భారతదేశంలో మొదటిసారిగా కనిపించిన మిత్సుబిషి ఎక్స్‌పాండర్!

జపనీస్ బ్రాండ్ అయిన మిత్సుబిషి ఎక్స్‌పాండర్ భారతదేశంలో మొదటిసారి కనిపించింది. ఇది మార్కెట్ కోసం పరిశీలనలో ఉన్నప్పుడు, ఇది స్థానిక పరీక్ష కోసం ఇక్కడ ఉన్నట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

భారతదేశంలో మొదటిసారిగా కనిపించిన మిత్సుబిషి ఎక్స్‌పాండర్!

మిత్సుబిషి ఎక్స్‌పాండర్ ఎమ్‌పివి తక్కువ ఖర్చుతో కూడిన ఎమ్‌పివి. ఇది ముక్యంగా మన దేశంలోకంటే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ మరియు థాయ్‌లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం ఇది తయారు చేయబడుతుంది. ఈ వాహనాలు ఈ మార్కెట్లలో బాగా అమ్ముడవుతాయి. ఇది ప్రస్తుతం GIIAS 2017 లో ప్రవేశపెట్టబడింది మరియు ఇప్పుడు అనేక మార్కెట్లలో అమ్మకానికి ఉంది.

భారతదేశంలో మొదటిసారిగా కనిపించిన మిత్సుబిషి ఎక్స్‌పాండర్!

మిత్సుబిషి ఎక్స్‌పాండర్ లో రెండు హెడ్‌ల్యాంప్‌లు, 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్-ఆకారపు ఎల్ఈడి టెయిల్ లాంప్స్ ఉన్నాయి. వాహనం లోపల సౌలభ్యం కోసం పాసివ్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఆటోమాటిక్ ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్ ని కలిగి ఉంటుంది.

భారతదేశంలో మొదటిసారిగా కనిపించిన మిత్సుబిషి ఎక్స్‌పాండర్!

ఇంకా ఇందులో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, జిపిఎస్ నావిగేషన్‌తో పాటు, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రూఫ్-మౌంటెడ్ రియర్ ఎసి వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు 12-వోల్ట్ మూడు వరుసలలో పవర్ అవుట్ లెట్స్ ఉంటాయి.

భారతదేశంలో మొదటిసారిగా కనిపించిన మిత్సుబిషి ఎక్స్‌పాండర్!

మిత్సుబిషి ఎక్స్‌పాండర్ వాహనం యొక్క కొలతలను గమనించినట్లయితే పొడవు 4,475 మిమీ, వెడల్పు 1,750 మిమీ మరియు ఎత్తు 1,700 మిమీ. దీని వీల్‌బేస్ పొడవు 2,775 మి.మీ. ఇది 205 మిమీ వరకు గ్రౌండ్ క్లియరెన్స్ మరియు గరిష్టంగా 1,630 లీటర్ల లగ్గేజ్ స్పేస్ ని కలిగి ఉంటుంది.

భారతదేశంలో మొదటిసారిగా కనిపించిన మిత్సుబిషి ఎక్స్‌పాండర్!

ఇందులో 1.5-లీటర్ల MIVEC (మిత్సుబిషి ఇన్నోవేషన్ వాల్వ్ టైమింగ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టం)తో పాటు, నాలుగు-సిలిండర్ యూనిట్లను కలిగి ఉంటుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 105 పిఎస్ గరిష్ట శక్తిని మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 141 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతకట్టబడి ఉంటుంది.

భారతదేశంలో మొదటిసారిగా కనిపించిన మిత్సుబిషి ఎక్స్‌పాండర్!

మిత్సుబిషికి ప్రస్తుతం భారతదేశంలో కొత్తగా తయారు చేయబడిన మోడల్ కోసం ఎటువంటి ప్రణాళికలు లేవు. కానీ కంపెనీ దిగుమతి చేసుకున్న మోడళ్లను అప్‌గ్రేడ్ చేయడానికి కృషి చేస్తుంది.

Read More:త్వరపడండి....బుకింగ్స్ ప్రారంభించిన టయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్-VI, డెలివరీలు ఫిబ్రవరి నుంచే!

భారతదేశంలో మొదటిసారిగా కనిపించిన మిత్సుబిషి ఎక్స్‌పాండర్!

ఇంతకు ముందు ఉన్నపాత తరం పజెరో స్పోర్ట్ బహుశా మార్చి నాటికి నిలిపివేయబడుతుంది. కొత్త తరం పజెరో స్పోర్ట్ ఈ సంవత్సరం ఇక్కడకు వస్తుందని మాత్రమే ఆశించవచ్చు. ఈ సంవత్సరం మొదటి భాగంలోబిఎస్-VI కి అప్‌గ్రేడ్ అవుతుంది. జపనీస్ వాహన తయారీదారుల షోరూమ్‌లలో ఇది కూడా ప్రవేశించబోతుంది. ఇది మారుతి ఎర్టిగా కి ప్రత్యర్థిగా ఉండబోతుంది.

Source: Gaadiwaadi

Most Read Articles

English summary
Mitsubishi Xpander (Maruti Ertiga rival) spied in India for the first time-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X