Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న కొత్త హ్యుందాయ్ ఐ 20 ఫస్ట్ డ్రైవ్ వీడియో.. చూసారా ?
హ్యుందాయ్ తన సరికొత్త ఐ 20 మోడల్‌ను ఇటీవల భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఐ 20 కారుకి ఇప్పటికే పదివేలకు పైగా బుకింగ్స్ వచ్చాయి. మేము ఇటీవల కొత్త ఐ 20 హ్యాచ్‌బ్యాక్ ను డ్రైవ్ చేసాము. సరికొత్త హ్యాచ్‌బ్యాక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

హ్యుందాయ్ ఐ 20 మెరుగైన డిజైన్, ఆకర్షణీయమైన ఇంటీరియర్స్ కలిగి ఉండటమే కాకుండా, మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంది. ఐ 20 మాగ్నా, స్పోర్ట్జ్, అష్టా మరియు అష్టా (ఓ) తో సహా మొత్తం నాలుగు వేరియంట్లలో తీసుకురాబడింది.
దీని బేస్ వేరియంట్ ధర రూ. 6.80 లక్షలు కాగా ఇందులోని టాప్ స్పెక్ ట్రిమ్ ధర రూ. 11.17 లక్షలు. ఇది ఆరు మోనో టోన్లు మరియు రెండు డ్యూయల్ టోన్ వేరియంట్లతో సహా ఎనిమిది కలర్ ఆప్సన్లలో తీసుకురాబడింది. సేఫ్టీ కోసం ఈ కారులో ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ ఇబిడి రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి అనేక ముఖ్యమైనఫీచర్స్ అందించబడ్డాయి.
భారత మార్కెట్లో కొత్త హ్యుందాయ్ ఐ 20 టాటా ఆల్ట్రోస్, మారుతి బాలెనో, హోండా జాజ్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ టెస్ట్ డ్రైవ్ వీడియోలో, కొత్త హ్యుందాయ్ ఐ 20 యొక్క డిజైన్, ఫీచర్స్, ఇంజన్ పెర్ఫామెన్స్, సస్పెన్షన్, సీటింగ్ మొదలైన వాటి గురించి సమాచారం తెలిపాము. హ్యుందాయ్ ఐ 20 గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.