Just In
- 12 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 13 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 13 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 16 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్వాతంత్య దినోత్సవం : ఆగష్ట్ నెలలో భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త కార్లు, చూసారా ?
ఈ ఏడాది ఆగస్టు 15 న భారతదేశం తన 73 వ స్వాతంత్య దినోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా, వివిధ కార్ బ్రాండ్లు ఆ సమయంలో భారత మార్కెట్లో చాలా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాయి.
స్వాతంత్య దినోత్సవ వేడుకలు మరియు దేశంలో వేగంగా వచ్చే పండుగ సీజన్ కలయిక కావున కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేసే దిశలో వాహనదారులు ముందడుగు వేస్తారు. అంతే కాకుండా కొత్త ఉత్పత్తులు వాహనదారులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. కొత్త వాహనాల అమ్మకాలను మెరుగుపరచడానికి తయారీదారులు తమ పాత మోడళ్లపై డిస్కౌంట్ మరియు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తారు.

కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాపించడం వల్ల దాదాపు అన్ని కంపెనీలు తం ఉత్పత్తులను మరియు అమ్మకాలను పూర్తిగా నిలిపివేశాయి. ఈ కారణంగా ఈ సంవత్సరం మొదటి అర్ద భాగం అమ్మకాలకు పెద్ద అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో కార్ల తయారీదారులు రాబోయే కొద్ది నెలల్లో తిరిగి తమ అమ్మకాలను మెరుగుపరచడానికి ఇవి సహాయపడతాయి.
2020 ఆగస్టు నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే కార్లు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

1. కియా సోనెట్ కాంపాక్ట్-ఎస్యూవీ :
దక్షిణ కొరియా బ్రాండ్ అయిన కియా సోనెట్ కాంపాక్ట్-ఎస్యూవీ 2020 ఆటో ఎక్స్‌పోలో భారత మార్కెట్లో అరంగేట్రం చేసింది. భారతదేశంలో ప్రవేశించినప్పటి నుండి కియా సోనెట్ దేశీయ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఒకటి. భారతదేశంలో ఒకసారి ప్రారంభించిన తరువాత కియా సోనెట్ కాంపాక్ట్-ఎస్యూవీ, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

సెల్టోస్ మరియు కార్నివాల్ తరువాత దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ నుండి భారత దేశంలో అడుగుపెడుతున్న మూడవ మోడల్ ఈ కియా సోనెట్ అవుతుంది. కియా సెల్టోస్ మరియు కార్నివాల్ మాదిరిగానే, సోనెట్ ఎస్‌యూవీని కూడా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో తయారుకానుంది. కియా సోనెట్ ఎస్యూవీ, హ్యుందాయ్ వెన్యూ వలె అదే ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలతో ముందుకు వెళ్తుంది.

2. టాటా HBX మైక్రో-ఎస్యూవీ :
భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న మరో ఎస్యూవీ ఈ టాటా మోటార్స్ HBX అని పిలువబడే సరికొత్త ఎంట్రీ లెవల్ ఎస్యూవీ. టాటా హెచ్‌బిఎక్స్ అనేది భారతీయ మార్కెట్ కోసం రాబోయే మైక్రో-ఎస్యూవీ. ఇది కూడా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది.

భారతదేశంలో ఒకసారి ప్రారంభించిన కొత్త టాటా హెచ్‌బిఎక్స్, మహీంద్రా కెయువి 100 మరియు రెనాల్ట్ క్విడ్ మరియు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

3. న్యూ హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ :
భారత దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్ లో ఒకటి ఈ హ్యుందాయ్ ఎలైట్ ఐ 20. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ దేశంలోని మారుతి సుజుకి బాలెనో మరియు టాటా ఆల్ట్రోజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కొత్త తరం ఎలైట్ ఐ 20 అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైంది. అంతే కాకుండా భారత మార్కెట్లో కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం కూడా ఉంటుంది.
MOST READ:కొడుకు ఇచ్చిన ఐడియాతో తండ్రి సృష్టించిన ఎలక్ట్రిక్ సైకిల్ ; చూసారా..!

కొత్త హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 ఇప్పటికే దేశంలో గతంలో పలు సందర్భాల్లో పరీక్షించబడింది. కొత్త ఎలైట్ ఐ 20 హ్యాచ్‌బ్యాక్ పూర్తిగా లేటెస్ట్ డిజైన్‌తో వస్తుంది, ఇది మునుపటి కంటే ఆధునికంగా మరియు స్పోర్టిగా కనిపిస్తుంది.

4. రెనాల్ట్ డస్టర్ టర్బో-పెట్రోల్ ఎస్యూవీ :
రెనాల్ట్ భారత దేశంలో 2020 ఆటో ఎక్స్‌పోలో తన బ్రాండ్ అయిన డస్టర్ ఎస్యూవీ ప్రదర్శించింది. ఈ రెనాల్ట్ డస్టర్ 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 154 బిహెచ్పి మరియు 260 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టర్బో-పెట్రోల్ శక్తితో పనిచేసే రెనాల్ట్ డస్టర్ 2020 ఏప్రిల్‌లో విక్రయించబడుతుందని భావించారు, కానీ కరోనా లాక్డౌన్ వల్ల కొంత ఆలస్యం అయింది.
MOST READ:బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దుచేసిన సుప్రీంకోర్టు : ఎందుకో తెలుసా ?

ఇప్పుడు, రెనాల్ట్ డస్టర్ టర్బో-పెట్రోల్ వేరియంట్ ఆగస్టులో ఎప్పుడైనా ఇండియన్ మార్కెట్లో విక్రయించబడుతుందని వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి.

5. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే :
జర్మన్ బ్రాండ్ అయిన బిఎమ్‌డబ్ల్యూ ఈ ఏడాది ఆగస్టులో తన బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపేను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ప్రారంభించిన తర్వాత, కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్, 3 సిరీస్ సెడాన్ శ్రేణికి దిగువన ఉంటుంది. అంతే కాకుండా ఇది దేశంలో అత్యంత సరసమైన ఉత్పత్తి అవుతుంది.

భారతదేశంలో రాబోయే బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే 320 డి మోడల్‌కు శక్తినిచ్చే అదే 2.0-లీటర్ డీజిల్ యూనిట్ ద్వారా శక్తినిస్తుంది. పవర్ మరియు టార్క్ కూడా ఒకేలా ఉంటాయని భావిస్తున్నారు. బిఎండబ్ల్యు 2 సిరీస్ గ్రాన్ కూపే ధర చాలా తక్కువగా ఉంటుంది, ఇది భారతదేశంలో చాలా సరసమైన బిఎమ్‌డబ్ల్యూగా నిలిచింది.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
భారతదేశంలోని కార్ల తయారీదారులు ఇటీవల కోల్పోయిన అమ్మకాలను తిరిగి పొందటానికి రాబోయే నెలల్లో తిరిగి పొందాలని భావిస్తున్నారు. దేశంలో స్వాతంత్య దినోత్సవం రావడంతో కార్ల తయారీదారులు కొత్త వాహనాల కొనుగోలు పట్ల కస్టమర్లను ఆకర్శించడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆటో పరిశ్రమకు ఈ కరోనా వైరస్ చాలా నష్టాన్ని కలిగింది.