మోడిఫైడ్ థార్స్: చూడటానికి స్టైల్‌గానే ఉంటాయి, కానీ నష్టాలే ఎక్కువ!

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ 'థార్'కి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. కేవలం ఆఫ్-రోడ్ ప్రియులనే కాకుండా ఇటు రోజూవారీ సిటీ ప్రయాణాల కోసం ఉద్దేశించి సరికొత్త డిజైన్, స్టైల్, కంఫర్ట్ మరియు సేఫ్టీ ఫీచర్లతో కొత్త 2020 థార్‌ను రూపొందించారు.

మోడిఫైడ్ థార్స్: చూడటానికి స్టైల్‌గానే ఉంటాయి, కానీ నష్టాలే ఎక్కువ!

కొత్త మహీంద్రా థార్‌ను కస్టమర్లు తమ అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవటం కోసం కంపెనీ ఇప్పటికే కొన్ని అధికారిక యాక్ససరీస్‌ను కూడా అందిస్తోంది. అయితే, కొంత మంది వినియోగదారులు మాత్రం, థార్ మోడిఫికేషన్ కోసం ఇప్పటికీ ఆఫ్-మార్కెట్ ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నారు.

మోడిఫైడ్ థార్స్: చూడటానికి స్టైల్‌గానే ఉంటాయి, కానీ నష్టాలే ఎక్కువ!

ఇదివరకటి కథనాల్లో మనం కొన్ని మోడిఫైడ్ 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీల గురించి తెలుసుకున్నాం. ఈ కథనంలో కూడా అలాంటి ఓ మోడిఫైడ్ థార్ గురించి తెలుసుకుందాం రండి. ఈ ఫొటోలో కనిపిస్తున్న కొత్త మహీంద్రా థార్‌ను భారీ 22 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో మోడిఫై చేశారు.

MOST READ:బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో డైరెక్ట్ ప్లైట్ సర్వీస్.. ఎప్పటినుంచే తెలుసా ?

మోడిఫైడ్ థార్స్: చూడటానికి స్టైల్‌గానే ఉంటాయి, కానీ నష్టాలే ఎక్కువ!

వెలాసిటీ టైర్ తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఫొటోల ప్రకారం, కంపెనీ కొత్త 2020 మహీంద్రా థార్ కోసం వివిధ రకాల పెద్ద 22 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాలలో 10-స్పోక్ మరియు రెండు రకాల 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ డిజైన్‌లను గమనించవచ్చు.

మోడిఫైడ్ థార్స్: చూడటానికి స్టైల్‌గానే ఉంటాయి, కానీ నష్టాలే ఎక్కువ!

సాఫ్ట్ టాప్ మరియు హార్డ్ టాప్ మహీంద్రా థార్ మోడళ్లపై వెలాసిటీ టైర్స్ ఈ కొత్త అల్లాయ్ వీల్స్‌ను అమర్చింది. ఈ కొత్త రకం వీల్స్ డిజైన్‌తో మహీంద్రా థార్ స్టాక్ వెర్షన్ కన్నా మరింత స్టైలిష్‌గా, ప్రీమియంగా మరియు స్పోర్టీగా కనిపిస్తుంది.

MOST READ:నవంబర్ అమ్మకాల నివేదికను రిలీజ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్, చూసారా !

మోడిఫైడ్ థార్స్: చూడటానికి స్టైల్‌గానే ఉంటాయి, కానీ నష్టాలే ఎక్కువ!

ఇలాంటి మోడిఫికేషన్ల వలన మహీంద్రా థార్ మరింత అందంగా కనిపించినప్పటికీ, వీటి వలన కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి థార్ మాడిఫైయర్లు మరియు యజమానులు గుర్తించుకోవాల్సి విషయం ఏంటంటే, కంపెనీ వారంటీ చెల్లుబాటులో ఉన్న సమయంలో థార్‌ను అనధికారిక ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తులతో మోడిఫై చేసినప్పుడు అలాంటి వాహనాలకు సదరు కంపెనీ వారంటీ వర్తించదు.

