Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ లగ్జరీ కార్స్ ఎలా ఉన్నాయో చూసారా !
కర్ణాటకకు చెందిన చివరి మాఫియా డాన్ ముత్తప్ప రాయ్ 68 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ముత్తప్ప రాయ్ కొన్ని వందల కోట్లకు విలువైన బిలియనీర్, అతను 30 సంవత్సరాలకు పైగా బెంగళూరు మొత్తాన్ని శాసించాడు. ముత్తప్ప మంగళూరులో కామర్స్ గ్రాడ్యుయేట్ చదివాడు. తరువాత విజయ బ్యాంకు ఆఫీస్ లో తన వృత్తిని ప్రారంభించాడు.

1980 వ దశకంలో ముత్తప్ప బెంగళూరు యొక్క అండర్ వరల్డ్‌తో సంబంధాలు పెట్టుకున్నాడు మరియు 1990 లో ఎంపి జైరాజ్‌ను పగటిపూట హత్య చేసాడు. అతను తన స్థావరాన్ని ముంబై మరియు దుబాయ్‌లకు మార్చాడు. ముత్తప్ప అక్కడ అతను తన వ్యాపారాన్ని స్థాపించాడు. 2002 లో యుఎఇ నుండి భారతదేశానికి పంపించేశారు.
MOST READ:రాష్ట్రపతిపై పడిన కరోనా ఎఫెక్ట్ : ఏం జరిగిందో తెలుసా

ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా అతనిపై మరియు అతని విలాసవంతమైన జీవనశైలిపై ఒక సినిమా తీసాడు. ఈ చిత్రం అప్పటిలో ఒక సంచలనం సృష్టించాడు. అయితే ఇప్పుడు అతని లైఫ్ స్టైల్ తెలియజేయడానికి అతని వద్ద ఉన్న కొన్ని కార్లు గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ :
అండర్ వరల్డ్ డాన్ గా ప్రసిద్ధి చెందిన ముత్తప్ప కలిగి ఉన్న కార్లలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఒకటి. ముత్తప్ప ఎక్కువగా ఈ కార్లలో తిరుగుతూ ఉంటాడు. ఈ ల్యాండ్ క్రూయిజర్ మొత్తం నల్లటి కిటికీలను కలిగి ఉంటుంది. ఇది కారులో అద్భుతంగా కనిపించే అల్లాయ్ వీల్స్‌ను కూడా కలిగి ఉంది.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ :
ముత్తప్ప గ్యారేజీలో ఉన్న మరో ఎస్యూవీ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్. తెలుపు రంగులో ఉన్న పాత తరం ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ మరొక కారు, దీనిని అతను చాలా తరచుగా ఉపయోగించే వాడు. ఇది చూడటానికి చాలా స్టైల్ గా ఉంటుంది. ఇది ఎలాంటి రహదారులలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కారు చాలా సౌకర్యవంతమైన క్యాబిన్ కలిగి ఉంటుంది. రేంజ్ రోవర్స్ చాలా మంది ప్రముఖుల వద్ద ఉన్న లగ్జరీ కారు.
MOST READ:బ్రేకింగ్ న్యూస్.. ఎంవి అగస్టా మరో కొత్త రంగులో కూడా

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ :
ముత్తప్ప కలిగి ఉన్న మరొక సౌకర్యవంతమైన సెడాన్ ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్. ఇది జర్మన్ తయారీదారు నుండి వచ్చిన ప్రధాన సెడాన్ మరియు చాలా సౌకర్యవంతమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ముత్తప్ప దగ్గర ఉన్న ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ మొత్తం నలుపు రంగులో ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్కె కూపే :
ఎస్ఎల్కె యొక్క 2005 మోడల్ సిజర్ డోర్స్ కలిగి ఉంటుంది. ఈ వాహనాలలో కొన్ని మాత్రమే భారతదేశంలో ఉన్నాయి. అతని యాజమాన్యంలో వున్నా ఎస్ఎల్కె కూడా మొత్తం నల్ల రంగులో ఉంది. ఇది మిడ్-సైజ్ స్పోర్ట్స్ కారు మరియు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. ముత్తప్ప ఈ వాహనాన్ని రోడ్లపై మరియు బెంగళూరులోని తన ఇంటి లోపల నడుపుతున్నట్లు గుర్తించారు.
MOST READ:యమహా బైక్స్ ఇప్పుడు వెరీ కాస్ట్లీ, ఎంతో తెలుసా !

పొలారిస్ స్పోర్ట్స్ మాన్ :
పొలారిస్ గ్లోబల్ లీడర్ దాదాపు ఒక దశాబ్దం క్రితం భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఇటువంటి దానిని కూడా ముత్తప్ప కలిగి ఉన్నాడు. దీనిపై ముత్తప్ప రాయ్ ఉండటం మనం ఇక్కడ చూడవచ్చు. పొలారిస్ ఎటివిలు రహదారి చట్టబద్దమైనవి కాదని గమనించాలి. అందుకే అతను దానిని తన ఇంటి వద్ద మరియు ప్రైవేట్ ప్రాంతాలలో ఉపయోగించాడు.

ఆడి క్యూ 5 :
ఆడి క్యూ 5 మార్కెట్లో చాలా సంవత్సరాలుగా ఉంది. ఇది చాలామంది వ్యాపారవేత్తలు దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో ఇదికూడా ఒకటి. క్యూ 5 మిడ్-సైజ్ ఎస్యూవీ. ఇది చూడటానికి చాలా అకర్షణీయమైన డిజైన్ మరియు స్టైల్ ని కలిగి ఉంది వాహనదారునికి మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.
MOST READ:ముంబైలో లాక్డౌన్ ఉల్లంఘించిన వాహనాలకు విధించిన జరిమానా ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

టయోటా ఫార్చ్యూనర్ :
టయోటా ఫార్చ్యూనర్ మంచి దృఢమైన నిర్మాణంగల ఎస్యూవీ. ఈ కారు దాని విభాగంలో బాగా ప్రాచుర్యం పొందింది. భారతదేశానికి వచ్చినప్పటి నుండి ఈ విభాగం నుండి ఫార్చ్యూనర్‌ను మరే కారు అధిగమించలేదు. ముత్తప్ప దగ్గర ఉన్న చాలా లగ్జరీ కార్లలో ఒకటి ఈ టయోటా ఫార్చ్యూనర్. ఇది అనేక భద్రత లక్షణాలను కలిగి ఉంటుంది.