ఇండియాలో 2020 ఎక్స్ 1 లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బిఎమ్‌డబ్ల్యూ

2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 ఫేస్‌లిఫ్ట్ ఈ సంవత్సరం భారతదేశంలో లాంచ్ కానుంది. ఇండియన్ మార్కెట్ కోసం ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్ 1 ను విడుదల చేసినట్లు బిఎమ్‌డబ్ల్యూ సంస్థ ధృవీకరించింది. ఈ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 ఎస్‌యువిలో డిజైన్ మరియు స్టైలింగ్‌తో పాటు ఇంటీరియర్‌లలో కూడా చాలా మార్పులు జరిగాయి. కానీ ఇంజిన్ స్పెక్స్ మాత్రం ఎలాంటి మార్పుకి లోనుకాలేదు. 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఇండియాలో 2020 ఎక్స్ 1 లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 ఎస్‌యువి ఒకటి. సాధారణంగా బిఎండబ్ల్యు ఎక్స్ 1 ఎస్‌యువి 2010 లో ప్రారంభించింది. లాంచ్ అయినప్పటి నుంచి ఈ వాహనాన్ని వినియోగదారులు చాలా మంది ఇష్టపడ్డారు. ఇప్పుడు ఈ సెడాన్ కొత్త రూపకల్పనలతో ప్రారంభం కానుంది.

2020 మార్చి 5 న ప్రారంభంకానున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 ఫేస్‌లిఫ్ట్

దీని రూపకల్పన విషయానికి వస్తే ఇది మునుపటి మోడల్ కంటే తేలికైనదిగా ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ సెకండ్ జెన్ ఎక్స్ 1 ఎస్‌యువి 2016 ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసింది. ఇప్పుడు ఇది పునః రూపకల్పన చేసిన డిజైన్లతో వినియోగదారునికి మరింత అనుకూలంగా ఉంటుంది.

2020 మార్చి 5 న ప్రారంభంకానున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 ఫేస్‌లిఫ్ట్

2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 అప్‌డేటెడ్ లక్షణాలను గమనిస్తే ఇందులో ఫ్రంట్ ఎండ్‌లో అప్‌డేట్ చేసిన గ్రిల్ ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్‌తో పునః రూపకల్పన చేసిన ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్ బంపర్ మరియు కొత్త ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్‌లు ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ షార్ప్ లైన్స్ ని కలిగి ఉంటుంది. కానీ సైడ్ ప్రొఫైల్ మాత్రం ఎటువంటి మార్పు చెందదు.

ఇండియాలో 2020 ఎక్స్ 1 లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బిఎమ్‌డబ్ల్యూ

2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 ఫేస్‌లిఫ్ట్ లో 6.5 అంగుళాల డిస్ప్లే స్థానంలో 8.8-అంగుళాల టచ్‌స్క్రీన్ ప్రస్తుతం వున్న మోడల్ లో లాగానే ఉంటుంది. అంతే కాకుండా అప్డేట్ చేసిన అప్హోల్స్టరీని కూడా కలిగి ఉంటుంది. ఫేస్‌లిఫ్టెడ్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 ప్రస్తుత మోడల్‌తో సమానమైన ఇంజిన్‌లతో మరియు అదే స్పెసిఫికేషన్లతో శక్తినివ్వగలదని భావిస్తున్నారు.

ఇండియాలో 2020 ఎక్స్ 1 లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లేదా 2.0 డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 192 బిహెచ్‌పి శక్తి వద్ద 20 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. డీజిల్ ఇంజిన్ 188 బిహెచ్‌పి మరియు 400 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి అనుసంధానించబడి ఉంటుంది.

ఇండియాలో 2020 ఎక్స్ 1 లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బిఎమ్‌డబ్ల్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఇది చాల సామర్త్యం కలిగిన వాహనం. ఇది అద్భుతమైన జర్మన్ టెక్నాలజీతో వస్తోంది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా డ్రైవింగ్ చేయడానికి చాల అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
2020 BMW X1 Facelift To Be Launched On 05 March With Updated Styling & Interiors. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X