Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బీఎమ్‌డబ్ల్యూ X1 విడుదల: ధర టయోటా ఫార్చ్యూనర్ రేంజ్‌లోనే!
బీఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 2020 బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1(2020 BMW X1) ఎస్‌యూవీని లాంచ్ చేసింది. సరికొత్త బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 35.90 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఖరారు చేశారు.

న్యూ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 లగ్జరీ ఎస్‌యూవీ మూడు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. అవి, స్పోర్ట్ఎక్స్, ఎక్స్‌లైన్ మరియు ఎమ్‌స్పోర్ట్. ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 42.90 లక్షలు, ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మిడ్ వేరియంట్ ఎక్స్‌లైన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభిస్తుండగా, బేసిక్ వేరియంట్ స్పోర్ట్‌ఎక్స్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఎమ్‌స్పోర్ట్ కేవలం డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది.

బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1లో లభించే అన్ని ఇంజన్ వేరియంట్లను బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా తీసుకొచ్చారు. ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 192బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, అదే విధంగా 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ గరిష్టంగా 190బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బీఎమ్‌డబ్ల్యూ పెట్రోల్ వేరియంట్లు స్టాండర్డ్ 7-స్పీడ్ స్టెప్ట్రోనిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుండగా, డీజల్ ఇంజన్ వేరియంట్లను 8-స్పీడ్ స్టెప్ట్రోనిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

డిజైన్ అప్‌డేట్స్ విషయానికి వస్తే, బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 లగ్జరీ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌లో అతి పెద్ద సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ వచ్చింది, దీనికి ఇరువైపులా పలుచటి ఎల్‌ఈడీ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డై టమ్ రన్నింగ్ ల్యాంప్స్ వచ్చాయి.

అత్యంత అగ్రెసివ్ లుక్ తీసుకొచ్చేందుకు ఫ్రంట్ బంపర్‌లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ మరియు విశాలమైన ఎయిర్ ఇంటేకర్ జోడించారు. కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరియు రెండు ఎగ్జాస్ట్ పైపులతో కొద్దిగా రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్ వంటివి ఎక్స్1 ఎస్‌యూవీలో ఎంతో కొత్తగా అనిపించాయి.

బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఇంటీరియర్ చూడటానికి దాదాపు పాత మోడల్‌నే పోలి ఉంది. అయితే, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో కొద్దిగా మార్పులు చోటు చేసుకున్నాయి. బీఎమ్‌డబ్ల్యూ వారి ఐ-డ్రైవ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంటీరియర్‌కు ప్రీమియం ఫీలింగ్ తీసుకొచ్చింది.

వైర్-లెస్ ఛార్జింగ్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఆధారిత స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ, పానరొమిక్ సన్‌రూఫ్, పుష్-బటన్ స్టార్ట్ మరియు క్లైమేట్ కంట్రోల్‌తో పాటు ఇంకా ఎన్నో అదనపు ఫీచర్లు వచ్చాయి.

ప్రయాణికుల సేఫ్టీ పరంగా బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యూవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు రియర్ వ్యూవ్ కెమెరాతో పాటు ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

సరికొత్త 2020 బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యూవీ 12 రకాల విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో, ఆల్పైన్ వైట్, బ్లాక్, బ్లాక్ సఫైర్, గ్లేజియర్ వైట్, మినరల్ వైట్, స్పార్ల్కింగ్ బ్రౌన్, స్పార్ల్కింగ్ స్టోర్మ్, మెడిటెర్రేనియన్ బ్లూ, సన్‌సెట్ ఆరేంజ్, జుకారో బీజి మరియు స్టార్మ్ బే మెటాలిక్.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సరికొత్త బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 బీఎస్6 వెర్షన్‌లో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు మరెన్నో డిజైన్ అప్‌డేట్స్‌తో చాలా కొత్తగా వచ్చింది. మునుపటి వెర్షన్ కంటే చూడటానికి కొత్త వెర్షన్ చూడటానికి కాస్త పెద్దదిగా ఉంది. ధర పరంగా చూస్తే, టయోటా ఫార్చ్యూనర్ రేంజ్‌లో ఉంది. కానీ సెగ్మెంట్ పరంగా మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ మరియు ఆడి క్యూ3 మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.