అంబానీ యొక్క రోల్స్ రాయిస్ కార్స్ చూసారా..!

భారతదేశంలో అంబానీ ప్రసిద్ధి చెందిన గొప్ప ధనవంతుడు, అంతే కాకుండా ప్రపంచంలో ఉన్న ధనవంతులలో కూడా ఒకరుగా ఉన్నారు. అంబానీ అత్యంత విలాసవంతమైన మరియు లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. అంబానీ యొక్క అత్యంత లగ్జరీ కార్లుగా ప్రసిద్ధి చెందిన మూడు బ్రిటీష్ బ్రాండ్ రోల్స్ రాయిస్ కార్లను కూడా కలిగి ఉన్నాడు. అంబానీ యొక్క రోల్స్ రాయిస్ కార్ల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందా..

అంబానీ యొక్క రోల్స్ రాయిస్ కార్స్ చూసారా..!

రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ (EWB)

ప్రస్తుతానికి అంబానీ గ్యారేజీలో వున్న అత్యంత ఖరీదైన వాహనం ఇది. సరికొత్త రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII ని గత సంవత్సరం అంబానీ గ్యారేజీలో చేర్చారు. కాని దీనిని ఈ కుటుంబం 2020 లో ఉపయోగించడం ప్రారంభించింది. ఇది అల్యూమినియం స్పేస్ఫ్రేమ్ ప్లాట్‌ఫాంపై ఆధారపడిన కొత్త ఫాంటమ్. దీనిని తయారీదారు ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ అని పిలుస్తుంది.

ఇది మునుపటి మోడల్ కంటే కూడా 30% తేలికైనదిగా ఉంటుంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII అనేది ఇప్పటివరకు తయారు చేసిన అతిపెద్ద రోల్స్ రాయిస్ కార్లలో ఒకటి.

అంబానీ యొక్క రోల్స్ రాయిస్ కార్స్ చూసారా..!

ఫాంటమ్ సిరీస్ VIII యొక్క ఆన్ రోడ్ ధర 13.5 కోట్ల రూపాయలు. ఇది ఎటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ కలిగి ఉండదు. అంబానీ దీనికి అదనపు ఫీచర్స్ తో తయారు చేయించారు. కాబట్టి ఈ కారు ఖచ్చితంగా సాధారణ మోడల్ కంటే కొంత ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.

MOST READ: భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 10 కార్లు ఇవే

అంబానీ యొక్క రోల్స్ రాయిస్ కార్స్ చూసారా..!

రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII 6.75-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ వి 12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 563 బిహెచ్‌పి శక్తిని మరియు 900 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది రోడ్లపై ట్రాఫిక్ మరియు కర్వ్స్ ను బట్టి గేర్ మార్పులను అంచనా వేస్తుంది.

అంబానీ యొక్క రోల్స్ రాయిస్ కార్స్ చూసారా..!

రోల్స్ రాయిస్ కల్లినన్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII కి ముందు, అంబానీ కల్లినన్ ఎస్‌యూవీని కొనుగోలు చేసారు. ఇది బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ నుండి వెలువడిన మొట్టమొదటి ఎస్‌యూవీ. దీనికి ఎటువంటి అప్సనల్ ఎక్స్‌ట్రాలు మరియు కస్టమైజేషన్ లేకుండా దీని ధర రూ. 6.95 కోట్ల (ఎక్స్‌షోరూమ్) వరకు కలిగి ఉంటుంది. కానీ అంబానీ యొక్క ఈ రోల్స్ రాయిస్ కుల్లినన్ ధర దాదాపు 8 కోట్ల రూపాయలు. ఇందులో ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి.

MOST READ: త్వరలో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న బజాజ్ - కెటిఎమ్ ఎలక్ట్రిక్ స్కూటర్, చూసారా.. !

ఇది 6.8-లీటర్ వి 12, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది గరిష్టంగా 560 బిహెచ్‌పి శక్తిని మరియు 850 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4X4 సిస్టమ్‌ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ కలిగి ఉంటుంది. కల్లినన్ 4 వీల్ స్టీరింగ్ వ్యవస్థను కూడా పొందుతుంది, ఇందులో ఐ వ్యూ కెమెరా సిస్టమ్‌ వంటి అధునాతన 360 డిగ్రీ కెమెరాను పొందుతుంది.

అంబానీ యొక్క రోల్స్ రాయిస్ కార్స్ చూసారా..!

రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూపే

అంబానీ కుటుంబం అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూపేను కూడా కొనుగోలు చేసింది. ఈ కారు చాలా అరుదుగా గ్యారేజ్ నుండి బయటకు వస్తుంది. ఈ కారు ఎరుపు రంగు పైకప్పుతో తెలుపు రంగు బాడీని కలిగి ఉంటుంది. ఈ కారులో ఎక్కువగా అంబానీ యొక్క చిన్న కుమారుడు అనంత్ అంబానీ గుర్తించబడ్డాడు.

MOST READ: లాక్‌డౌన్ లో 1800 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి ఇంటికి చేరుకున్న యువకుడు

అంబానీ యొక్క రోల్స్ రాయిస్ కార్స్ చూసారా..!

ఈ ఫాంటమ్ డిహెచ్‌సి కూడా అదే 6.8 లీటర్ వి 12 టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది గరిష్టంగా 460 బిహెచ్‌పి శక్తిని మరియు 720 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రోజు వరకు ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన కన్వర్టిబుల్‌గా ఉంది.

Most Read Articles

English summary
Watch all 3 Rolls Royce cars owned by the Ambanis on video. Read in Telugu.
Story first published: Tuesday, April 14, 2020, 15:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X