ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

ఆటోమోటివ్ రంగంలో నిత్యం కొత్త టెక్నాలజీలను పుట్టుకొస్తున్న సంగతి తెలిసినదే. మనిషి డ్రైవింగ్ అవసరాలను బట్టి, వారి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఆటోమొబైల్ ఇంజనీర్లు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తూనే ఉన్నాయి.

ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

గడచిన 2020 సంవత్సరం అందరికీ చాలా కష్టతరమైన సంవత్సరం. కానీ, ఇదే సంవత్సరంలో ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో మాత్రం అనేక కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా, మన భారతదేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు చాలా వరకూ డిజిటల్ ప్రక్రియకు అలవాటు పడ్డాయి.

ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

వాహనాన్ని సెలక్ట్ చేసుకోవటం నుండి డెలివరీ వరకూ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించేలా ఆటోమొబైల్ కంపెనీలు తమ డిజిటల్ ఛానెళ్లను విస్తరించుకున్నాయి. ఈ సమయంలో కార్లలో కూడా కొత్త సాంకేతికలు బాగా ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి:

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. అదేంటో తెలుసా ?

ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

1. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు కార్లలో అత్యంత అవసరమైన ఫీచర్లలో ఒకటిగా మారిపోయింది. ఈ సంవత్సరం, అనేక బడ్జెట్ కార్లలో కూడా మనం ఈ తరహా ఫీచర్‌ను చూశాం. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే టెక్నాలజీతో కూడిన చిన్నకార్లు ఇప్పుడు మార్కెట్లో చాలానే ఉన్నాయి.

ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

మారుతున్న ట్రెండ్‌కి తగినట్లుగానే మొబైల్ కంపెనీలు కూడా తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సంబంధించిన యాప్‌లను డిఫాల్ట్‌గా అందిస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను భౌతికంగా తాకాల్సిన అవసరం లేకుండానే కాల్స్‌ను రిసీవ్ చేయటం లేదా తిరస్కరించడం చేయవచ్చు. అలాగే, వినోదం కోసం బ్లూటూత్ సాయంతో సంగీతాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు.

MOST READ:కొత్త హోండా హార్నెట్ 2.0 రెప్సోల్ ఎడిషన్ వీడియో.. మీరు చూసారా ?

ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

2. ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు వైరస్ ప్రొటెక్షన్

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపివేస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. దావాణలంలా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను అడ్డుకోవటం ఇప్పుడు మన ముందున్న సవాళ్లలో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి కార్లలో ఈ వైరస్ బ్రతికి ఉండేందుకు మరియు ఎక్కువగా విస్తరించేందుకు కావల్సిన పరిస్థితులు ఉంటాయి.

ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

ఈ నేపథ్యంలో, కార్ కంపెనీలు ఇప్పుడు తమ కార్లలో బిల్ట్ ఇన్

ఎయిర్ ప్యూరిఫైయర్లను ఆఫర్ చేస్తున్నాయి. ఒకప్పుడు లగ్జరీ కార్లలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఫీచర్ ఇప్పుడు సాధారణ కార్లలో సైతం అందుబాటులోకి వచ్చింది. నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, కార్ల తయారీ కంపెనీలు ప్రయాణీకుల ఆరోగ్యాన్ని కాపాడటానికి తమ కార్లలో ఈ టెక్నాలజీని అందించడం ప్రారంభించాయి.

MOST READ:డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

3. స్మార్ట్ కార్ టెక్నాలజీ

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అధునాతన కార్లలో జియోఫెన్సింగ్, టెలిమాటిక్స్, రిమోట్ యాక్సెస్ వంటి అనేక కొత్త తరం సాంకేతికతలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసినదే. ఇలాంటి స్మార్ట్ ఫీచర్లన్నీ కలిసి కార్లను మరింత సురక్షితంగా చేస్తాయి. ఒకవేళ కారు దొంగిలించబడిన జియో ఫెన్సింగ్ సాయంతో అదెక్కడ ఉందో గుర్తించవచ్చు. అలాగే, గ్లోస్టర్ వంటి లెవల్ 1 అటానమస్ కార్లతో వాటిని రిమోట్‌గా పార్క్ చేయవచ్చు. అయితే, ప్రస్తుతం ఇలాంటి ఫీచర్లన్నీ కాస్తంత ఖరీదైన కార్లలో మాత్రమే లభిస్తున్నాయి..

ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

4. పెద్ద టచ్‌స్క్రీన్

కార్లలో ఇప్పుడు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చాలా అవసరమైన మరియు సర్వసాధారణమైన ఫీచర్‌గా మారిపోయింది. మార్కెట్లో లభిస్తున్న ఎంట్రీ లెవల్ కార్లలో కూడా ఈ తరహా సాంకేతికతను అందిస్తున్నారు. ఒకప్పుడు కార్లలోని వివిధ ఫంక్షన్లను నిర్వహించడానికి అనేక రకాల భౌతిక బటన్లు అందుబాటులో ఉండేవి, ఇప్పుడు వాటి స్థానంలోకి ఈ టచ్‌స్క్రీన్ అందుబాటులోకి వచ్చింది. ఇది కారు డ్యాష్‌బోర్డులోని స్థలాన్ని ఆదా చేయటమే కాకుండా సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.

MOST READ:రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్.. తమిళ్ తలైవా కార్లు ఎలా ఉన్నాయో చూసారా !

ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

5. యాంటీ-కొల్లైజన్ టెక్నాలజీ

హై-ఎండ్ కార్లలో లభించే మరో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం యాంటీ-కొల్లైజన్ టెక్నాలజీ. జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేయటం ఈ టెక్నాలజీ విశిష్టత. మన దేశంలో ఎమ్‌జి గ్లోస్టర్ వంటి కార్లలో ఈ టెక్నాలజీ ఉంది. ఈ యాంటీ కొల్లైజన్ టెక్నాలజీలో 360-డిగ్రీ కెమెరాలు మరియు రాడార్ వ్యవస్థలు ఉంటాయి. ఇవి కారు చుట్టు పక్కల పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రమాదానికి గురికాకుండా ఉండేలా చూడటంలో సహకరిస్తాయి.

Most Read Articles

English summary
New technology trends became famous in cars. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X