ్' మోడ్ ఇతరులతో సమయం గడపడం చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. చివరిగా ‘వాండర్‌లస్ట్' మోడ్ కారును నడపటం లేదా ఆటోమేటిక్ డ్రైవింగ్ మోడ్‌ను ఎంచుకోవటం చేయవచ్చు.

MOST READ:నిస్సాన్ మ్యాగ్నైట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ; కాంపాక్ట్ విభాగంలో బెస్ట్ ఎస్‌యూవీ కానుందా ?

ఇది కారా లేకా 'మినీ' బారా? - మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్

మినీ విజన్ అర్బనాట్ సైడ్ స్లైడింగ్ డోర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఇంటీరియర్స్ నాలుగు సీట్ల కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇందులో ముందు భాగంలో 2 వ్యక్తిగత సీట్లు ఉంటాయి, వీటిని చుట్టూ తిప్పవచ్చు. అలాగే, వెనుక భాగంలో సోఫా సీట్లు ఉంటాయి, ఇవి లాంజ్ లాంటి అనుభూతిని ఇస్తాయి. ఇంకా ఇందులో అంతర్నిర్మిత సెంట్రల్ టేబుల్ మరియు పైభాగంలో గాజు రూఫ్ ఉంటుంది, ఇది ఓపెన్-నెస్ యొక్క అనభవాన్ని ఇస్తుంది.

ఇది కారా లేకా 'మినీ' బారా? - మినీ విజన్ అర్బనాట్ కాన్సెప్ట్

మినీ విజన్ అర్బనాట్ కాన్పెట్ కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మినీ విజన్ అర్బనాట్ అనేది భవిష్యత్తు కోసం మినీ బ్రాండ్ తయారు చేసిన ఓ కాన్సెప్ట్ వాహనం. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే. ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రలో ఇది కూడా ఎప్పటికీ ఓ కాన్సెప్ట్ వాహనం మాదిరిగానే మిగిలిపోతుందా లేక భవిష్యత్తులో ఉత్పత్తికి చేరుకొని, ప్రజలకు అందుబాటులోకి వస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

MOST READ:నుజ్జు నుజ్జయిన 25 కోట్ల విలువైన పగని కార్.. ఎలాగో తెలుసా

Most Read Articles

Read more on: #మినీ #mini
English summary
MINI has globally unveiled a new concept, called the Vision Urbanaut. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X