భారత్‌లో 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో ఓ కొత్త ఎసూయూవిని విడుదల చేయనున్నట్లు మేము ఇది వరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నేడు దేశీయ విపణిలోకి తమ సరికొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 (BMW X6) ఎస్‌యూవీని విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

భారత్‌లో 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

ఎస్‌యూవీలోని కంఫర్ట్, కూప్‌లోని స్టయిల్‌ను కలగలిపి డిజైన్ చేసిన కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎస్‌యూవీ-కూప్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లలో విక్రయించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బిఎమ్‌డబ్ల్యూ డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ కొత్త మోడల్ కోసం బుకింగ్‌లను ఓపెన్ చేశారు. అలాగే, ఆన్‌లైన్‌లో కూడా కస్టమర్లు ఈ కొత్త కారును బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.

భారత్‌లో 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కారును భారత మార్కెట్లో విడుదల చేయటం ద్వారా ఈ కారుతో ఇక్కడి మార్కెట్లో 'ఎస్.ఏ.సి సెగ్మెంట్' (స్పోర్ట్ యాక్టివిటీ కూప్) అనే కొత్త విభాగాన్ని తాము ప్రారంభించినట్లయిందని బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా యాక్టింగ్ ప్రెసిడెంట్ అర్లిండో టీక్సెరియా అన్నారు. ఆకర్షనీయమైన కూప్ లైన్స్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ మోడల్ డైనమిజం కలయికలతో మోడ్రన్ ఎక్స్‌ప్రెసివ్ డిజైన్ లాంగ్వేజ్‌తో తమ సరికొత్త మూడవ తరం బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 తయారైందని అన్నారు.

MOST READ: హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు!

భారత్‌లో 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

అల్టిమేట్ లగ్జరీ, స్పోర్టింగ్ డైనమిక్స్, పవర్‌ఫుల్ స్టైల్ కలయికతో రూపుదిద్దుకున్న ఈ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కారు ఈ సెగ్మెంట్లో మరే ఇతర కారు ఇవ్వనంత గొప్ప డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని టీక్సెరియా అన్నారు. కూప్‌లా ఉండే వెనుక డిజైన్, ఎస్‌యూవీలా ఉండే ఫ్రంట్ డిజైన్‌తో తయారైన ఈ కొత్త స్పోర్ట్ యాక్టివిటీ కూప్ (ఎస్.ఏ.సి) బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 తమ బ్రాండ్ పరిచయం చేసిన సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌కి అద్దం పడుతుందని అన్నారు.

భారత్‌లో 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

కొత్త తరం బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కారులో డిజైన్ పరంగా, ఇంటీరయర్ల పరంగా అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. అన్ని బిఎమ్‌డబ్ల్యూ కార్ల మాదిరిగానే ఉందులో కూడా డబుల్ కిడ్నీ స్టైల్ గ్రిల్ ఉంటుంది. కాకపోతే ఈ గ్రిల్ క్రోమ్ ఫినిష్‌తో చూడటానికి మరింత షార్ప్‌గా కనిపిస్తుంది. కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ డిజైన్, అడాప్టివ్ ఎల్ఈడి టెక్నాలజీతో కూడిన బిఎమ్‌డబ్ల్యూ లేజర్ లైట్స్, ఫాగ్‌ల్యాంప్స్‌ను ఇంటిగ్రేట్ చేసి రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, ఫ్లోటింగ్ బాడీ లైన్స్ వంటి మార్పులతో మునుపటి వెర్షన్ మరింత షార్ప్ అండ్ స్టయిలిష్‌గా కనబడేలా కొత్త ఎక్స్6 ఎస్‌యూవీని డిజైన్ చేశారు.

MOST READ: భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

భారత్‌లో 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

ఇక ఇంటరీయర్లలో కూడా మరిన్ని కంఫర్ట్ ఫీచర్లతో మరింత లగ్జరీ ఫీల్‌నిచ్చేలా మార్పులు చేశారు. ప్రత్యేకించి వెర్నెస్కా లెథర్‌తో తయారు చేయబడిన సీట్లు మరియు ఇంటీరియర్ అప్‌హోలెస్ట్రీ, మసాజ్ సదుపాయంతో కూడిన పవర్ సీట్స్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, గ్లాస్‌తో తయారు చేసిన గేర్ లివర్, పానరోమిక్ సన్‌రూఫ్, బోవర్స్ అండ్ విల్కిన్స్ నుంచి గ్రహించిన ప్రీమియం ఆడియో సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే మరియు బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ కనెక్టివిటీ సాఫ్ట్‌వేర్‌తో డిజైన్ చేసిన పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి విలాసవంతమైన ఫీచర్లు ఈ కారు సొంతం.

భారత్‌లో 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కారులో కంపెనీ నుంచి పాపులర్ అయిన అత్యంత పవర్‌ఫుల్ 'xDrive40i' 3-లీటర్, సిక్స్-సిలిండర్, ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ 340 బిహెచ్‌పిల శక్తిని, 1500 ఆర్‌పిఎమ్ వద్ద 450 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఆల్-వీల్ (ఎక్స్-డ్రైవ్) డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

MOST READ: 3 కోట్ల విలువైన కార్లు దొంగలించిన దొంగల ముఠా, తర్వాత ఏం జరిగించే తెలుసా ?

భారత్‌లో 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కారును కొనాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ అడిషనల్ ఫీచర్లను కూడా అప్షనల్‌గా అందిస్తోంది. ఈ మోడల్ మొత్తం 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది, అవి - ఆల్ఫా వైట్, కార్బన్ బ్లాక్, మినరల్ వైట్, ఫ్రేమెంకో రెడ్, సోఫిస్టో గ్రే, బ్లాక్ సఫైర్, ఆర్కిటిక్ గ్రే, మ్యాన్‌హాటన్ మెటాలిక్. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కారు రెండు వేరియంట్లలో (xLine, M Sport) లభ్యం కానుంది.

భారత్‌లో 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

ఈ థర్డ్ జనరేషన్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 గ్లోబల్ మార్కెట్లలో ఏడాది క్రితమే విడుదలైంది. కరోనా మహమ్మారి కారణంగా ఇండియా లాంచ్ ఆలస్యమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడుతున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 మొత్తం నాలుగు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. అయితే, భారత్‌లో మాత్రం ఇది ఒకే ఇంజన్ ఆప్షన్‌తో విడుదలైంది.

MOST READ: 19 సూపర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?

భారత్‌లో 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు

2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 మోడల్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఇండియన్ మార్కెట్లో ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఈ కూప్ మరియు ఆడి క్యూ8 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఆల్ట్రా లగ్జరీ కార్ సెగ్మెంట్లో విడుదలైన ఈ కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 చూడటానికి మునుపటి వెర్షన్ కన్నా మరింత లగ్జరీగా అనిపిస్తుంది. శక్తివంతమైన ఇంజన్ పెర్ఫార్మెన్స్, ఆల్ట్రా లగ్జరీ కంఫర్టీ ఫీచర్లతో ఇది ఈ సెగ్మెంట్ కస్టమర్లు ఖచ్చితంగా మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు.

Most Read Articles

English summary
BMW India has launched the 2020 X6 SUV in the country. The new (2020) BMW X6 is offered in two variants: xLine and M Sport; and both of them are priced at Rs 95 lakh, ex-showroom (India). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X