మోడిఫైడ్ థార్స్: చూడటానికి స్టైల్‌గానే ఉంటాయి, కానీ నష్టాలే ఎక్కువ!

మహీంద్రా ఈ కొత్త తరం థార్ ఎస్‌యూవీని 16 నుంచి 18 ఇంచ్‌ల వరకూ ఉండే వీల్స్‌ని ఉపయోగించుకునేలా ట్యూన్ చేసింది. అంతకు మించిన సైజ్ చక్రాలను ఉపయోగిస్తే, దీర్ఘకాలంలో థార్ సస్పెన్షన్ సెటప్ పాడయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ పెద్ద అల్లాయ్ వీల్స్ టైర్స్ కారణంగా వాహనం యొక్క మైలేజ్ తగ్గుతుంది, అలాగే స్టీరింగ్ కూడా గట్టిపడుతుంది. కాబట్టి ఇలాంటి మోడిఫికేషన్లకు దూరంగా ఉండటమే మంచిది.

MOST READ:టీవీఎస్ కంపెనీ అమ్మకాల హవా.. భారీగా పెరిగిన నవంబర్ సేల్స్, ఎంతో తెలుసా ?

మోడిఫైడ్ థార్స్: చూడటానికి స్టైల్‌గానే ఉంటాయి, కానీ నష్టాలే ఎక్కువ!

ఇక కొత్త 2020 మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఇది మూడు రూప్ టాప్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో సాఫ్ట్ టాప్, కన్వర్టిబుల్ టాప్ మరియు హార్డ్ టాప్ / ఫిక్స్‌డ్ టాప్‌లు ఉన్నాయి. మార్కెట్లో కొత్త మహీంద్రా థార్ ధరలు రూ.9.80 లక్షల నుండి రూ.13.75 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

మోడిఫైడ్ థార్స్: చూడటానికి స్టైల్‌గానే ఉంటాయి, కానీ నష్టాలే ఎక్కువ!

మహీంద్రా థార్ కోసం డిసి డిజైన్ డ్రెస్ కిట్ కొత్త 2020 మహీంద్రా థార్ కోసం ప్రముఖ ఆటోమోటివ్ డిజైనర్ దిలీప్ చాబ్రియాకు సంబంధించిన డిసి2 (గతంలో డిసి డిజైన్స్ అని పిలిచేవారు) ఓ సరికొత్త డ్రెస్ కిట్‌ను పరిచయం చేసింది. కంపెనీ అందిస్తున్న లెవల్స్‌కు మించి కస్టమైజేషన్ ఆప్షన్స్ పొందాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకొని డిసి2 ఈ కాస్మెటిక్ కిట్‌ను ప్రవేశపెట్టింది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:ఫోక్స్‌వ్యాగన్ కస్టమర్ టచ్ పాయింట్ ఇప్పుడు మన హైదరాబాద్‌లో కూడా.. ఎక్కడో తెలుసా?

మోడిఫైడ్ థార్స్: చూడటానికి స్టైల్‌గానే ఉంటాయి, కానీ నష్టాలే ఎక్కువ!

మోడిఫైడ్ మహీంద్రా థార్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే ఇలాంటి ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తులతో వాహనాలను మోడిఫై చేయటం వలన, వాటికి వారంటీ వర్తించకుండా పోతుంది. అంతేకాకుండా, వీల్స్ మోడిఫికేషన్ వలన కలిగే ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, వాహనాలకు కంపెనీ సిఫార్సు చేసిన అధీకృత యాక్ససరీలను మాత్రమే వినియోగించుకొని కస్టమైజ్ చేసుకోవాలి.

Image Courtesy: Velocity Tyres

Most Read Articles

English summary
All-new 2020 Mahindra Thar modified with 22 inch alloy wheels. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X