గుడ్‌న్యూస్: అన్ని వాహన డాక్యుమెంట్లు మార్చ్ 31, 2021 వరకూ పొడగింపు!

దేశంలోని మోటారిస్టులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. భారతదేశంలోని అన్ని వాహన పత్రాల చెల్లుబాటును మరోసారి పొడిగిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా మార్చి 31, 2021వ తేదీ వరకు అన్ని వాహన పత్రాల గడువును పొడగిస్తున్నట్లు తెలిపింది.

గుడ్‌న్యూస్: అన్ని వాహన డాక్యుమెంట్లు మార్చ్ 31, 2021 వరకూ పొడగింపు!

ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ (డిఎల్), వెహికల్ రిజిస్ట్రేషన్లు (ఆర్‌సిలు), పర్మిట్లు మరియు ఇతర వాహన పత్రాలు మార్చి 2021 చివరి వరకు చెల్లుబాటులో ఉంటాయి.

గుడ్‌న్యూస్: అన్ని వాహన డాక్యుమెంట్లు మార్చ్ 31, 2021 వరకూ పొడగింపు!

దేశంలో కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పైన పేర్కొన్న పత్రాలను (ఇప్పటికే గడువు తీరిపోయినా సరే) మార్చ్ 31, 2021 వరకూ చెల్లుబాటు అయ్యేవిగా అధికారులు పరిగణించాలని సదరు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో ఇలా వాహన పత్రాల గడువును పొడగించిన గడచిన మార్చ్ 2020 నుండి ఇది నాల్గవసారి.

MOST READ:దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

గుడ్‌న్యూస్: అన్ని వాహన డాక్యుమెంట్లు మార్చ్ 31, 2021 వరకూ పొడగింపు!

గతంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మార్చ్ 2020, జూన్ 2020 మరియు ఆగస్టు 2020 నెలల్లో వాహన పత్రాల చెల్లుబాటు గడువును పొడిగించిన విషయం తెలిసినదే. చివరిగా చేసిన ప్రకటన ప్రకారం, సదరు వాహన పత్రాల గడువు డిసెంబర్ 31, 2020 నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో, తాజాగా వీటి చెల్లుబాటును మార్చ్ 31, 2021 వరకూ పొడగించారు.

గుడ్‌న్యూస్: అన్ని వాహన డాక్యుమెంట్లు మార్చ్ 31, 2021 వరకూ పొడగింపు!

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన సారాంశం ప్రకారం.. "మోటారు వాహనాల చట్టం, 1988 నరియు సెంట్రల్ మోటారు వాహన నిబంధనలు 1989 ప్రకారం, వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్లు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ లేదా ఇతర పత్రాల చెల్లుబాటును డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది" అని తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.

MOST READ:మోడీ ప్రారంభించిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

గుడ్‌న్యూస్: అన్ని వాహన డాక్యుమెంట్లు మార్చ్ 31, 2021 వరకూ పొడగింపు!

దేశంలో కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తగ్గకపోవటం మరోవైపు, సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వలన ప్రజలు సామాజిక దూరం పాటించి, తమ వాహన పత్రాల గడువు పొడగింపుల కోసం రవాణా కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన అవసరం ఉండని మంత్రిత్వ శాఖ వివరించింది.

గుడ్‌న్యూస్: అన్ని వాహన డాక్యుమెంట్లు మార్చ్ 31, 2021 వరకూ పొడగింపు!

దేశంలో కరోనాకి ఇంకా వ్యాక్సీన్ అందుబాటులోకి రాకపోవటం మరియు గతంలో వాహన పత్రాల విషయంలో పొడగించిన గడువు డిసెంబర్ 31, 2020 నాటికి ముగుస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మోటారిస్టులు, పౌరుల భద్రత విషయంలో మంత్రిత్వ శాఖ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతించదగినది.

MOST READ:నిర్మానుష్య రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే టేక్ కేర్.. ఎందుకో వీడియో చూడండి

Most Read Articles

English summary
Highway ministry extends validity of vehicle documents till march 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X